Tooth Decay
Teeth : మనిషికి నోట్లు మనం తీసుకునే ఆహారాన్ని మెత్తగా నమిలి తినటానికి దంతాలు ఎంతగానో ఉపకరిస్తాయి. దంతాల మధ్య ఉండే బంకలాంటి పదార్ధాన్నే పాచి అని పిలుస్తారు. దంతాలపై తొలత ఈ పాచి తెల్లగా ఉంటుంది. ఆసమయంలో దీనిని గుర్తించటం కష్టం అవుతుంది. అయితే నోటిశుభ్రత , దంతాల శుభ్రత సరిగా లేని వాళ్లల్లో అది క్రమేపి పసుపు రంగులోకి మారుతుంది. దీని వల్ల దంతాలపై పసుపు,ముదురు గోధుమ వర్ణంలో మచ్చలు ఏర్పడతాయి. దీనినే గారగా పిలుస్తారు. చాలా మంది నోరు తెరిస్తే ఈ పండ్లపైన పసుపు వర్ణంలో ఉండే పాచి కనిపిస్తుంది. ఇది చూసే వారికి ఇబ్బంది కలిగిస్తుంది.
రోజు వారిగా దంతాలను సరిగా బ్రష్ చేయనందువల్ల తెల్లటి పదార్ధం పొరలా దంతాలపై పేరుకుపోతుంది. కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉండే ఆహారలు తీసుకున్న సందర్భంలో నోటిని సరిగా శుభ్రంచేసుకోకుంటే ఇది ఏర్పడుతుంది. నోటిలో మిగిలిపోయే చక్కెర అవశేషాలు బ్యాక్టీరియా పెరుగుదలకు కారణమౌతాయి. అందుకే దంతాల ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. పాచిని నివారించుకునేందుకు రోజుకు రెండు సార్లు దంతాలను బ్రష్ చేసుకోవటం మంచిది.
బ్రష్ చేసుకునే సమయంలో ఫ్లోరైడ్ తో కూడిన టూత్ పేస్టును ఉపయోగించాలి. యాంటీ బ్యాక్టీరియల్ మౌత్ వాష్ లను వాడుకోవటం వల్ల నోటిలో ఉండే బ్యాక్టీరియాను తొలగించేందుకు అవకాశం ఉంటుంది. పండ్ల మధ్య మిగిలిపోయిన ఆహార కణాలను ప్లోస్సింగ్ పక్రియ ద్వారా తొలగించుకోవాలి. నోటి శుభ్రత విషయంలో ఏమాత్రం అజాగ్రత్తగా వ్యవహరించిన నోటిలో పుండ్లు వంటి సమస్యలు ఎదురవుతాయి. దంతాల ఆరోగ్యం విషయంలో వైద్యుడిని సంప్రదించి తగిన సూచనలు సలహాలు తీసుకోవటం మంచిది.