Purple Style Labs : రోజుకి రూ.10 లక్షలు అద్దె కట్టి ప్లేస్ లీజుకు తీసుకున్న కంపెనీ.. ఏంటా స్టోర్? ఏం అమ్ముతారు? ఎంత సేల్ ఉండాలి..!

ముంబైలోని ఇస్మాయిల్ బిల్డింగ్ లో 60వేల స్క్కేర్ ఫీట్ రిటైల్ స్పేస్ ను ఐదేళ్ల కాలానికి లీజుకి తీసుకుంది. ఈ స్టోర్ కోసం నెలకు 3 కోట్లు అద్దె చెల్లించనుంది.

Purple Style Labs : రోజుకి అద్దె 10 లక్షలు.. ఏంటి.. షాక్ అయ్యారా.. దిమ్మతిరిగిపోయింది కదూ. అసలు.. ఇది నిజమేనా అనే డౌట్ కూడా వచ్చే ఉంటుంది మీకు. నిజమే.. అందులో ఎలాంటి సందేహాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. రెంట్ రోజుకి అక్షరాల 10 లక్షల రూపాయలు. అంత అద్దె చెల్లించి ఆ స్థలాన్ని లీజుకి తీసుకున్న కంపెనీ ఏంటి? అక్కడ ఎలాంటి స్టోర్ ఓపెన్ చేసింది? అసలు వాళ్లు ఏమి అమ్ముతారు? అంత రెంట్ చెల్లించాలంటే దానికి ఎంత ఆదాయం వస్తుండాలి? ఇలా.. అనేక సందేహాలు మీకు వచ్చే ఉంటాయి.

ఆ వివరాల్లోకి వెళితే.. ఆ సంస్థ పేరు పర్పుల్ ల్యాబ్ స్టైల్స్. ఈ కంపెనీనే రోజుకి 10 లక్షలు అద్దె చెల్లించనుంది. పర్పుల్ స్టైల్ ల్యాబ్స్.. భారతదేశంలోని అగ్రశ్రేణి డిజైనర్లను ఒకే వేదిక కిందకు తీసుకొచ్చే విలాసవంతమైన ఫ్యాషన్ హౌస్.

2015లో అభిషేక్ అగర్వాల్ స్థాపించారు. పర్పుల్ స్టైల్ ల్యాబ్స్ ఓమ్నిచానెల్ లగ్జరీ ఫ్యాషన్ ప్లాట్‌ఫామ్. ఇక్కడ ప్రజలు భారతీయ డిజైనర్ దుస్తులను డిస్కవర్ చేయొచ్చు, కొనుగోలు కూడా చేయవచ్చు. డిజైనర్ ఫ్యాషన్, లైఫ్ స్టైల్ ప్రొడక్ట్స్ విక్రయాలు.. ఈ కంపెనీకి ప్రధాన ఆదాయ వనరు. పెర్నియా పాప్-అప్ షాప్ బ్రాండ్ కింద హై-ఎండ్ డిజైనర్ బ్రాండ్‌లను రిటైల్ చేస్తుంది.

దక్షిణ ముంబైలోని ఫ్లోరా ఫౌంటెన్‌లో ఉన్న 118 ఏళ్ల ఇస్మాయిల్ భవనంలో ఉన్న ఏకైక స్వతంత్ర దుకాణాన్ని స్పానిష్ ఫ్యాషన్ బ్రాండ్ జారా మూసివేసింది. అదే సమయంలో.. Propstack.com ద్వారా పొందిన ఆస్తి రిజిస్ట్రేషన్ పత్రాల ప్రకారం.. లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ పర్పుల్ స్టైల్ ల్యాబ్స్ ఇప్పుడు అదే ఐకానిక్ భవనంలో 60,000 చదరపు అడుగుల రిటైల్ స్థలాన్ని లీజుకు తీసుకుంది. అద్దె.. ఏడాదికి 36 కోట్ల రూపాయలు. ఐదేళ్ల కాలానికి లీజును పొందింది.

ఆస్తి రిజిస్ట్రేషన్ పత్రాల ప్రకారం.. ఈ స్థలాన్ని ఐదేళ్ల లీజుకు తీసుకుంది. ఐదేళ్లకు గాను అద్దె అక్షరాల రూ.206 కోట్లు. రోజువారీ అద్దె 10 లక్షల రూపాయలు.

2018లో పెర్నియా పాప్-అప్ షాప్‌ను కొనుగోలు చేసింది. ఇది యువ డిజైనర్ బ్రాండ్‌లను ఒక వేదికపై తెచ్చి.. అమ్మకాలు, మార్కెటింగ్, సాంకేతిక మద్దతుతో వారికి సాయపడుతుంది. కంపెనీ వెబ్‌సైట్ ప్రకారం.. తరుణ్ తహిలియాని, ఫల్గుణి షేన్ పీకాక్, అమిత్ అగర్వాల్, గౌరవ్ గుప్తా, సీమా గుజ్రాల్, అభినవ్ మిశ్రా, శ్యామల్ భూమిక వంటి ప్రఖ్యాత లేబుల్‌ల ఉత్పత్తులను విక్రయిస్తుంది.

2020లో గోవాకు చెందిన డిజైనర్ ఆకస్మిక మరణంతో వెండెల్ రాడిక్స్ బ్రాండ్ ను కొనుగోలు చేసింది. పర్పుల్ స్టైల్ ల్యాబ్స్ అధికారిక వెబ్ సైట్ ప్రకారం.. ముంబైలోని పలు ప్రాంతాల్లో స్టోర్స్ కలిగి ఉంది. కెంప్స్ కార్నర్, జుహు, బాంద్రాలో స్టోర్స్ ఉన్నాయి.

పర్పుల్ స్టైల్ ల్యాబ్స్ ఒక విలాసవంతమైన ఫ్యాషన్ చైన్. ముంబైలోని ఇస్మాయిల్ బిల్డింగ్ లో 60వేల స్క్కేర్ ఫీట్ రిటైల్ స్పేస్ ను ఐదేళ్ల కాలానికి లీజుకి తీసుకుంది. ఈ స్టోర్ కోసం నెలకు 3 కోట్లు అద్దె చెల్లించనుంది. అంటే ఏడాదికి రెంట్ 36 లక్షల రూపాయలు. ఇది తొలి ఏడాది చెల్లించాల్సిన అద్దె. రెండో ఏడాదికి రెంట్ పెరగనుంది. రూ.39 కోట్లు కట్టాల్సి ఉంటుంది. మూడో సంవత్సరం రూ.42 కోట్లు, నాలుగో సంవత్సరం రూ.43.8 కోట్లు, ఐదో ఏడాదికి 45.6 కోట్ల రూపాయలు అద్దె రూపంలో కట్టాల్సి ఉంటుంది. అంతేకాదు డిపాజిట్ గా రూ.18 కోట్లు చెల్లించాలి.

Also Read : భారత్‌లో భారీగా తగ్గిన బంగారం దిగుమతులు.. మరి పడిడి ధరల సంగతేంటి?

స్పానిష్ రిటైల్ బ్రాండ్ జారా.. తొమ్మిదేళ్ల తర్వాత దక్షిణ ముంబైలోని ఫోర్ట్ ఏరియాలో తన ఫ్లాగ్‌షిప్ స్టోర్‌ను మూసివేసింది. ఫ్లోరా ఫౌంటెన్‌లోని ఎడ్వర్డియన్ నియోక్లాసికల్ ఇస్మాయిల్ బిల్డింగ్‌లో 51,300 చదరపు అడుగుల స్టోర్ ఉంది. వాస్తవానికి 21 ఏళ్ల కాలానికి ఆ స్థలాన్ని లీజుకి తీసుకుంది జారా. అయితే, స్టోర్ ను ప్రారంభించిన 9 ఏళ్లకే మూసివేసింది. 2016 ఏప్రిల్ 1న ఈ స్థలాన్ని లీజుకు తీసుకుంది జారా. ఆ సమయంలో జారా నెలకు 2.25 కోట్ల రూపాయలు అద్దె చెల్లించింది. 13.5 కోట్లు డిపాజిట్ చేసింది. ఇప్పుడు అదే స్థలాన్ని పర్పుల్ స్టైల్ ల్యాబ్స్ లీజ్ కి తీసుకుంది. ఏడాదికి రెంట్ వచ్చి రూ.36 కోట్లు. ఐదేళ్ల కాలానికి లీజుకి తీసుకుంది.

పర్పుల్ స్టైల్ ల్యాబ్స్ జర్నీ…

జూలై 2018
ముంబైలో ప్రైమ్ లొకేషన్ జుహులో మొట్టమొదటి పెర్నియా పాప్-అప్ స్టూడియోను పర్పుల్ స్టైల్ ల్యాబ్స్ ఆవిష్కరించింది.

ఆగస్ట్ 2018
ఫ్లిప్‌కార్ట్ బిన్నీ బన్సాల్, పేయు ఇండియా జితేంద్ర గుప్తా, ఆస్టార్క్ వెంచర్స్ నుండి ప్రీ-సిరీస్ A ఫండింగ్‌లో 3 మిలియన్ డాలర్లను పర్పుల్ స్టైల్ ల్యాబ్స్ సమీకరించింది.

నవంబర్ 2018
దక్షిణ ముంబై నడిబొడ్డున కాలా ఘోడా వద్ద పర్పుల్ స్టైల్ ల్యాబ్స్ పెర్నియా పాప్-అప్ స్టూడియో మొదటి ఫ్లాగ్‌షిప్ స్టోర్‌ను ఏర్పాటు చేసింది.

మార్చి 2019
పర్పుల్ స్టైల్ ల్యాబ్స్ బాంద్రా వాటర్‌ఫీల్డ్ రోడ్‌లోని వైబ్రెంట్ హబ్‌లో ఉన్న పెర్నియా పాప్-అప్ స్టూడియోని ఆవిష్కరించింది.

జూన్ 2019
పర్పుల్ స్టైల్ ల్యాబ్స్ రాహుల్ గార్గ్, గిరీష్ కులకర్ణి, నీలేష్ భట్నాగర్, ముఖేష్ సావ్లానీ, సుమిత్ జలాన్, ఇతరుల నుండి సిరీస్ Aలో 8 మిలియన్ డాలర్లను సమీకరించింది.

నవంబర్ 2019
లండన్ లోని మేఫెయిర్ జిల్లా నడిబొడ్డున తన మొదటి అంతర్జాతీయ స్టోర్‌ను ప్రారంభించింది.

డిసెంబర్ 2020
ఫ్యాషన్ డిజైనర్ వెండెల్ రాడిక్ర్స్ కు చెందిన ఎపానిమస్ రిసార్ట్ వేర్ లేబుల్ ను కొనుగోలు చేసింది.

నవంబర్ 2021
ఢిల్లీలోని మెహ్రౌలీలో పెర్నియా పాప్-అప్ స్టూడియో కోసం మొదటి స్టోర్ స్థలాన్ని సొంతం చేసుకుంది. ఇది సరిగ్గా కుతుబ్ మినార్ ఎదురుగా ఉంటుంది. ఇది లగ్జరీ ఫ్యాషన్‌కు కేంద్రంగా ఉంది.

జూన్ 2022
నటుడు మాధురీ దీక్షిత్ నేనే, ముకుల్ అగర్వాల్, అతుల్ గుప్తా, ఆకాష్ భన్సాలీ ఇతరుల నుండి పర్పుల్ స్టైల్ ల్యాబ్స్ 10 మిలియన్ డాలర్ల నిధులను సమీకరించింది.

నవంబర్ 2022
పర్పుల్ స్టైల్ ల్యాబ్స్ పెర్నియా పాప్-అప్ స్టూడియో అతిపెద్ద ఎక్స్ పీరియన్స్ సెంటర్ ని ఢిల్లీలోని చరిత్రాత్మక ఇండియన్ హస్తకళల ఎంపోరియంలో ప్రారంభించింది. ఇది భారతదేశంలోని డిజైనర్ పురుషుల దుస్తుల కోసం అతిపెద్ద రిటైల్ స్థలాన్ని కలిగి ఉంది.

ఏప్రిల్ 2023
పర్పుల్ స్టైల్ ల్యాబ్స్ వాల్యూక్వెస్ట్, స్కేల్‌ఫండ్, సింగులారిటీ గ్రోత్ ఆపర్చునిటీస్ ఫండ్ I, వాల్‌ప్రో, మసాబా గుప్తా తదితరుల నేతృత్వంలోని సిరీస్ సి ఫండింగ్ రౌండ్‌లో 14 మిలియన్ల డాలర్లు సమీకరించింది.

ఆగస్ట్ 2023
పెర్నియా పాప్-అప్ స్టూడియో ప్రారంభంతో పర్పుల్ స్టైల్ ల్యాబ్స్ విలాసవంతమైన గృహాలంకరణ రంగంలోకి ప్రవేశించింది. అహ్మదాబాద్‌లో మొట్టమొదటి స్టోర్ ప్రారంభించింది.

అక్టోబర్ 2023
పర్పుల్ స్టైల్ ల్యాబ్స్ పిడిలైట్ ఫ్యామిలీ ఆఫీస్‌కు చెందిన సంకేత్ పరేఖ్ నేతృత్వంలోని సిరీస్ D ఫండింగ్ రౌండ్‌లో 8 మిలియన్ల డాలర్లు సమీకరించింది.

నవంబర్ 2023
పర్పుల్ స్టైల్ ల్యాబ్స్ హైదరాబాద్‌లో 25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో పెర్నియా పాప్-అప్ స్టూడియో బ్రాండ్-న్యూ ఫ్లాగ్‌షిప్ స్టోర్‌ను ఆవిష్కరించింది.