Ramadan 2025 Iftar
Ramadan 2025 : పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాసం ఉన్నవారు రోజంతా నీరు తాగకుండా ఉంటారు. సాయంత్రం ప్రార్థనల తర్వాత ఇఫ్తార్ చేస్తారు. ఇఫ్తారీ సమయంలో ఇంట్లో చాలా రుచికరమైన వంటకాలు తయారు చేస్తారు. ఉపవాసం ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా చెబుతారు.
ఎందుకంటే.. శరీరాన్ని తొందరగా కోలుకోవడంతో పాటు పేరుకుపోయిన కొవ్వును శక్తిగా వాడుకోనేందుకు సమయం ఉంటుంది. తద్వారా బరువు తగ్గుతారు. జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. అయితే ఇఫ్తారి సమయంలో చేసే కొన్ని తప్పులు వల్ల గ్యాస్, ఉబ్బరం కలిగిస్తాయి.
ఉపవాసం ఉన్నప్పుడు, రోజంతా కడుపు ఖాళీగా ఉంటుంది. అలాంటి పరిస్థితిలో చాలా మంది ఇఫ్తార్ తర్వాత వారి కడుపు చాలా బరువుగా అనిపిస్తుందని లేదా గ్యాస్, ఉబ్బరం కారణంగా నొప్పి వస్తుందని చెబుతుంటారు. కొంతమందిలో వాంతులు, వికారం కూడా కనిపిస్తాయి.
ఈ సమస్యలను నివారించడానికి ఇఫ్తారి సమయంలో ఆ తరువాత కొన్ని విషయాలను తప్పక గుర్తుంచుకోవాలి. ఈ 4 తప్పులను అసలు చేయొద్దు. లేదంటే మీ జీర్ణక్రియను తీవ్రంగా దెబ్బతీస్తాయి. ఫలితంగా ఆరోగ్య పరంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఇఫ్తార్ సమయంలో మసాలా ఆహారాలు తినడం :
ఉపవాసం ఉన్నప్పుడు రోజంతా కడుపు ఖాళీగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో వేయించిన కారంగా ఉండే ఆహారం గుండెల్లో మంట, కడుపులో భారం గ్యాస్‌కు కారణమవుతుంది. ఎందుకంటే.. అది జీర్ణం కావడం చాలా కష్టం అవుతుంది. అందువల్ల, ఆరోగ్యకరమైన తేలికపాటి ఆహారాన్ని తినడానికి ప్రయత్నించండి.
ఇఫ్తార్‌కు ముందు, తర్వాత నీరు ఎక్కువగా తాగడం :
రోజంతా ఉపవాసం ఉన్న తర్వాత చాలా దాహం వేస్తుంది. చాలా నీరు తాగేస్తుంటారు. ఆ తర్వాత వెంటనే ఆహారం తిని, నీరు తాగుతారు. దీని వల్ల వికారం, వాంతులు, కడుపులో భారంగా అనిపిస్తుంది. ఇఫ్తార్‌కు ముందు లేదా తర్వాత వెంటనే నీరు తాగకూడదు.
త్వరగా ఆహారం తినండి :
ఇఫ్తార్ సమయంలో ఆహారాన్ని బాగా నమలాలి. ఆహారాన్ని సరిగ్గా నమలకపోతే అది ఆహారాన్ని జీర్ణం చేయడంలో సమస్యలను కలిగిస్తుంది. ఫలితంగా కడుపులో గ్యాస్ పెరిగి ఉబ్బరం, బరువుగా అనిపించడం వంటి సమస్యలకు దారితీస్తుంది. ఆహారం తొందరగా తినండి.
ఇఫ్తార్ తర్వాత రెస్ట్ తీసుకోండి :
రోజంతా ఉపవాసం ఉండి పని చేయడం, ఉదయాన్నే లేవడం చేస్తుంటారు. దీని కారణంగా రంజాన్‌లో షెడ్యూల్ చాలా బిజీగా మారుతుంది. ఫలితంగా చాలా సార్లు ఇఫ్తార్ తీసుకున్న వెంటనే కాసేపు విశ్రాంతి తీసుకుంటారు. దాంతో జీర్ణక్రియ చాలా నెమ్మదిగా జరుగుతుంది. అజీర్ణం, కడుపులో చాలా బరువుగా అనిపించవచ్చు. ఇఫ్తార్ తర్వాత కనీసం 20 నిమిషాలు నడవండి లేదా వజ్రాసనంలో కూర్చోండి.