Blood Groups Covid : ఈ బ్లడ్‌ గ్రూప్‌ వారికే ఎక్కువగా కరోనా వస్తుందట!

ప్రపంచాన్ని కరోనా మహమ్మారి వణికిస్తోంది. మొదటి వేవ్ కంటే రెండో వేవ్ అత్యంత వేగంగా వ్యాపించింది. కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినా కరోనా వ్యాప్తి తగ్గినట్టే తగ్గి మళ్లీ తిరగబెడుతోంది.

People With B Blood Groups More Susceptible To Covid 19

Blood Groups Covid : ప్రపంచాన్ని కరోనా మహమ్మారి వణికిస్తోంది. మొదటి వేవ్ కంటే రెండో వేవ్ అత్యంత వేగంగా వ్యాపించింది. కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినా కరోనా వ్యాప్తి తగ్గినట్టే తగ్గి మళ్లీ తిరగబెడుతోంది. కరోనా ఒకసారి సోకి కోలుకున్నాక మళ్లీ వ్యాపిస్తోంది. చిన్న పెద్ద అనే వయస్సుతో తేడా లేకుండా అందరిలోనూ కరోనా వ్యాపిస్తోంది. అయితే కరోనా వ్యాప్తి ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. కొందరికి కరోనా సోకినా ప్రాణాలకు ప్రమాదమే ఉండదు.

మరికొంతమందిలో కరోనా చాలా తీవ్రంగా ఉంటుంది. ఎందుకు ఇలా జరుగుతుందంటే? రక్తం గ్రూపును బట్టి కూడా కరోనా సోకుతుందని ఓ అధ్యయనంలో తేలింది. సూర్యాపేట మెడికల్‌ కాలేజీ వైద్య బృందం నిర్వహించిన అధ్యయనంలో కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. రెండు నెలల పాటు జరిపిన ఈ అధ్యయనంలో ‘B’ బ్లడ్‌ గ్రూప్‌ వారిలోనే కరోనా వైరస్‌ ఎక్కువగా సోకుతున్నట్లు గుర్తించారు.

‘O’ బ్లడ్‌ గ్రూప్‌ వారికి కూడా కరోనా సోకుతున్నట్లు గుర్తించారు. యునైటెడ్‌ కింగ్‌డమ్‌ బ్రిటిష్‌ మెడికల్‌ మెడ్రివ్‌ జర్నల్‌ కూడా ఈ అధ్యయనాన్ని గుర్తించింది. కరోనా వైరస్‌ ఫస్ట్, సెకండ్‌ వేవ్‌ల సమయంలో సూర్యాపేట మెడికల్‌ కాలేజీలో కోవిడ్‌ చికిత్సపొందిన 200 మంది బాధితుల బ్లడ్ శాంపిల్స్ పాథాలజీ వైద్య బృందం సేకరించింది. ఈ బ్లడ్ శాంపిల్స్ పై గతేడాది ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో అధ్యయనాన్ని నిర్వహించారు.