Pomegranate Fruits : గుండెతోపాటుగా మెదడు ఆరోగ్యానికి మేలు కలిగించే దానిమ్మ పండ్లు!

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించటంలో దానిమ్మ బాగా ఉపకరిస్తుంది. తక్కువ సాంద్రత కలిగిన చెడు కొలెస్ట్రాల్ ధమనులను అడ్డుకుంటుంది. దీన్ని తగ్గించడంలో దానిమ్మ రసం ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది.

Pomegranate fruits are good for heart and brain health!

Pomegranate Fruits : దానిమ్మ ఎన్నో రకాల పోషకాలు కలిగి ఉంది. ఈ పండులో పొటాషియం మెగ్నీషియం, కాల్షియంతో ,పాటు పీచు పదార్థం కూడా అధికంగా ఉంటుంది. విటమిన్ సి ,బి ,ఏ ఎక్కువగా ఉంటాయి. ఈ పండులో ఉండే పోషకాలు గుండె జబ్బులు ,హైపర్ టెన్షన్ ,క్యాన్సర్ ,డయాబెటిస్ వంటి వ్యాధులు రాకుండా కాపాడుతాయి. తియ్యగా, పుల్లగా ఉండే దానిమ్మ పండును సలాడ్లు, జ్యూస్ గా చేసుకుని తాగుతుంటారు. రోజువారిగా దానిమ్మను తీసుకోవటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

దానిమ్మ పండుతో ఆరోగ్య ప్రయోజనాలు ;

1. ఒక దానిమ్మకాయలో 80 క్యాలరీలు, 16 కార్బోహైడ్రేట్స్ మరియు మూడు గ్రాములు ఫైబర్ ఉంటుంది. దానిమ్మ పండులో యాంటీ ఇన్ఫ్లమెంటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి. దానిమ్మ జ్యూస్ రోజు తాగడం వల్ల రక్తహీనత సమస్యలు తగ్గుతాయి. అలాగే జీర్ణవ్యవస్థకు సంబంధించిన కడుపునొప్పి ఉబ్బసం గ్యాస్ మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయి.

2. ఈ పండ్లు క్యాన్సర్ ను కూడా నివారించడంలో సహాయపడుతాయని పలు అధ్యయనాలు వెల్లడించాయి. దీనిలోని ప్లేవనాయిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు మీ కణాలను రక్షిస్తాయి. ముఖ్యంగా ఫ్రీరాడికల్స్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. దానిమ్మ పండ్లను తినడం వల్ల పెద్దపేగు క్యాన్సర్, ప్రోస్టేట్, ఊరిపిరితిత్తుల క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుందని పలు పరిశోధనలు వెల్లడించాయి. చర్మం, ఊపిరితిత్తుల, పెద్దపేగు లను ప్రాణాంతక రోగాలను నుంచి రక్షిస్తాయని నిరూపించబడింది.

3. దానిమ్మలో విటమిన్ కె అధికంగా ఉంటుంది. అందువల్ల రక్తం గడ్డ కట్టకుండా ఉంటుంది. దానిమ్మలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కండరాలు దృఢంగా ఉంటాయి. దానిమ్మ పంటి సమస్యలను దూరం చేస్తుంది. జ్ఞాపకశక్తిని పెంచుతుంది.

4. దానిమ్మ తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి బలపడుతుంది. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. దానిమ్మలో యాంటీ ఏజింగ్ గుణాలు కూడా ఉన్నాయి. దానిమ్మ కీళ్ళనొప్పుల నుండి రక్షిస్తుంది. రక్తంలో ఇనుమును ఉత్పత్తి చేస్తుంది, ఇది హిమోగ్లోబిన్ మొత్తాన్ని పెంచుతుంది. పెరిగిన హిమోగ్లోబిన్ బలహీనత మరియు మైకము వంటి రక్తహీనత లక్షణాల సంభావ్యతను తగ్గిస్తుంది.

5. రక్తపోటును తగ్గించడంలో దానిమ్మ పండ్ల వినియోగం ప్రయోజనకరంగా ఉంటుందని మరొక అధ్యయనం కనుగొంది. దానిమ్మలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా అడ్డుకుంటాయి. రెండు వారాల పాటు రోజూ 150 మి.లీ దానిమ్మ రసాన్ని తాగడం వల్ల రక్తపోటు గణనీయంగా తగ్గుతుందని ఒక అధ్యయనంలో తేలింది.

6. యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ గుణాలు పుష్కలంగా ఉన్న దానిమ్మ నోటిలో ఫలకం ఏర్పడకుండా చేస్తుంది. దానిమ్మ రసం చిగురువాపు మరియు పీరియాంటైటిస్ నుండి ఉపశమనం కలిగిస్తుంది. దానిమ్మ పండ్లు ఫైటోకెమికల్స్ వ్యాధికారక బ్యాక్టీరియా, ఈస్ట్, శిలీంద్రాలకు వ్యతిరేకంగా పోరాడుతాయి. నోటి దుర్వాసన, దంతక్షయానికి కారణమయ్యే నోటి బ్యాక్టీరియాను కూడా అంతం చేస్తాయి.

7. దానిమ్మ పండులో పాలీఫెనాల్స్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. దానిమ్మ జ్యూస్ గుండెపోటును తగ్గిస్తుంది. అలాగే ధమనుల్లో ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంతో పాటుగా శరీర మంటను కూడా తగ్గిస్తుంది. స్ట్రోక్, గుండెపోటుకు దారితీసే అథెరోస్ల్కెరోటిక్ ఫలకం అభివృద్ధి చెందకుండా చూస్తుంది. ఫ్రీరాడికల్స్ వల్ల వచ్చే సమస్యలను తగ్గించడానికి దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి.

8. మధుమేహులకు దానిమ్మ పండ్లు ప్రయోజనకరంగా ఉంటాయి. వీటిని రోజూ తినడం వల్ల టైప్ 2 డయాబెటీస్ ఉన్నవారిలో ఇన్సులిన్ నిరోధకత మెరుగుపడుతుంది. మన శరీరం ఇన్సులిన్ హార్మోన్ ను సరిగ్గా ఉపయోగించుకోలేనప్పుడు మధుమేహం బారిన పడతారు. అందుకే మధుమేహులు దానిమ్మపండును తప్పకుండా తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

9. గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించటంలో దానిమ్మ బాగా ఉపకరిస్తుంది. తక్కువ సాంద్రత కలిగిన చెడు కొలెస్ట్రాల్ ధమనులను అడ్డుకుంటుంది. దీన్ని తగ్గించడంలో దానిమ్మ రసం ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. అంతేకాదు అధిక సాంద్రత కలిగిన అంటే మంచి కొలెస్ట్రాల్ ను ఇది పెంచుతుంది. దీంతో స్ట్రోక్, గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది.

10. దానిమ్మ రసం మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా చూస్తుందని ఒక అధ్యయనంలో తేలింది. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లే కిడ్నీల్లో రాళ్లు ఏర్పడకుండా చేస్తాయి. దానిమ్మ పండు కిడ్నీల్లో రాళ్లను ఏర్పరిచే ఆక్సలేట్లు, కాల్షియం, ఫాస్పేట్ల రక్త స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.