Parijata : దేవుని పూజకే కాదు, నొప్పుల నివారణలో ఔషధంగా పారిజాతం?

పారిజాత సారం శ్వాసనాళ కండరాలను వదులుపరుస్తుంది, తద్వారా దగ్గు మరియు బ్రోన్కైటిస్ లక్షణాల నుండి ఉపశమనం కూడా కలిగిస్తుంది. ఇది గొంతులో వాపు కూడా తగ్గిస్తుంది . వ్యాధికారక బ్యాక్టీరియాను కూడా చంపుతుంది.

How to use Harsingar leaves for joint pain

Parijata : ఇంట్లో పారిజాత మొక్కను నాటడం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఎందుకంటే, పారిజాత మొక్క భగవంతుని నిలయమని నమ్ముతారు. పారిజాత మొక్కను ఇంటి చుట్టూ ఉత్తరం లేదా తూర్పు దిశలో నాటడం వల్ల ఇంటి వాస్తు దోషాలు తొలగిపోతాయని కూడా నమ్ముతారు. పారిజాత పువ్వు పూజకు మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీని ఆకులకు, పుష్ఫాలకు ఎంతో విశిష్ట గుణాలున్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. పారిజాతం పూలల్లో ఎన్నో ఔషధ గుణాలున్నాయట. వైద్యంలో దీని మొక్కను, ఆకులను, గింజలు, పూలను ఎక్కువగా వినియోగిస్తారు. పారిజాత మొక్క వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం…

పారిజాత మొక్క ప్రయోజనాలు ;

1. పారిజాత స్త్రీల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది. ఆరోగ్యకరమైన, సంతోషకరమైన జీవితాన్ని గడపడానికి సహాయపడుతుంది.

2. చర్మ సమస్యలకు ఇది బాగా ఉపయోగపడుతుంది. పారిజాత మొక్క ఆకులను మెత్తగా నూరి చర్మానికి రాసుకుంటే చర్మ సమస్యలు నయమవుతాయి. దీని పువ్వుల ముద్దను ముఖానికి రాసుకుంటే ముఖం మెరుస్తుంది. పారిజాతం చెట్టు గింజలను మట్టిపాత్రలో వేసి నల్లగా అయ్యే వరకు వేడి చేయాలి. తరువాత ఈ గింజలను పొడిగా చేసి దానికి హారతి కర్పూరం పొడిని, కొబ్బరి నూనెను కలిపి పేస్ట్ గా చేసుకోవాలి. ఈ పేస్ట్ ను లేపనంగా రాయడం వల్ల గజ్జి, తామర వంటి చర్మ వ్యాధులు తగ్గుతాయి.

3. నొప్పుల నివారణకు గాను పారిజాతం చెట్టు ఆకులను మెత్తగా నూరి ఆ మిశ్రమాన్ని ఆముదంలో వేసి చిన్న మంటపై వేడి చేయాలి. ఈ మిశ్రమాన్ని వాతపు నొప్పులపై ఉంచి కట్టుకట్టడం వల్ల నొప్పులు తగ్గుతాయి.

4. ఆర్థరైటిస్, సయాటికా, ఎముకల పగుళ్లు, చర్మ వ్యాధులు, పైల్స్, జ్వరం, డెంగ్యూ, మలేరియా, పొడి దగ్గు, మధుమేహం మొదలైన వివిధ రుగ్మతలు, వ్యాధుల చికిత్సకు కూడా పారిజాత ఉపయోగించబడుతుంది.

5. పారిజాతం చెట్టు గింజలను ఎండబెట్టి పొడి చేసి..అందులో కొద్దిగా నీటిని కలిపి పేస్ట్ లా చేసుకుని తలకు పట్టించడం వల్ల తలలో వచ్చే కురుపులు, పుండ్లు తగ్గుతాయి. ఈ గింజల చూర్ణానికి కొబ్బరి నూనెను కలిపి తలకు రాసుకుని ఒక గంట తరువాత తలస్నానం చేయడం వల్ల చుండ్రు సమస్య తగ్గుతుంది.

6. పారిజాత సారం శ్వాసనాళ కండరాలను వదులుపరుస్తుంది, తద్వారా దగ్గు మరియు బ్రోన్కైటిస్ లక్షణాల నుండి ఉపశమనం కూడా కలిగిస్తుంది. ఇది గొంతులో వాపు కూడా తగ్గిస్తుంది . వ్యాధికారక బ్యాక్టీరియాను కూడా చంపుతుంది.

7. ఒత్తిడి మరియు ఆందోళనను తగ్గించడానికి పారిజాత నూనెను పరిమళ చికిత్సలో కూడా ఉపయోగిస్తారు. ఇది మీ మెదడులోని సెరోటోనిన్ స్థాయిలను కూడా పెంచుతుంది . మానసిక స్థితిని నియంత్రించి, సంతోష భావనను కూడా కలిగిస్తుంది.

8. పారిజాత సారాలు చాలా వ్యాధికారక బాక్టీరియా యొక్క పెరుగుదలను నిరోధించగలవని కూడా కనుగొన్నాయి. అందువల్ల అంటువ్యాధులని నివారించవచ్చు.

9. జుట్టు నష్టాన్ని నివారించేందుకు దీనిని ఉపయోగిస్తారు. పారిజాతం గింజలతో చేసిన కాషాయం లేదా టీ ని జుట్టుకు దాపురించే చుండ్రు, తలలో పేనుల బెడద నివారణకు ఆయుర్వేద వైద్యులు సూచిస్తున్నారు.