ఒక రోజులో మన మెదడులో ఎన్ని ఆలోచనలు ఉంటాయో సైంటిస్టులకు ఇట్టే తెలుస్తుంది!

  • Publish Date - July 18, 2020 / 10:31 PM IST

ఆలోచన వేగాన్ని అందుకోలేం.. క్షణాల వ్యవధిలో ఆలోచన మారిపోతోంది. ఎక్కడ మొదలవుతుందో.. ఎప్పుడు ఎండ్ అవుతుందో చెప్పడం కష్టమే. ఒక ఆలోచన ఎక్కడ ముగుస్తుంది.. మరో ఆలోచన ఎక్కడ మొదలవుతుందో ట్రాక్ చేయలేం.

కానీ, ఇప్పుడు మాత్రం మీలో ఒక రోజులో ఎన్నో ఆలోచనలు ఉంటాయో పరిశోధకులు తమకు తెలుసునని అంటున్నారు. సగటు రోజులో మనకు 6,000 వ్యక్తిగత ఆలోచనలు ఉన్నాయని పరిశోధకులు కొత్త అధ్యయనంలో వెల్లడించారు. కెనడాలోని క్వీన్స్ యూనివర్శిటీకి చెందిన డాక్టర్ Jordan Poppenk, ఆయన విద్యార్థి Julie Tseng ఒక మెథడ్‌ను ప్రారంభించారు.
ఒక ఆలోచన ఎక్కడ ముగుస్తుందో.. మరో ఆలోచన ఎక్కడ మొదలవుతుందో గుర్తించగలదని అంటున్నారు. దీనికి సంబంధించి అధ్యయనాన్ని నేచర్ కమ్యూనికేషన్స్ అనే సైన్స్ జర్నల్‌లో జూలై 13న ప్రచురించారు.

ఒక వ్యక్తి తనలో ఒకే ఆలోచనలో ఉన్నప్పుడు.. ఆ క్షణాలను వేరు చేయడానికి పరిశోధకులు ఒక మార్గాన్ని రూపొందించారు. దీన్ని (థాట్ వామ్) ఆలోచన పురుగుగా అభివర్ణించారు. సాధారణంగా మనం ఆలోచనను పురుగుతో పోలుస్తుంటాం.. అందుకే పరిశోధకులు దీనికి అదే పేరు పెట్టారు.

మెదడులోని కార్యాచరణ నమూనాల మెదడు ప్రతి క్షణంలో ఈ ‘స్టేట్ స్పేస్’లో వేరే పాయింట్‌ను సూచిస్తుంది. ఒక వ్యక్తి కొత్త ఆలోచనలో ఉన్నప్పుడు అదే సమయంలో పరిశోధకులు దీన్ని సృష్టిస్తారు. ఒక రోజులో ఏ సమయంలోనైనా మన మెదడు ఏమి ఆలోచిస్తుందో అర్థం చేసుకోవడానికి పరిశోధకులు కొంతకాలంగా కృషి చేస్తున్నారు.

మెదడులోని కార్యాచరణ విధానాలను తెలిసిన ఆలోచనా శ్రేణితో పోల్చి చూశారు. అందరూ ఎక్కువగా దేనిపై ఆలోచిస్తున్నారనే దానిపై పరిశోధకులు దృష్టి పెట్టారు. కొత్త పద్ధతిని పరిగణనలోకి తీసుకోకుండా, ఒక వ్యక్తి కొత్తగా ఆలోచిస్తున్నప్పుడు గుర్తించడానికి కొన్ని పద్ధతులు సాయపడతాయని పాపెంక్ పేర్కొన్నారు.

ఆలోచనలు మారినప్పుడు వారిలో ఎన్ని ఆలోచనలు ఉన్నాయో తెలుసుకోవచ్చునని కొత్త పరిశోధనలో గుర్తించినట్టు డాక్టర్ పాపెంక్ చెప్పారు. వారి ఆలోచనను చేసే చర్యలను బట్టి వ్యక్తి, వ్యక్తిత్వాన్ని అంచనా వేయొచ్చునని అన్నారు. ఒక కప్పు కాఫీ తాగడం వల్ల మనలో కలిగే ఆలోచన స్వభావాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో చెప్పవచ్చు.

మన ఆలోచనలు భిన్నంగా ఎలా సాగుతాయనేది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుత ఆలోచనలు.. భవిష్యత్తులో ఆలోచనలు ఎలా మారుతాయో ఒక వ్యక్తి ఇతర ఆలోచనలతో ఎలా సంబంధం కలిగి ఉంటాయో అన్వేషించడానికి పరిశోధకులు ప్రయత్నిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు