Bathukamma
Bathukamma 2023 : ఈ భూలోకంలోనే కాదు ముల్లోకాల్లోను దేవుళ్లను పూలతోనే పూజిస్తారు. కానీ పూలనే పూజించే అరుదైన అద్భుతమైన..ప్రకృతి పండుగ బతుకమ్మ పండుగ. గడ్డి పూలు కూడా బతుకమ్మలో ఇమిడిపోయి మమేకమైపోయే ఆనందాల పండుగ బతుకమ్మ పండుగ. పూలనే దైవంగా కొలిచే ఏకైక పండుగ.. బతుకమ్మ. ప్రకృతినిఆరాధిస్తూ సాగే పూల పండుగలో బతుకమ్మలో ఒదిగిపోయే పువ్వులు ఎన్నో ఎన్నెన్నో..
చేలల్లోను, చెలకల్లోను, పొలం గట్లపైనా, తుప్పల్లోను, గుట్టల్లోను ముళ్ల కంచెల్లోను, రాళ్లల్లోను ఎక్కడపడితే అక్కడ బతుకమ్మ పూలు విరబూస్తాయి. రంగు రంగులుగా వికసిస్తాయి.తీరొక్క పూలే.. బతుకమ్మలో అందంగా ఒదిగిపోతాయి. నేలపైనే రంగుల హరివిల్లును తలపిస్తాయి. తంగేడు, గునుగు, సీతమ్మ కుచ్చులు, బంతులు,చేమంతులు, కట్లపూలు,తామరపూలు,బీరపూలు, గుమ్మడి పూలు.. ఒక్కటేమిటి తీరొక్క పూలు, బతుకమ్మను వర్ణశోభితం చేస్తాయి.
Bathukamma 2023 : తంగేడు పువ్వులకు బతుకమ్మకు ఉన్న సంబంధం..
బతుకమ్మలో అన్ని పూలు సమానమే అయినా గుమ్మడి పువ్వుకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. బతుకమ్మ సిగలో గుమ్మడి పువ్వు కొలువై ఉంటుంది. బతుకమ్మను పేర్చడం గుమ్మడి ఆకులతో మొదలవుతుంది. తాంబలంలో గుమ్మడి ఆకులు పేర్చి వాటిపై పువ్వులను బతుకమ్మగా పేర్చుకుంటు పైకి పిరమిడ్ లా తయారు చేస్తారు ఆడబిడ్డు. అలా గుమ్మడి ఆకులతో మొదలైన బతుకమ్మ గుమ్మడి పువ్వులోని గౌరమ్మను ప్రతిష్ఠించడంతో పూర్తవుతుంది. ఆ గుమ్మడి పువ్వులో పసుపు గౌరమ్మ ప్రతిష్టంచబడిుతుంది. బతుకమ్మ సిగలో గుమ్మడిపువ్వు కొలువైతే ఆ గుమ్మడి పువ్వులో పసుపుతో చేసిన గౌరమ్మ కొలువుదీరుతుంది. దీనితో బతుకమ్మ పూర్తి అయినట్లే..పాటలతో బతుకమ్మలు ఆడతారు ఆడబిడ్డలు.
Bathukamma 2023 : తొమ్మిది రోజులు, తొమ్మిది రకాల బతుకమ్మలు, నైవేద్యాలు
పండుగతోపాటే గుమ్మడి తీగ కూడా మొగ్గలు తొడుగుతుంది. ఈ పూలల్లో సహజసిద్ధ ‘పసుపు గౌరమ్మ’ కొలువై ఉంటుంది. గుమ్మడి పువ్వు శాస్త్రీయనామం కుకుంబిటాపిపో’దీనిలో విటమిన్-ఎ, సి పుష్కలం. వయసు మీద పడ్డాక వచ్చే కాళ్ల నొప్పుల్ని తగ్గిస్తుంది. ప్రొస్టేట్ గ్రంథికి ఎలాంటి హాని కలగకుండా కాపాడుతుంది. అలా బతుకమ్మ పండుగలో గుమ్మడిపువ్వుది ఓ ప్రత్యేక స్థానంగా అలరారుతోంది.