Pfizer-Moderna Vaccines : ఇండియాలో స్ట్రెయిన్లపై ఫైజర్, మోడెర్నా వ్యాక్సిన్ల సత్తా తగ్గింది..!

భారత్‌లో కనుగొన్న డబుల్ ముట్యేట్ వేరియంట్‌లపై ఫైజర్, మోడెర్నా mRNA వ్యాక్సిన్లు సత్తా చాటలేకపోతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఒక ప్రకటనలో పేర్కొంది. ఫైజర్ వ్యాక్సిన్, మోడెర్నా వ్యాక్సిన్ల సమర్థత పరిమిత స్థాయికి తగ్గిపోయిందని తెలిపింది.

Pfizer, Moderna vaccines limited effectiveness on strain : భారత్‌లో కనుగొన్న డబుల్ ముట్యేట్ వేరియంట్‌లపై ఫైజర్, మోడెర్నా mRNA వ్యాక్సిన్లు సత్తా చాటలేకపోతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఒక ప్రకటనలో పేర్కొంది. ఫైజర్ వ్యాక్సిన్, మోడెర్నా వ్యాక్సిన్ల యాంటీబాడీలు పరిమిత స్థాయికి తగ్గిపోయిందని తెలిపింది. మ్యుటేట్ వైరస్ స్ట్రెయిన్ B.1.617ను ఆందోళనకర స్థాయిలో ప్రపంచ దేశాలకు విస్తరిస్తోందని నివేదిక పేర్కొంది. ఈ వ్యాక్సిన్లలో వైరస్‌ను ఎదుర్కొనే యాంటీబాడీల స్థాయిలో పరిమిత తగ్గింపును గుర్తించినట్టు ప్రాథమిక ల్యాబరేటరీ అధ్యయనాల్లో తేలింది.

WHO సూచించిన ప్రకటనలో ప్రధానంగా భారతీయ B.1.617 వేరియంట్ లక్షణాలను వివరించింది. ఈ వారం ప్రారంభంలో ఆందోళనకరమైన వేరియంట్‌గా ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. భారత వేరియంట్‌లో ఇతర మ్యుటేషన్లు (B.1.617.1, B.1.617.2 B .1.617.3) చాలా దేశాల్లో వేగంగా విస్తరిస్తున్నాయి. మరణాల తీవ్రత కూడా పెరుగుతోంది. అక్టోబర్లో మహారాష్ట్రలో మొట్టమొదట కనుగొన్న ఈ వేరియంట్ ఇప్పటివరకు 44 దేశాలలో కనుగొన్నట్టు WHO ప్రకటించింది.

ఈ టీకాలు మ్యుటేషన్లపై తక్కువ ప్రభావాన్ని చూపిస్తాయని ల్యాబరేటరీ డేటా సూచిస్తోంది. గ్లోబల్ హెల్త్ ఏజెన్సీ మూడు అధ్యయనాలను సూచించింది. ఫైజర్, మోడెర్నా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ల ద్వారా ఉత్పన్నమయ్యే యాంటీబాడీలు మ్యుటేట్ వైరస్‌లను నిర్వీర్యం చేసే సామర్థ్యంలో గణనీయమైన తగ్గింపును చూపించినట్టు తేలింది. మరోవైపు, వైరస్ మ్యుటేట్లపై కోవాక్సిన్ ఎక్కువగా ప్రభావవంతంగా పనిచేస్తోందని తేలింది. కోవిడ్ -19 నుంచి కోలుకున్న 24 మంది, మోడెర్నా వ్యాక్సిన్‌తో 15 మందికి, ఫైజర్ వ్యాక్సిన్‌తో 10 మందికి టీకాలు వేసి అధ్యయనాన్ని నిర్వహించింది.

అమెరికాలో కొవిడ్ జాతితో పోలిస్తే.. భారత్ నుంచి వచ్చిన వేరియంట్ గతంలో కొవిడ్-19 బారిన పడిన బాధితులు నుంచి లేదా టీకాలు వేసిన వారి నుంచి రక్తం ద్వారా తటస్థీకరణకు దాదాపు ఏడు రెట్లు తక్కువ అవకాశం ఉందని అధ్యయనం తేల్చింది. మ్యుటేట్ జాతి నుంచి ఎక్కువ నిరోధకత ఉన్నప్పటికీ, సోకిన వ్యక్తుల్లో సెరా (పాస్మా)లో ఎక్కువ భాగం టీకాలు వేసిన వారందరూ ఇప్పటికీ వేరియంట్‌ను న్యుట్రలైజ్ చేయగలిగినట్టు అధ్యయనం తెలిపింది.

ట్రెండింగ్ వార్తలు