cloves : లవంగాలతో కేన్సర్ నుండి రక్షణ!..

ముఖ్యంగా లవంగాలు కేన్సర్ నిరోధకాలుగా పనిచేస్తాయని పలు పరిశోధనల్లో తేలింది. కేన్సర్ కణుతుల పెరుగుదలను ఆపడంతోపాటు , కేన్సర్ కణాలను చంపడంలో బాగా ఉపయోగపడుతుంది. శ్వాసకోశ నాళానికి సంబంధ

Cloves1

cloves : సుగంధ ద్రవ్యంగా లవంగాన్ని చెప్పవచ్చు. రుచికోసం కూరల్లో వినియోగించే లవంగం ప్రతి ఇంట్లో పోపు డబ్బాల్లో తప్పనిసరిగా ఉంటుంది. లవంగంలో విలువైన పోషకాలేకాదు ఎన్నో ఔషదగుణాలు కూడా ఉన్నాయి. దీనిలో కాల్షియం, ఫాస్పరస్, పొటాషియం, హైడ్రోక్లోరిన్ ఆసిడ్, మంగనీస్, ఇనుము, కార్భోహైడ్రేట్లు, విటమిన్ ఎ, సిలు ఉన్నాయి.

లవంగాలు నొప్పిని తగ్గించే గుణాన్ని కలిగిఉన్నాయి. ఇది అనస్థటిక్ గా పనిచేస్తుంది. ఇందులో ఉండే యూజినాల్ పంటినొప్పిని తగ్గిస్తుంది. ఇందుకు కారణం యాంటీ బ్యాక్టీరియల్ గుణాలను కలిగి ఉండటనని చెప్పవచ్చు. పన్ను నొప్పితో చాలా మంది బాధపడుతుంటారు. అలాంటి వారు కొన్ని లవంగాలను పంటిక్రింద పెట్టుకుని కొరికి చప్పరించాలి. ఇలా చేయటం వల్ల విడుదలయ్యే లవంగతైలం పంటినొప్పి నుండి ఉపశమనం కల్పిస్తుంది.

ముఖ్యంగా లవంగాలు కేన్సర్ నిరోధకాలుగా పనిచేస్తాయని పలు పరిశోధనల్లో తేలింది. కేన్సర్ కణుతుల పెరుగుదలను ఆపడంతోపాటు , కేన్సర్ కణాలను చంపడంలో బాగా ఉపయోగపడుతుంది. శ్వాసకోశ నాళానికి సంబంధించిన కేన్సర్ నుండి లవంగాల్లోని యూజినాల్ రక్షణ కల్పిస్తుంది. లవంగాల్లోని యాంటీ ఆక్సిడెంట్లు కేన్సర్ రాకుండా రక్షణ కల్పిస్తాయి.

లవంగాల్లో ఉండే యూజినాల్ శక్తివంతమైన యాంటీ ఇన్ ఫ్లమేటరీగా పనిచేయటం వల్ల గొంతు, నోట్లు వచ్చే ఇన్ ఫ్లమేషన్ సమస్యలను తగ్గించుకోవటానికి ఉపకరిస్తాయి. లవంగ నూనె సైతం నోటి సమస్యల నుండి ఉపశమనం పొందటానికి చాలా మంది ఉపయోగిస్తారు.