ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వ్యాక్సిన్ అంతం చేసేందుకు త్వరలో కరోనా వ్యాక్సిన్ రాబోతోంది.. ఈ ఏడాది డిసెంబర్ నాటికి కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రావొచ్చు.. మనకు డిసెంబర్ నాటికి భారతీయ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ఫార్మా వర్గాలు చెబుతున్నాయి.
ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ సహకారంతో బ్రిటిష్ దిగ్గజం ఆస్ట్రాజెనెకా రూపొందిస్తున్న వ్యాక్సిన్ ఇప్పటికే రెండు, మూడు దశల క్లినికల్ ట్రయల్స్‌లో ఉంది. మరోవైపు దేశీయ కంపెనీలలో భారత్ బయోటెక్, జైడస్ క్యాడిలా సొంత వ్యాక్సిన్ తయారు చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి.
ICMR అనుబంధంతో భారత్ బయోటెక్ అభివృద్ధి చేస్తున్న కోవాగ్జిన్ ప్రస్తుతం తొలి దశ క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసుకుంది. జైడస్ క్యాడిలా రూపొందిస్తున్న జైకోవ్-డి సైతం తొలి దశ ట్రయల్స్ జరుగుతున్నట్టు ఫార్మా వర్గాలు వెల్లడించాయి.
దేశీయంగా ఆక్స్‌ఫర్డ్- ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ కోసం క్లినికల్ ట్రయల్స్‌కు అనుమతి పొందిన సీరమ్ ఇన్‌స్టిట్యూట్.. 1600 మందిపై పరీక్షించింది. ఎంపిక చేసిన 17 ప్రాంతాలలో 18ఏళ్లకు పైబడిన వారిపై 2-3 దశల ప్రయోగాలు చేపట్టినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
ఈ వ్యాక్సిన్ తయారీకి సీరమ్.. నెలకు 10 కోట్ల డోస్‌లను అందించే యోచనలో ఉంది. దేశీయంగా రూపొందిస్తున్న కంపెనీలు సైతం వ్యాక్సిన్లను ఐదు ప్రాంతాలలో 1,000 నుంచి 1100 మందిపై పరీక్షిస్తున్నామని పేర్కొంది.
ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ అభివృద్ధి చేసి పంపిణీ చేసే దిశగా బిల్, మిలిందా గేట్స్ ఫౌండేషన్ 5 కోట్ల డాలర్లు(రూ. 1125 కోట్లు) అందించాయని నివేదిక పేర్కొంది.