వారికి మాత్రమే : ఒక్క ప్రోటీన్ సప్లిమెంట్ తీసుకొంటే చాలు

  • Publish Date - January 17, 2020 / 03:00 AM IST

శారీరక వ్యాయామం అంటే..శరీరాన్ని చరుకుగా ఉంచడమే. శారీరక ధృఢత్వాన్ని, ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకొనేందుకు ఓ సాధనం. అయితే..వయస్సులో ఉన్నప్పుడు ఎక్సర్ సైజులు చేయడం ఇబ్బందేమి ఉండకపోవచ్చు. కానీ..వృద్ధులు, వికలాంగులు, గాయాలపాలైన వారు ఎలా వ్యాయామం చేస్తారు ? వీరికి అందరిలాగా చేయరాదు కదా..ఈ సమస్యను అధిగమించేందుకు మిషిగన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఓ వినూత్నమైన పద్ధతిని ఆవిష్కరించారు. కేవలం..ఓ ప్రోటీన్..సప్లిమెంట్‌ను ఆహారంగా తీసుకొంటే చాలు అంటున్నారు. వ్యాయామం చేస్తే..ఎలాంటి ప్రయోజనాలు వస్తాయో..అన్నీ వస్తాయన్నారు. 

సెస్ట్రిన్ అనే ప్రోటీన్ వ్యాయామం తర్వాత కండరాల్లో పేరుకపోతోందని గతంలోనే గుర్తించడం జరిగిందని దీని ఆధారంగా తాము పరిశోధనలు చేయడం జరిగిందని వెల్లడించారు. ఈగలపై తాము అధ్యయనం చేసినట్లు..ఓ గుంపులో సాధారణమైన ఈగలు ఉండగా..ఇంకోదాంట్లో సెస్ట్రిన్ ఉత్పత్తి జరుగకుండా చూశామని జూ హన్ లీ వెల్లడించారు. మూడు గుంపుల ఈగలు శారీరకంగా శ్రమించేలా చేశామని దీనివల్ల సెస్ట్రిన్ ఎక్కువగా ఉన్న ఈగల సామర్థ్యం బాగా పెరిగినట్లు, శారీరక శ్రమ లేని సమయాన్ని తాము పరిశీలించడం జరిగిందన్నారు.

సెస్ట్రిన్ ద్వారా వ్యాయామానికి సంబంధించిన ఫలితాలు అందుతున్నట్లు తాము గుర్తించడం జరిగిందన్నారు. ఫ్యూచర్‌లో ఈ సెస్ట్రిన్ ప్రోటీన్‌ సప్లిమెంట్‌గా ఇవ్వడం ద్వారా శ్రమ లేకుండానే వ్యాయామానికి సంబంధించిన ఫలితాలు వస్తాయని తమ పరిశోధనలు రుజువు చేశాయని శాస్త్రవేత్తలు తెలిపారు. 

Read More : గర్భిణీ అని చూడలేదు..భార్య హత్యకు సుపారీ