Kidney Stones Remove : సర్జరీ లేకుండానే.. పేషెంట్ కిడ్నీ నుంచి 156 రాళ్లు తొలగింపు… హైదరాబాద్‌ వైద్యుల ఘనత!

ఒక వ్యక్తి కిడ్నీలో రికార్డు స్థాయిలో రాళ్లు పెరిగాయి. కిడ్నీ నుంచి 156 రాళ్లను తొలగించారు. మేజర్ సర్జరీ లేకుండానే కీహోల్ ద్వారా కిడ్నీలో రాళ్లను తొలగించారు హైదరాబాద్ వైద్యులు.

156 Stones Removed from Kidney :  కిడ్నీలో రాళ్లు ఉంటాయని అందరికి తెలుసు.. మహా అయితే రెండో మూడో ఉంటాయి కదా.. అనుకోవచ్చు.. కానీ, ఒక వ్యక్తి కిడ్నీలో రికార్డు స్థాయిలో రాళ్లు పెరిగాయి. దాదాపు అతడి కిడ్నీ నుంచి 156 రాళ్లను హైదరాబాద్ వైద్యులు తొలగించారు. అది కూడా ఎలాంటి మేజర్ సర్జరీ లేకుండానే 50ఏళ్ల బాధితుడికి కీహోల్ ద్వారా కిడ్నీ నుంచి రాళ్లను తొలగించినట్టు వైద్యులు వెల్లడించారు. కిడ్నీలో పేరుకుపోయిన రాళ్లను తొలగించేందుకు.. ఎండోస్కోపీ, లాపరోస్కోపీని వైద్యులు ఉపయోగించారు. ఒకే వ్యక్తి కిడ్నీలో నుంచి వందల సంఖ్యలో రాళ్లను తొలగించడం దేశంలోనే ఇదే ఫస్ట్ కూడా.

బాధితుడి కిడ్నీలో రాళ్లను తొలగించేందుకు దాదాపు 3 గంటల పాటు వైద్యులు శ్రమించారు. రాళ్లను తొలగించిన అనంతరం బాధితుడు కోలుకున్నాడని, అతడి ఆరోగ్యం కూడా బాగానే ఉందని వైద్యులు తెలిపారు. క‌ర్ణాట‌క‌లోని హుబ్లీ నుంచి కిడ్నీ సమస్యలతో వచ్చిన బాధితుడు హైదరాబాద్‌లోని కూక‌ట్‌ప‌ల్లిలో ఉన్న ప్రముఖ ప్రీతి యూరాల‌జీ కిడ్నీ ఆస్పత్రిలో చేరాడు. వృత్తిరీత్యా స్కూల్ టీచర్ అయిన బసవరాజ్ మడివాలర్‌కు పొత్తికడుపు దగ్గర నొప్పి వచ్చింది. బాధితుడికి స్క్రీనిం నిర్వహించగా.. మూత్రపిండంలో పెద్ద ఎత్తున రాళ్లు ఉన్నట్లు తేలింది. అతడి మూత్ర నాళంలో సాధారణ స్థితిలో ఉండాల్సిన విధంగా లేకపోవడంతో అతడికి సర్జరీ చేయడం కుదరలేదు. పొత్తికడుపుకు సమీపంలో బాధితుడికి ఎక్టోపిక్ కిడ్నీ కూడా ఉందని వైద్యులు గుర్తించారు.

అసాధారణ భాగంలో మూత్రపిండము ఉండటం వల్ల అతడికి సాధారణ కిడ్నీ ఆపరేషన్ మాదిరిగా సర్జరీ చేయలేదు. లాపరోస్కోపీ చేశారు. కిడ్నీ పొజిషన్ ఉన్నచోట లేనందున అతడికి కీహోల్ సర్జరీ చేసి కిడ్నీలో 156 రాళ్లను తొలగించినట్టు ఆసుపత్రి యూరాలజిస్ట్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ వి చంద్రమోహన్ తెలిపారు. మూడు గంటల పాటు జరిగిన ఈ ఆపరేషన్‌లో కిడ్నీలో నుంచి డైరెక్ట్‌గా రాళ్ల‌ను తీసేలా కీహోల్ స‌ర్జ‌రీ చేశామన్నారు. అందుకోసం ఎండోస్కోపీ రూట్‌ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఆ తర్వాత కిడ్నీలో నుంచి రాళ్ల‌ను బ‌య‌టికి తీశామని డాక్టర్ చంద్రమోహన్ చెప్పారు.

Read Also : All Diesel Vehicles : 2022 జనవరి 1 నుంచి 10ఏళ్లు దాటిన డీజిల్ వాహనాల రిజిస్ట్రేషన్లు రద్దు!

ట్రెండింగ్ వార్తలు