Pfizer Vaccine In India : భారత్‌లో టీకా ఆమోదానికి తుది దశలో ఫైజర్!

అమెరికా ఫార్మా దిగ్గజం ఫైజర్.. ఇండియాలో తమ కొవిడ్ వ్యాక్సిన్ ఆమోద ప్రక్రియ తుది దశలో ఉందని పేర్కొంది. ఈ మేరకు కంపెనీ సీఈఓ Albert Bourla ఒక ప్రకటనలో వెల్లడించారు.

Pfizer Vaccine In India : అమెరికా ఫార్మా దిగ్గజం ఫైజర్.. ఇండియాలో తమ కొవిడ్ వ్యాక్సిన్ ఆమోద ప్రక్రియ తుది దశలో ఉందని పేర్కొంది. ఈ మేరకు కంపెనీ సీఈఓ Albert Bourla ఒక ప్రకటనలో వెల్లడించారు.

ఫైజర్ వ్యాక్సిన్ అనుమతికి సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం అతి త్వరలో ఖరారు అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నట్టు సీఈఓ తెలిపినట్టు ఓ నివేదిక వెల్లడించింది. భారత్ లో ఫైజర్ వ్యాక్సిన్ల సరఫరాకు సంబంధించి అంతర్గతంగా భారత ప్రభుత్వం ఫైజర్ కంపెనీతో చర్చలు జరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో ఇండియాలో ఫైజర్ ఆమోదానికి తుది దశలో ఉందంటూ నివేదికలు వచ్చాయి. ఫైజర్ వ్యాక్సిన్ల దిగుమతికి సంబంధించి ఏ తుది నిర్ణయమైన సరే.. భారత ప్రభుత్వం, ఆయా చట్టాలకు లోబడే ఉంటుందని ప్రభుత్వ సలహాదారు వినోద్ కుమార్ పాల్ పేర్కొన్నారు. ఈ ఏడాది ఆఖరులోగా ఫైజర్ వ్యాక్సిన్లు భారత్ లోకి అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నట్టు తెలిపారు.

ఇదివరకే ఫైజర్ ఇంక్, జర్మనీ భాగస్వామి బయోంటెక్ SE కొవిడ్-19 వ్యాక్సిన్‌ను నెల రోజుల వరకు ప్రామాణిక ఫ్రిడ్జ్ ఉష్ణోగ్రత వద్ద స్టోర్ చేయొచ్చునని యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వెల్లడించింది. టీకా ఓపెన్ చేయని ఫైజర్ వ్యాక్సిన్ల సీసాలను 2 నుంచి 8 డిగ్రీల సెల్సియస్ వద్ద రిఫ్రిజిరేటర్‌లో ఒక నెల వరకు నిల్వ చేయవచ్చునని ఈయూ డ్రగ్ రెగ్యులేటర్ పేర్కొంది. గతంలో అతిశీతల ఉష్ణోగ్రతల్లో మాత్రమే ఐదు రోజుల వరకే గరిష్ట పరిమితి ఉండేది.

ఇప్పుడు ఈ ఫైజర్ వ్యాక్సిన్ స్టోర్ చేయడానికి, టీకా సరఫరా చేయడానికి వీలుగా టీకా నియమాన్ని మార్చేసింది. వ్యాక్సిన్ స్టోరేజ్ స‌మ‌యాన్ని పెంచాలని, తద్వారా టీకా స‌ర‌ఫ‌రా కూడా వేగవంతం అవుతుందని తెలిపింది. ఫైజ‌ర్ టీకాలను అతిశీతల ఉష్ణోగ్రతలో స్టోర్ చేయడం ఇబ్బందికరంగా మారింది. ఫైజర్ టీకాలను కొన్ని దేశాలకు తీసుకువెళ్లే సమయంలో ఫైజ‌ర్ స్టోరేజీకి ఫ్రీజ‌ర్ల అవసరం పడటంతో ఇబ్బందులు త‌లెత్తాయి.

సాధారణంగా ఫైజర్ వ్యాక్సిన్ -80ºC -60ºC (-112ºF నుంచి -76ºF) మధ్య ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయాలి. దీనిని ప్రత్యేకంగా రూపొందించిన కంటైనర్లలో రవాణా చేయాల్సి ఉంటుంది. ఇప్పుడా పరిస్థితి లేదంటోంది. తొలుత మైన‌స్ 80 డిగ్రీల సెంటిగ్రేడ్ వ‌ద్ద నిల్వ చేయాల‌నే నియమం ఉంది. మైన‌స్ 25C ఉష్ణోగ్ర‌త మ‌ధ్య నిల్వ చేయాల‌ని అమెరికా కంపెనీ వెల్లడించింది.

ట్రెండింగ్ వార్తలు