Brain Stroke : అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ తో బ్రెయిన్ స్ట్రోక్ ముప్పు!

అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ సమస్య ఉన్నవారిలో బ్రెయిన్ స్ట్రోక్ ముప్పు ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అధిక బరువు సమస్య కూడా దీనికి కారణమౌతుంది. అలాగే వంశపారంపర్యంగా కూడా వచ్చే అవకాశం కూడా ఉంది. మదుమేహం, సంతాన నిరోధక మాత్రల వినియోగం, ధూమపానం, మద్యం అలవాట్లు వంటివి కూడా దీనికి కారణమౌతాయి.

Brain Stroke

Brain Stroke : బ్రెయిన్ స్ట్రోక్ కుడా గండే పోటు లాగానే ఒక అత్యవసర వైద్య స్థితి. మెదడు లోని కొంత భాగానికి రక్తం సరఫరా కాకుండా అంతరాయం ఏర్పడినపుడు, ఆక్షిజన్ , పోషకపదర్దాలు అందకపోవడం వల్ల మెదడు కణాలూ నిర్జీవంగా మారిపోతాయి. దీంతో శరీరంలోని వివిధ బాగాలు పనిచేయవు. దీన్నే బ్రెయిన్ స్ట్రోక్ గా చెప్తారు. గతంలో వయస్సు 65 సంవత్సరాలు దాటిన వారిలో ఈ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు అధికంగా ఉండేవి. అయితే ప్రస్తుతం మారిన జీవన పరిస్ధితులు, ఒత్తిడులు, ఆహారపు అలవాట్ల కారణంగా 40 ఏళ్ల వయస్సులోనే చాలా మంది ఈ జబ్బు బారిన పడుతున్నారు.

అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ సమస్య ఉన్నవారిలో బ్రెయిన్ స్ట్రోక్ ముప్పు ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అధిక బరువు సమస్య కూడా దీనికి కారణమౌతుంది. అలాగే వంశపారంపర్యంగా కూడా వచ్చే అవకాశం కూడా ఉంది. మదుమేహం, సంతాన నిరోధక మాత్రల వినియోగం, ధూమపానం, మద్యం అలవాట్లు వంటివి కూడా దీనికి కారణమౌతాయి. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ముందుగా కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. శరీరంలో కుడి, ఎడమవైపు మొహం, చెయ్యి, కాలు చచ్చుబడిపోయినట్లు అనిపిస్తుంది. మాట్లాడే మాటల్లో తేడాను గమనించవచ్చు. కంటిచూపు మందగించటం, ఒక వస్తువు రెండుగా కనిపించటం, అసాధారణమైన తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా తగిన చికిత్స పొందేందుకు వైద్యులను సంప్రదించటం మంచిది.

బ్రేయిన్ స్ట్రోక్ రాకుండా ఉండాలంటే తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకోవాలి. అధిక కొవ్వులు కలిగిన ఆహారాలకు దూరంగా ఉండాలి. పండ్లు, కూరగాయలు, ఆకు కూరలు, తృణధాన్యాలు, వంటి వాటిని ఆహారంలో తీసుకోవాలి. అధిక బరువు ఉన్నవారు బరువును తగ్గించుకోవాలి. రక్తపోటును అదుపులో ఉంచుకోవాలి. ఆహారంలో ఉప్పును తగ్గించుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయటం మంచిది. మానసిక ఒత్తిడులను తగ్గించుకోవాలి. దురల్వాట్లకు దూరంగా ఉండాలి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ సమస్యలు ఉన్నవారు తరచూ వైద్య పరీక్షలు చేయించుకుంటూ తగిన చికిత్స ను పొందాలి.