Potato : ముఖంపై ముడతలు, కళ్ల కింద నల్లటి వలయాలు పోగొట్టే బంగాళదుంప!

బంగాళ దుంపలో కాటలేజ్ ఎంజైమ్ లు ఉంటాయి. ఇవి నల్లటి వలయాలను తగ్గించేందుకు సహాయపడతాయి. ఎండ తీవ్రత కారణంగా నల్లబడిన చర్మంపై బంగాళ దుంప రసాన్ని రాస్తే ఉపశమనం లభిస్తుంది.

Potato Skin Care

Potato : బంగాళ దుపంలోని పోషకాలు చర్మ సంరక్షణకు ఎంతగానో ఉపయోగపడతాయి. బంగాళ దుంప ముక్కల్ని కోసం ముఖంపై రాస్తే చర్మం మెరుపుదనం సంతరించుకుంటుంది. ఆలూ ముక్కల్ని గుండ్రంగా కోసి నీళ్లలో పదినిమిషాలు ఉంచాలి. ఆతరువాత వాటిని తీసుకుని ముఖానికి రుద్దుకుంటే చర్మం తాజాగా ఉంటుంది. కీరదోస గుజ్జు రెండు చెంచాలు , తొక్కు తీసిన బంగాళ దుంప గుజ్జు పావు కప్పు తీసుకుని ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి. పదినిమిషాల తరువాత చల్లని నీటితో కడుక్కోవాలి. ఇలా చేస్తే ముఖం కాంతి వంతంగా మారుతుంది.

బంగాళ దుంప గుజ్జులో , నాలు స్పూన్ల యాపిల్ గుజ్జు వేసి ముఖానికి ఈ మిశ్రమాన్ని అప్లై చేయాలి. 20 నిమిషాల అనంతరం కడుక్కోవాలి. తరచూ ఇలాగే చూస్తుంటే ముఖంపై ముడతలు పోతాయి. బంగాళ దుంప రసం, నిమ్మరసం, ముల్తానీ మట్టీ రెండు స్పూన్ల చొప్పున తీసుకుని బాగా కలుపుకోవాలి. ఆమిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి. 20 నిమిషాల తరువాత చల్లని నీటితో ముఖాన్ని కడుక్కుంటే చర్మ మృదువుగా మారుతుంది. కళ్లకింద నల్లటి వలయాలను తగ్గించేందుకు బంగాళ దుంప బాగా ఉపకరిస్తుంది. చెక్కు తీసిన ఆలూను వలయాకారంగా ముక్కలుగా కోయాలి. వాటిని కళ్లపై పావుగంట ఉంచి గోరు వెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి.

బంగాళ దుంపలో కాటలేజ్ ఎంజైమ్ లు ఉంటాయి. ఇవి నల్లటి వలయాలను తగ్గించేందుకు సహాయపడతాయి. ఎండ తీవ్రత కారణంగా నల్లబడిన చర్మంపై బంగాళ దుంప రసాన్ని రాస్తే ఉపశమనం లభిస్తుంది. మచ్చలు తొలగిపోతాయి. బంగాళ దుంప రసం, దోసకాయ రసంతో బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని దూదితో తీసుకుని కళ్ళ కింద ఉన్న వలయాల మీద రుద్దాలి. ఆ తర్వాత 20 నిమిషాలయ్యాక శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా చేస్తే నల్లటి వలయాలు పోతాయి.