Plastic Surgery
Plastic Surgery : సాధారణంగా ప్లాస్టిక్ సర్జరీ అనేది సెలబ్రిటీస్ విషయంలో వింటూ ఉంటాం. వారు అవయవాలను సరిచేయించుకున్నారు అని.. లేదంటే ఏదైనా ప్రమాదంలో అవయవాలు తెగిపడినా వాటికి చికిత్స చేయించుకుంటారు. అయితే ప్లాస్టిక్ సర్జరీ అనే పేరు ఎందుకు వచ్చింది? ఈ చికిత్సలో ఏమైనా ప్లాస్టిక్ వాడతారా? అనే డౌట్స్ వస్తుంటాయి. అసలు ప్లాస్టిక్ సర్జరీకి ఆ పేరు ఎలా వచ్చిందో? తెలుసుకుందాం.
ప్లాస్టిక్ సర్జరీకి ఆ పేరు గ్రీకు పదం ‘ప్లాస్టికోస్’ నుంచి వచ్చింది. సర్జరీ ద్వారా ఆకృతిని మార్చడం అనే అర్ధం వస్తుంది.. అంతేకానీ ఈ చికిత్సలో ప్లాస్టిక్‌ను ఉపయోగించరు. ఈ సర్జరీ సమయంలో సిలికాన్, గోర్-టెక్స్, మెడ్‌పోర్ అనేవాటిని ఇంప్లాంట్లుగా వాడతారు. మహర్షి సుశ్రుతను ‘ప్లాస్టిక్ సర్జరీ పితామహుడు’ అంటారు. ఆయన 1000-800 BC మధ్య భారతదేశంలో నివసించారు. వైద్యరంగాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఆయన ప్రసిద్ధి చెందాడు. 3,000 సంవత్సరాల క్రితం కాశీలో ప్రపంచంలోనే మొదటి ప్లాస్టిక్ సర్జరీ ఆయన చేసినట్లు చెబుతారు. సుశ్రుతుని వద్దకు ఓ వ్యక్తి తెగిపోయిన ముక్కుతో వచ్చాడట. అలా సుశ్రుతుడు మొట్టమొదటి ప్లాస్టిక్ సర్జరీ కాశీలో జరిగినట్లు చరిత్ర చెబుతోంది. ఈ సర్జరీ చేసినపుడు సుశ్రుతుడు రోగికి మత్తు పదార్ధం ఇచ్చి చికిత్స చేశారట.
Curry Leaves : ఈ ఆకు రక్తహీనతకు చికిత్సగా ప్రకృతి ప్రసాదించిన వరం !
భారతదేశంలో మొట్టమొదటి ప్లాస్టిక్ సర్జరీ విభాగం 1958లో నాగ్‌పూర్‌లోని M.C.హాస్పిటల్ ప్రారంభమైంది. ప్లాస్టిక్ సర్జరీ అనేది సౌందర్య ప్రయోజనాల కోసం లేదా అవయవ పునర్నిర్మాణ శస్త్ర చికిత్సగా అందిస్తారు. పుట్టుకతో వచ్చిన కొన్ని వైకల్యాలను సరిచేయడానికి కూడా ఈ సర్జరీ చేస్తారు. ముఖం కుంగిపోయినట్లు ఉన్నా, చర్మాన్ని బిగుతుగా మార్చడం, ఫేస్ లిఫ్ట్ ఇలాంటివి చేస్తుంటారు. చర్మ క్యాన్సర్ కారణంగా కూడా ముఖం వికృతంగా మారిన సందర్భంలోకూడా ఈ చికిత్సను అందిస్తారు. మొదటి, రెండవ ప్రపంచ యుద్ధాల సమయంలో సైనికులకు కాలిన గాయాలు, తెగి పడిన అవయవాలు పునర్నిర్మాణం కోసం ఈ శస్త్ర చికిత్స అవసరమైంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో వ్యక్తులు వారి అందం విషయంలో, అవయవాల ఆకృతిని సరిచేసుకునే సందర్భాల్లో ఈ సర్జరీకి ప్రాముఖ్యతని ఇస్తున్నారు.