Rainy Season Spicy Food : వర్షాకాలంలో స్పైసీ ఫుడ్ తినాలని ఎందుకు అనిపిస్తుందో తెలుసా..? వెరీ ఇంట్రెస్టింగ్

చల్లచల్లగా వర్షం పడుతోంది. వేడి వేడిగా కారం కారంగా ఏమన్నా తినాలనిపిస్తోందా..? చక్కగా మిర్చి బజ్జీపై కారప్పొడి చల్లుకుని తింటే వావ్ అనిపిస్తుంది కదా..మరి వర్షాకాలంలో ఇలా స్పైసీ ఫుడ్ ఎందుకు తినాలనిపిస్తుందో తెలుసా..వాతావరణం చల్లగా ఉన్నప్పుడు మన శరీరం కారంగా ఉండే ఆహారాన్ని ఎందుకు కోరుకుంటుందో తెలుసా..?

Rainy Season Spicy Food

Rainy Season Spicy Food : వర్షాకాలం జోరుగా వాన కురుస్తోంది. ఝల్లు ఝల్లుగా వాన పడుతుంటే అబ్బా కారం కారంగా ఏమన్నా తిందామనిపిస్తుంది.వేడి వేడిగా ఘాటు ఘాటుగా ఉండే మిర్చి బజ్జీ, పానీ పూరీ, పకోడీ, సమోసాలు,చాట్ వంటి స్పైసీ ఫుడ్ తినాలనిపిస్తుంది. తినకుండానే ఆ ఊహ వస్తేనే నోరూరిపోతుంది. మరి తింటే ఇంకెంత మజాగా ఉంటుందో కదా..చక్కగా మసాలాలు దట్టించి ఎర్రటి కారం వేసి చేసి వేడి వేడిగా స్పైసీగా నోట్లో పెట్టుకుంటే వావ్..స్వర్గం నాలుకపై తాండవమాడినట్లే ఉంటుంది కదా..మరి వర్షం కురుస్తుంటే..లేదా చలిగా ఉన్నప్పుడు వేడి వేడిగా స్పైసీగా ఉండే ఫుడ్ ఏమైనా తినాలని అనిపించటానికి కారణాలేంటీ..మరి ముఖ్యంగా వర్షాకాలంలో స్పైసీ ఫుడ్ తినాలని అనిపించటానికి కారణాలేంటో తెలుసుకుందాం..

కారం, మసాలా ఘాటు బాగా ఉండే ఆహారాన్ని ఆహారాన్ని స్పైసీ ఫుడ్ అంటారు. శరీరంలో హార్మోన్ల మార్పుల వల్ల, స్పైసీ ఫుడ్ లో ఉండే కొన్ని ఆహార రసాయనాల వల్ల ఇలా స్పైసీ ఫుడ్ తినాలని అనిపిస్తుందట. వర్షాలు పడినప్పుడు, శీతాకాలంలో వాతావరణ చల్లగా మారిపోతుంది. అప్పుడు మసాలా ఆహారాన్ని తినాలన్న కోరిక శరీరంలో పుడుతుంది. స్పైసీ ఫుడ్‌లో క్యాప్సైసిన్ ఉంటుంది. ఇది శరీరంలో వెచ్చదనాన్ని కలిగించి వేడి పుట్టిస్తుంది. అందుకే మన శరీరంలో చల్లని వాతావరణంలో స్పైసీ ఫుడ్‌ను కోరుకుంటుంది.

Urinary Tract Infection : వర్షాకాలంలో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ రాకుండా పాటించాల్సిన 7 చిట్కాలు !

వర్షాకాలంలో మన శరీరంలో హ్యాపీ హార్మోన్ సెరొటోనిన్ స్థాయులు తగ్గిపోతాయి. దానికి కారణం సూర్యరశ్మి లేకపోవడం.దీంతో శరీరంలో విటమిన్ డి ఉత్పత్తిలో మార్పులు వస్తాయి. దీంతో వీటిని ఎడ్జెస్ట్ చేయటానికి మన శరీరం కార్బోహైడ్రేట్లు కావాలని కోరుకుంటుంది. కార్బోహైడ్రేట్లు శరీరంలో సెరొటోనిన్ స్థాయుల్ని పెంచుతాయి. దీంతోపాటే డీప్ ఫ్రై చేసిన స్నాక్స్ లో తేమ లేకుండా పొడిగా ఉంటాయి. నోట్లోవేసుకోగానే కరకరలాడతాయి. మన చుట్టూ ఉన్న చల్లని వాతావరణానికి ఈ ఆహారం తింటే మనకు నచ్చుతుంది.

అలాగే వర్షాకాలంలో క్రిస్పీగా, ఫ్రై చేసిన స్నాక్స్‌ తినాలనిపిస్తుంది. కాస్త కారం కారంగా ఉండేవి తినాలనిపిస్తుంది. వర్షాకాలంలో స్పైసీ స్నాక్స్ అంటే ఠక్కున గుర్తుకొచ్చేది మిర్చి బజ్జీ. మిర్చి బజ్జీ బండి కనిపిస్తే ఠక్కున ఆగిపోయిన ఓ ప్లేట్ తీసుకుని వెంటనే వేడి వేడిగా లాగించేయాలనిపిస్తుంది. ఎందుకంటే శరీరంలో చల్లదనం పెరిగి వేడి కావాలనిపిస్తుంది. దాని కోసం మిర్చి బజ్జీపై మనస్సు లాగేస్తుంది. మిరపకాయల్లో క్యాప్సైసిన్ ఉంటుంది. మనం కారం తినగానే నోట్లోని నరాల గ్రాహకాలకు ఇది మనం ఏదో వేడి పదార్థం తిన్నామనే భావన కలగజేస్తుంది. దాంతో మెదడు మనకు చెమట పట్టేలా చేస్తుంది. మనలో ఆనందాన్ని పెంచే డోపమైన్ ను మన రక్తంలోకి విడుదల చేస్తుంది.

Respiratory Infections : వర్షాకాలంలో శ్వాసకోశ ఇన్ఫెక్షన్లను అరికట్టడానికి 5 ఎఫెక్టివ్ హోం రెమెడీస్ !

అంతేకాదు స్పైసీ ఫుడ్ తినాలనిపించటానికి వేరే కారణాలు కూడా ఉంటాయట. మనకు నిరుత్సాహంగా ఉన్నా అటువంటి ఆహారం తినాలనిపిస్తుందట. స్పైసీ ఫుడ్ యాంటీ డిప్రెసెంట్‌గా పనిచేస్తుందట. డిప్రెస్‌గా ఉన్నప్పుడు ఇలాంటి ఆహారాన్ని కోరుకుంటుందట శరీరం. మీకు నిరాశగా అనిపించినప్పుడు స్పైసీ ఫుడ్ తింటే ఉపశమనం కలుగుతుందట. కానీ నిరాశ, నిస్పృహలు కలిగితే కేవలం స్పైసీ ఫుడ్ తిని ఊరుకోవద్దు..ఎందుకైనా మంచిది వైద్యులను సంప్రదించటం మంచింది. వారి సలహాలను తీసుకుని వాటి ప్రకారం వారి సూచనలు పాటించటం చాలా చాలా మంచింది.

వర్షంలో తడిస్తే ముక్కు కారుతూ, తుమ్ములు వస్తుంటాయి. జలుబు చేస్తుంది. ఇలాంటి సమయంలో కూడా కారంగా ఉండే ఆహారాన్ని తినాలనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఆహారం రినైటిస్ లక్షణాలు తగ్గించడంలో సహాయపడుతుంది.

 

ట్రెండింగ్ వార్తలు