Pimpkes
Pimples on Face: టీనేజీలోనే కాకుండా యుక్త వయస్సు దాటాక కూడా మొటిమలు వస్తున్నాయా.. ఎక్కువగా ఆయిల్ ఫుడ్స్, ఫ్యాట్ ఫుడ్స్ వంటివి తినే ఆహారపు అలవాట్లు కూడా ఈ సమస్యకు కారణం కావచ్చు. మొటిమల వల్ల పెద్దవయసులో ఏర్పడే మచ్చలు టీనేజీ సమయంలో వచ్చిన వాటికంటే కాస్త ఎక్కువకాలం ఉండిపోతాయి. కొద్దివారాలు మొదలుకొని నెలల తరబడి అలా ఉండిపోయే అవకాశాలు ఎక్కువ.
వీటి బాధ నుంచి విముక్తి కోసం తీవ్రతను బట్టి చికిత్స ఉంటుంది. మైల్డ్‌గా ఉన్న మొటిమలకు పైపూతగా వాడే మందులు, శాల్సిలిక్ యాసిడ్, గ్లైకోలిక్ యాసిడ్ వంటి క్లెన్సర్స్ వాడాల్సి ఉంటుంది. ఇంకాస్త తీవ్రంగా ఉన్నయనిపిస్తే రెటినాయిడ్స్ వంటి పూత మందులు వాడాలి. స్వేద రంధ్రాలు పూడుకుపోయి మొటిమలు వస్తునప్పుడు ఇవి బాగా ఉపయోగపడతాయి.
మరింత తీవ్రమైన మొటిమలకు రెటినాయిడ్స్‌తో పాటు కొన్నిసార్లు యాంటీబయాటిక్స్ వాడాల్సి ఉంటుంది. ఈ మందులతో ప్రయోజనం లేనప్పుడు నోటిద్వారా తీసుకునే ఓరల్ మెడిసిన్స్ డాక్టర్ సలహా మేరకు వాడాల్సిన అవసరం ఉంటుంది.
Read Also: ముఖంపై మచ్చలు, మొటిమలు తొలగించే పుదీనా ఫేస్ ప్యాక్స్
మొటిమలతో పాటు హార్మోన్ అసమతౌల్యతల్ని కూడా చూసుకోవాలి. వాటి కోసం కొన్ని హార్మోన్ సంబంధిత మందులు వాడాల్సి ఉంటుంది. చికిత్సలు పూర్తయ్యాక.. మొటిమల తాలూకు మచ్చలు, గాట్లు పోవడానికి కెమికల్ పీల్స్, డర్మారోలర్, లేజర్ చికిత్సలు, మైక్రో నీడిలింగ్, రేడియో ఫ్రీక్వెన్సీ వంటి ప్రక్రియలు చేయాల్సి ఉంటుంది.