Porridge that protects the skin from infections and prevents hair fall!
Porridge : గ్రామీణ ప్రాంతాల్లో గంజిని నేటికి ఆహారంగా తీసుకుంటున్నారు. గంజిని ప్రతిరోజు క్రమంతప్పకుండా తీసుకోవడం ద్వారా చాలా రకాల అనారోగ్య సమస్యలు దరిచేరకుండా చూసుకోవచ్చు. గంజిలో విటమిన్ సి , విటమిన్ ఈ, విటమిన్ బి తో పాటు అనేక రకాల పోషకాలు లభిస్తాయి. వీటివల్ల మన ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. దీనిని సేవించటం వల్ల శరీరానికి కావలసిన శక్తి లభిస్తుంది. అలసట, నీరసం , నిస్సత్తువ వంటి సమస్యలు తొలగిపోతాయి. నీరసంగా ఉన్నప్పుడు కాస్త గంజి తాగితే సరి.గంజిలో ఉండే ఆమినో ఆమ్లాలు శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి.
గంజి మన చర్మానికి చాలా చక్కటి మేలు చేస్తుంది. చర్మ సౌందర్యాన్ని పెంచే అధ్బుతమైన లక్షణాలను కలిగి ఉంది. ఒక కాటన్ బాల్ తీసుకుని గంజిలో ముంచి ముఖచర్మంపై అప్లై చేయడం ద్వారా మెుటిమలు మరియు మెుటిమలు వలన ఏర్పడిన నల్లటి మచ్చలు నివారించుకోవచ్చు. ఇన్ఫెక్షన్ల ప్రభావాన్ని తగ్గించడంతోపాటు అతినీలలోహిత కిరణాల నుండి మన చర్మాన్ని కాపాడే శక్తి గంజికి ఉంది . వయస్సు పైబడటం వలన వచ్చే ముడతలు చాలావరకూ నివారించుకోవచ్చు. వృద్ధాప్య ఛాయలను తగ్గించి యవ్వనవంతమైన చర్మాన్ని ఇస్తుంది. శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేయడానికి .. జీర్ణక్రియ పనితీరు పెంచడానికి, క్యాన్సర్ వంటి వ్యాధులు రాకుండా కూడా గంజి సహాయపడుతుంది.
గంజిని జుట్టు కుదుళ్లకు అప్లై చేయడం ద్వారా జుట్టు పట్టులా మెరుస్తుంది. చిన్న పిల్లల్లో కూడా జుట్టు నెరవడం, జుట్టు రాలిపోవడం లాంటి సమస్యలు దరిచేరకుండా ఉండాలంటే గంజిని తలకు పట్టించి 20 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ తర్వాత తేలికపాటి షాంపూ, కండిషనర్ తో తలస్నానం చేయటంవల్ల జుట్టు రాలిపోయే సమస్యలు తొలగిపోతాయి. అన్నం వార్చగా వచ్చే గంజిలో యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ తొలగిపోవడానికి సహాయపడతాయి. ఉదర సంబంధ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి గంజి ఎంతగానో ఉపకరిస్తుంది. డయేరియా బాధిస్తుంటే.. తరచుగా గంజి తీసుకోవడం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు.