Paneer improves heart health and keeps sugar levels under control!
Paneer : పన్నీర్ వల్ల కేవలం రుచి మాత్రమే కాదు. దీని వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. పనీర్ బిర్యానీ, పనీర్ బటర్ మసాలా, పనీర్ 65 అనేక రకాల నోరూరించే వంటకాలను పన్నీర్ తో రుచికరంగా తయారు చేసుకోవచ్చు. మాంసాహారం తినలేని శాఖాహారులు పన్నీర్ తో తయారైన వంటకాలను ఆస్వాదిస్తారు. పాలను విరగొట్టటం ద్వారా తయారైన ఈ పన్నీర్ లో కాల్షియం, విటమిన్ డి సమృద్ధిగా ఉంటాయి. దీనిని తీసుకోవటం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు కాలుగుతాయి. అవేంటో తెలుసుకుందాం…
పన్నీర్ ను ఆహారంగా తీసుకుంటే కలిగే ప్రయోజనాలు ;
1.గుండెకు ఎంతో మంచిది, రక్తంలోని షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్ చేస్తుంది. పన్నీర్‌లో ఉండే మెగ్నీషియం క్యాటలిస్టులా పనిచేస్తుంది, జీవ రసాయనిక చర్యల్ని ప్రోత్సహిస్తుంది.
2. పనీర్ తినడం వల్ల ఎముకలు బలంగా మారుతాయి. కీళ్లనొప్పులు రావు. జీర్ణవ్యవస్థకు ఎంతో మేలు జరుగుతుంది. పనీర్ తినడం వల్ల అన్నీ లాభాలేనని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
3.రొమ్ము క్యాన్సర్ రాకుండా ఉండడానికి కాపాడుతుంది. మన శరీరం లో వివిధ రకాల ఎంజైమ్స్ ను యాక్టివేట్ చేయడానికి పన్నీర్ మీరు బాగా సహాయం చేస్తుంది. శాకాహారులకు ఇది మంచి శక్తిని ఇవ్వడానికి బాగా ఉపయోగ పడుతుంది.
4. ఒత్తిడిని తట్టుకోవడానికి పన్నీరు తీసుకోవచ్చు. ఇది టెన్షన్ ని తగ్గిస్తుంది. ఆకలి వేయక సతమతమయ్యే వాళ్ళు పన్నీర్ ని తీసుకోవడం వల్ల ఆకలి కలుగుతుంది. కండరాలు మరియు నాడుల పనితీరు నిర్వహిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
5. రేచీకటి తో ఇబ్బంది పడే వాళ్లు పనీర్ ని తీసుకుంటే నిరోధిస్తుంది. కంటి ఆరోగ్యాన్ని కూడా ఇది మెరుగు పరుస్తుంది. మనకు రోజూ అవసరమయ్యే కాల్షియంలో 8% దీని ద్వారా లభిస్తుంది. ఇది పిల్లలు, పెద్దల్లో ఎముకలు పటిష్టంగా ఉండేలా చేస్తుంది. గర్భవతులైన మహిళలకు అత్యుత్తమైన ఆహారంగా పన్నీరును చెప్పవచ్చు.
6. పన్నీర్ లో ఫాస్ఫరస్, ఫాస్ఫేట్‌లు జీర్ణక్రియను మెరుగుపరచటంలో సహాయపడతాయి. మలబద్ధకాన్ని తగ్గిస్తాయి. కణాల్లో శక్తిని ఉత్పత్తి చేసి, వాటిని వెలికి తీయడానికి తోడ్పడతాయి.
7.పన్నీర్‌లో ఉండే వే ప్రోటీన్ ఎంతో ఆరోగ్యవంతమైనది. ప్లేయర్లు, ఎక్సర్‌సైజ్‌లు చేసేవారికి ఇది మేలు చేస్తుంది. ఇది చాలా నెమ్మదిగా జీర్ణం అవుతూ, నెమ్మదిగా శక్తిని ఇస్తుంది.
8. పన్నీర్‌లో ఉండే జింక్ రోగనిరోధక శక్తిని మెరుగుపరచడానికీ, జీర్ణక్రియకు, షుగర్‌ని కంట్రోల్ చెయ్యడానికీ, టెన్షన్లను తట్టుకోవడానికీ ఉపయోగపడుతుంది.
9. సెలీనియం ఎక్కువగా ఉండే పన్నీరును వంటల్లో వేసుకొని తినడం వల్ల మన శరీరంలోకి విష వ్యర్థాలు రాకుండా ఉంటాయి. అలాగే రకరకాల వ్యాధుల నుంచీ తప్పించుకోవచ్చు.
10. పన్నీర్‌లో పొటాషియం కూడా ఉంటుంది. ఇది శరీరంలోని ద్రవ నియంత్రణ పదార్ధంగా పని చేస్తుంది. కండరాలు, బ్రెయిన్‌లో ముఖ్యమైన పదార్థం. రెగ్యులర్‌గా పన్నీరు తింటే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది.
అయితే పన్నీర్ ను అతిగా మాత్రం తినకూడదు. అధిక మోతాదులో తినటం వల్ల జీర్ణ పరమైన సమస్యలు ఎదురవుతాయి. బరువు పెరుగుతారు. గ్యాస్ వంటి సమస్యలు ఉత్పన్నం అవుతాయి. కొలెస్ట్రాల్ స్ధాయిలు పెరిగి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంటుంది. పాల ఉత్పత్తులు గిట్టని వారిలో పన్నీరు అలర్జీలకు దారి తీస్తుంది.