Prevention of Alzheimer’s : వయసు పైబడిన వారిలో అల్జీమర్స్ రాకుండా ఉండాలంటే ముందునుండే జాగ్రత్తలు అవసరం!

ఆరోగ్యకరమైన జీవనశైలితో పాటు సమతుల్య ఆహారం తీసుకోవడం వల్ల అల్జీమర్స్ వ్యాధి ప్రభావాలను నివారించవచ్చు. కుటుంబ సభ్యులు అల్జిమర్స్ తో బాధపడుతున్న వారికి తగిన తోడ్పటును అందించటం చాలా ముఖ్యం.

అల్జిమర్స్‌ ఎక్కువగా వయసు పై బడిన వాళ్లలో , ఒత్తిడికి గురయినవాళ్లు, ఆహారపు అలవాట్లు , బిపి, షుగర్‌, మద్యం , ధూమపానం అలవాట్లు ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా 50 సంవత్సరాలు దాటిన వాళ్లలో , మగవాళ్ళల్లో , ఆడవాళ్ళలో వస్తుంది. వయస్సు పెరిగేకొద్ది జబ్బు పెరిగే అవకాశం ఉంది. మొదటిలో మతిమరుపుతో ప్రారంభమయ్యి తీవ్రంగా మారి మన జీవన శైలి మీద ప్రభావం చూపిస్తుంది. ఇంట్లో తాళాలు పెట్టి మరచిపోవడం , వస్తువులు ఒక చోట పెట్టి ఇంకొక చోట వెతకడం వంటివి అల్జిమర్స్‌ లక్షణం కాదు. బయట కి వెళ్లి ఇంటికి దారి మర్చిపోవడం , స్నానం చేసి బట్టలు వేసుకోవడం మరచిపోవడం , భోజనం చేసినట్టు మరిచిపోయి మళ్లీ, మళ్లీ భోజనం చెయ్యడం వంటివి చోటు చేసుకుంటే మాత్రం అల్జీమర్స్ కు ప్రధాన సంకేతాలుగా గుర్తించాలి.

ఆరోగ్యకరమైన జీవనశైలితో పాటు సమతుల్య ఆహారం తీసుకోవడం వల్ల అల్జీమర్స్ వ్యాధి ప్రభావాలను నివారించవచ్చు. కుటుంబ సభ్యులు అల్జిమర్స్ తో బాధపడుతున్న వారికి తగిన తోడ్పటును అందించటం చాలా ముఖ్యం. అల్జిమర్స్‌ వచ్చిన వ్యక్తిని అర్థం చేసుకోవడం, వాళ్ళకి కావలసిన మార్పులు చెయ్యడం వంటివి చెయ్యాలి. ఈ జబ్బును తగ్గించుకోవడానికి తరచుగా మెదడుకు పదును పెట్టే కార్యక్రమాలలో పాలుగొనడం, పజ్జిల్స్‌ వంటివి చెయ్యడం వల మెదడుకు సంబంధించిన వ్యాయామం చెయ్యడం వంటి వల్ల ఈ వ్యాధి భారిన పడే అవకాశాలు తగ్గుతాయి.

నివారణకు ముందస్తు జాగ్రత్తలు ;

1. నిద్రకు తగినంత సమయం కేటాయించాలి. శరీరానికి, మనస్సుకు విశ్రాంతి తీసుకోవటం వల్ల హార్మోన్ల విడుదల సక్రమంగా ఉంటుంటుంది. దీంతో మెదడు చురుకుగా ఉంటుంది.

2. రోజువారిగా తాజా పండ్లను తీసుకోవాలి. పండ్ల లో ఉండే ఫాలీఫెనాల్స్ అల్జీమర్స్ ను నివారించేందుకు తోడ్పడతాయి.

3. మద్యం సేవించటం, పొగ తాగటం వంటి అలవాట్లకు దూరంగా ఉండాలి. ఈ అలవాట్లు ఉంటే మాత్రం అల్జీమర్స్ ముప్పు మరింత రెట్టింపవుతుంది.

4. రోజువారిగా తేలికపాటి వ్యాయామాలు చేయాలి. ఇలా చేయటం వల్ల మెదడుకు రక్త సరఫరా మెరుగవుతుంది. మెదడులో కొత్త కణాలు అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంటుంది.

5. ధ్యానం మెదడు ఆరోగ్యానికి ఉపకరిస్తుంది. మెదడును చురుకుగా ఉంచే ఫజిల్స్, చదరంగం వంటి వాటిని ప్రయత్నించాలి. వీటి వల్ల మెదడులోని కణాలు చురుకుగా మారేందుకు అవకాశం ఉంటుంది.

ట్రెండింగ్ వార్తలు