Quinova (1)
Quinova: ఇటీవలి కాలంలో రుచి కంటే ఆరోగ్యానికే ప్రాధాన్యం పెరుగుతుంది. హెల్తీ డైట్ పేరిట తృణ ధాన్యాలు తినడానికే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. వయస్సుతో సంబంధం లేకుండా ముంచుకొస్తున్న మధుమేహం, గుండె జబ్బుల భయాలే ఇందుకు కారణం.
అటువంటి వారు ఫాలో అవ్వాలనుకునే ఆరోగ్యకరమైన ఆహారం క్వినోవా. ప్రొటీన్ లు, అమైనో ఆమ్లాలు ఉండటంతో కండరాలు, ఎముకలు, చర్మ ఆరోగ్యాన్ని కాపాడతాయి. రక్తాన్ని వృద్ధి పరిచి ఫైబర్ కొలెస్ట్రాల్, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. ఫలితంగా డయాబెటిస్, హార్ట్ అటాక్ ప్రమాదాలు తగ్గుతాయి.
ఒక్క రోజులో ఎంత తీసుకోవాలి
వండిన క్వినోవాను రోజుకు ఒకటి నుంచి రెండు కప్పుల వరకూ తీసుకోవచ్చు. సాధారణంగా ఎక్కువగా దుష్ప్రభవాలు కనిపించని క్వినోవాను.. తీసుకున్న వారిలో దురద, వాంతులు లక్షణాలు కనిపిస్తే తీసుకోకపోవడమే బెటర్.
బరువు తగ్గాలనుకునేవారికి
ఇందులో ఉండే అధిక ప్రొటీన్ కంటెంట్ చాలాసేపు కడుపునిండుగా ఉన్న ఫీలింగ్ కలిగిస్తుంది. అందుకే అల్పాహారానికి క్వినోవా చాలా బెటర్. జీవక్రియ రేటును మెరుగుపరిచి.. సులువుగా బరువు తగ్గడానికి తోడ్పడుతుంది.
గ్లూటెన్ ఉండదు
ఆహారంలో గ్లూటెన్ ఉంటే అరుగుదలకు ఎక్కువ సమయం పట్టొచ్చు. అదేమీ లేకపోవడంతో త్వరగా జీర్ణమైపోయి ప్రొటీన్, ఐరన్, కాల్షియంను అందిస్తుంది.
ఖనిజాలకు నిలయం
ఇందులో మెగ్నిషియం, జింక్, ఐరన్ వంటి ఖనిజాలు ఉంటాయి. ఆరోగ్యకరమైన శరీరం కోసం ఇవి తోడ్పడతాయి. అలసట, నిద్రలేమి, తలనొప్పి, కండరాల తిమ్మిర్లు, రక్తహీనత, మధుమేహం వంటి వాటిని నివారిస్తాయి.
మొక్కల ద్వారా వచ్చే ఆహారమైన క్వినోవా కండరాలు పటుత్వానికి సహకరించి బరువు తగ్గేందుకు తోడ్పడతాయి. 100గ్రాముల క్వినోవాలో 9 అమైనో ఆమ్లాలు, 8 గ్రాముల ప్రొటీన్లు ఉంటాయి.
GI తక్కువగా
గ్లైసెమిక్ ఇండెక్స్ విలువ తగ్గించి రక్తంలో చక్కెర స్థాయిలను పెంచదు. అలా క్వినోవా శాశ్వత శక్తిని అందిస్తుంది.