Plant Based Foods : మొక్కల ఆధారిత ఆహారాలు.. శరీరానికి బెస్ట్ అంటున్న నిపుణులు

మొక్కల ఆధారిత ఆహారాలు మన చర్మాన్నికి ఎంతో మేలు చేస్తాయి. వీటి ద్వారా చర్మం కాంతివంతంగా మారుతుంది. ముఖ్యంగా ఆకుకూరలు తినండం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

Olympus Digital Camera

Plant Based Foods : మొక్కల ఆధారిత ఆహారాలతో ఆరోగ్యాన్ని మెరుగుపరచటంలో ఎంతో సహాయకారిగా పనిస్తుంది. వేల సంవత్సరాల కాలం నుండి మనుషులు మొక్కల ద్వారా లభించే ఆహారాన్ని తీసుకుంటూ ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడుతుండటం మనం కళ్లతో చూస్తూనే ఉన్నాం. మొక్కల ఆహారం మనిషి ఆరోగ్యంపై సానుకూల ప్రభావాలను చూపుతుంది. వీటిని తీసుకోవటం వల్ల ఎక్కువ శక్తి , కీళ్ల నొప్పులు ,బరువు తగ్గడం. రక్తపోటు, కొలెస్ట్రాల్ వంటివి ఆరోగ్యకరమైన స్థాయిల్లో ఉండేందుకు అవకాశం ఉంటుంది. మొక్కల ద్వారా లభించే ఆహారాన్ని తీసుకోవటమన్నది ఆరోగ్యకరమైన జీవనశైలికి దారి తీస్తుంది. రోజువారి ఆహారంలో మొక్కల అధారిత ఆహారాలు సజావుగా చేర్చుకుంటే అనేక అనారోగ్య సమస్యలకు పరిష్కారం దొరికినట్లేనని నిపుణులు సూచిస్తున్నారు.

జీర్ణాశయ ఆరోగ్యాన్ని మెరుగుపరటంలో మొక్కల అధారిత ఆహారలకు మించింది లేదనే చెప్పాలి. మొక్కల ఆధారిత ఆహారం జీర్ణవ్యవస్ధ ఆరోగ్యానికి మేలుకలిగించటంలో సహాయపడుతుందని అనేక పరిశోధనల్లో నిరూపితమైంది. మొక్కల ఆహారాలలో పుష్కలంగా ఉండే ఫైబర్ కారణంగా జీర్ణక్రియలకు ఎంతగానో దోహదపడుతుంది. శక్తి స్థాయిలను మెరుగుపరుస్తాయి. తక్కువ శక్తిని కలిగి ఉన్న సమయంలో ఈ ఆహారాలు తగినంత శక్తిని అందించటంలో సహాయపడతాయి. అథ్లెట్లు వంటి వారు శక్తికోసం మొక్కల ఆధారిత ఆహారం వైపు మొగ్గు చూపుతున్నారు. దీని వల్ల ఆలోచన తీరులో సైతం అనేక మార్పులు వస్తాయి. రోజు వారి కార్యకలాపాల్లో చురుకుగా వ్యవహరించేందుకు మొక్కల అధారిత ఆహారాలు తోడ్పడతాయి.

మొక్కల ఆధారిత ఆహారాలు మన చర్మాన్నికి ఎంతో మేలు చేస్తాయి. వీటి ద్వారా చర్మం కాంతివంతంగా మారుతుంది. ముఖ్యంగా ఆకుకూరలు తినండం వల్ల మంచి ఫలితం ఉంటుంది. పూర్వం నుండి మనపెద్దలు ఆకుకూరలు అధికంగా తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారని చెబుతూనే ఉండటం మనం వింటూనే ఉన్నాం.. మొక్కల ఆధారిత ఆహారాలు మన శరీరంలో యాంటీఆక్సిడెంట్ల సంఖ్యను ఎలా పెంచుతాయో 2020లో ఒక సమగ్ర అధ్యయనం ద్వారా తేటతెల్లమైంది. చర్మం ఆరోగ్యంగా ఉండేందుకు ఇవి ఎంతగా మేలు చేస్తాయో చెప్పే అనేక అధ్యయనాలు ఉన్నాయి. బరువును తగ్గించటంలో కూడా ఇవి సహాయపడతాయి. ఈ ఆహారాలలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. 2020 నుండి జరిపిన పరిశోధనలో, అధిక బరువున్న వారు మొక్కల ఆధారిత ఆహారాన్ని తీసుకోవటం ప్రారంభించాక వారి బరువులో అనేక మార్పులు గుర్తించినట్లు కొనుగొన్నారు.

మొక్కల ఆధారిత ఆహారాన్ని తినేవారిలో చాలా మంది రాత్రి సమయంలో ప్రశాంతమైన నిద్రపోతున్నట్లు తెలుస్తుంది. రాత్రి సమయంలో మంచి నిద్రకు ఈ ఆహారం కూడా ఒక కారణమని పరిశోధకులు చెబుతున్నారు. మొక్కల ఆధారిత ఆహారాలు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి, గుండె జబ్బుల రేటు, టైప్-2 మధుమేహం వంటి వాటిని నియంత్రిస్తాయని పలు అధ్యయనాల్లో వెలుగుచూశాయి. మొక్కల అధారిత ఆహార మంటే కూరగాయలు, పండ్లు, దుంపలు, తృణధాన్యాలు, మొక్కల అధారిత నూనెలు, కొవ్వులు, గింజలు, విత్తనాలు, సుగంధ ద్రవ్యాలు, మూలికలు ఇవన్నీ ఆకోవకే చెందుతాయి. వీటిని ఉడికించుకోని తినవచ్చు.