Ragi Malt
Ragi Malt : రాగులు బలవర్ధకమైన ఆహారం. రాగుల పిండితో తయారు చేసిన పదార్ధాలను తరచుగా తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. రాగులలో క్యాల్షియం, ఐరన్, ప్రోటీన్, ఫైబర్ మరియు మినిరల్స్ , అయోడిన్ పుష్కలంగా లభిస్తుంది. ఎముకలను దృఢంగా ఉంచడంలో రాగుల్లో ఉండే కాల్షియం బాగా ఉపయోగపడుతుంది. జీర్ణశక్తి కూడా బాగా మెరుగుపడుతుంది. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. రాగుల్లో మినరల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి.
ఇందులో ఫాస్ఫరస్, పోటాషియం ఇంకా ఐరన్ కూడా ఎక్కువగా ఉంటుంది. గ్లూటెన్ లోపంతో బాధపడుతున్నారో వారు ఈ ధాన్యాహారాన్ని తీసుకోవచ్చు.రాగుల్లో నేచురల్ ఐరన్ పుష్కలంగా ఉన్నటువంటి ఒక మూలకం. రాగిని తీసుకోవడం వల్ల అనిమియాను నివారించడానికి సహాయపడుతుంది. హై బ్లడ్ ప్రెజర్ తో బాధపడుతున్నవారు, ఇతర కరోనరీ వ్యాధులతో బాధపడుతున్నవారికి ఫైబర్ ఫుష్కలంగా ఉండే రాగులు ఎంతో మేలు చేస్తాయి.
ఇక పోతే రాగి పిండితో తయారు చేసుకునే రాగి జావ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా వేసివి కాలంలో ఈ రాగి జావ తాగటం వల్ల శరీరం చల్లబడుతుంది. శరీరంలో వేడి తగ్గించేందుకు ఇది ఎంతగానో ఉపకరిస్తుంది. ఇటీవలికాలంలో రాగి జావ తాగటం వల్ల కలిగే ప్రయోజనాలు తెలియటంతో చాలా మంది దీనిని సేవించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. విభిన్న రకాలుగా , రుచికరంగా రాగిజావను తయారు చేసుకుని తాగుతున్నారు. ఎండాకలంలో వడదెబ్బ నుండి రక్షణ పొందేందుకు రాగిజావ తోడ్పడుతుంది. శరీరానికి రాగిజావ తాగటం వల్ల శక్తి వస్తుంది.
ఎదిగే వయసు పిల్లలతోపాటు, పెద్ద వయస్సువారు రాగిజావ తీసుకోవటం వల్ల ప్రయోజనం ఉంటుంది. కాలేయవ్యాధులు, గుండె బలహీనత, ఉబ్బసం తగ్గిస్తుంది. వృద్దాప్యంలో వున్న వారు రాగులతో తయారు చేసిన ఆహార పదార్థాలను భుజించడం వల్ల శరీరానికి బలం, శక్తి లభిస్తాయి.
రాగిజావ తయారీ;
ఒక గిన్నెలో నీళ్లు పోసి.. అందులో రాగిపిండి వేసి ఉండల్లేకుండా కలుపుకోవాలి. అందులోనే బియ్యప్పిండి, సజ్జపిండి, జొన్నపిండి, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని కలుపుకోవాలి. స్టవ్ మీద పెద్ద గిన్నె పెట్టి మూడు గ్లాసుల నీళ్లు పోయాలి. అవి బాగా వేడెక్కాక ముందుగా కలిపి పెట్టుకున్న రాగి పిండి మిశ్రమాన్ని అందులో వేయాలి. ఉండలు కట్టకుండా బాగా కలుపుతూ ఉండాలి. చిన్న మంట మీద ఉడకనివ్వాలి. కాస్త చిక్కగా మారాక పొయ్యిమీద నుండి దించుకోవాలి. వేసవి కాలంలో రోజుకు రెండు సార్లు రాగిజావను మజ్జిగ కలుపుకుని తాగితే శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది.