Dangerous Food Combinations
Dangerous Food Combinations : పండ్లు, కూరగాయలు మన ఆహారంలో ఎంతో ముఖ్యం. అయితే వీటిని ఒకేసారి కలిపి తినడం అనేది మంచిది కాదట. పండ్లతో జత చేసి తినకూడదని ఆహార పదార్ధాలు తింటే ఎలాంటి అనారోగ్యాలకు దారి తీస్తుందో తెలుసా?
Fruits vs Fruit Juices : పండ్లు vs పండ్ల రసాలు.. వీటిలో ఏవి ఎక్కువ పోషకాలను కలిగి ఉంటాయో తెలుసా ?
పండ్లలో మనకు కావాల్సిన విటమిన్స్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. పండ్లు రుచితో పాటు ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తాయి. అయితే వాటిని తినేటపుడు ఎక్కువ ప్రయోజనం పొందాలంటే కొన్ని నియమాలు పాటించాలని మీకు తెలుసా? చాలామంది పండ్లను ఇతర ఆహార పదార్ధాలతో కలిపి తింటూ ఉంటారు. అలా తినడం సరైన పద్ధతి కాదని ఆయుర్వేద వైద్యులు డాక్టర్ డింపుల్ జంగ్దా చెబుతున్నారు. పండ్లతో ఎటువంటి ఆహారం కలిపి తీసుకోకూడదో వివరిస్తూ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశారు.
పండ్లను తినేటప్పుడు ఖచ్చితంగా వాటిని పాల ఉత్పత్తులతో కలిపి తినకూడదట. పండ్లను పాలు, పెరుగు, చీజ్ లేదా ఇతర పాల ఉత్పత్తులతో కలిపినప్పుడు అవి విషపూరితం అవుతాయట. అంతేకాదు అది అజీర్తి, ఉబ్బరం, గ్యాస్ వంటి అనారోగ్యాలకు దారి తీస్తాయట. పండ్లు, కూరగాయలు రెండు ఆరోగ్యానికి మంచివి. కానీ వాటిని ఒకేసారి తినడం మాత్రం మంచిది కాదు. ఎందుకంటే పండ్లు, కూరగాయలు జీర్ణక్రియ, శోషణ, సమీకరణలలో సమయం తేడా ఉండటంతో ఉబ్బరం, గ్యాస్ వంటి ఇబ్బందులకు దారి తీస్తుందట.
Eating Fruits : బరువు ఎక్కువ ఉన్నవాళ్లు పండ్లు తినొచ్చా…?
పండ్లు, కూరగాయల వలే పండ్లు ధాన్యాలు కూడా జీర్ణ సమయాల్లో తేడాను కలిగి ఉంటాయి. ధాన్యాలు, పప్పులు అరుగుదలకు సుమారు 16 గంటల సమయం అవసరం. జీర్ణ సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే పండ్లు విడిగా, ధాన్యాలతో తయారు చేసిన ఆహారం విడిగా తినడం మంచిది. ఉదాహరణకు ఓట్ మీల్ లేదా శాండ్ విచ్‌ను తినాలనుకుంటే వాటిని తినడానికి ముందు లేదా తర్వాత ప్రత్యేకంగా పండ్లను తీసుకోవాలట. రెండింటిని కలిపి మాత్రం తినకూడదట. విడి విడిగా తినడం వల్ల కడుపులో ఇబ్బంది ఉండదు.. అలాగే రుచులు, పోషకాలను కూడా ఆస్వాదించవచ్చును. ఈ విషయాలన్నిటినీ డాక్టర్ జంగ్దా సూచించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మీరు ఓ లుక్ వేయండి.