Reduce Weight : బరువును తగ్గించే కుంకుమపువ్వు, పుదీనా కషాయం!

అధిక బరువు కారణంగా డయాబెటిస్ బ్లడ్ ప్రెషర్ గుండెకు సంబంధించిన సమస్యలు వస్తాయి. సాధ్యమైనంత వరకు బరువు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇందుకోసం కొన్ని రకాల కషాయాలు బాగా తోడ్పడతాయి.

Reduce Weight : వేళకు తినకపోవడం, సమయానికి నిద్ర పోకపోవడం తదితర కారణాలు బరువు పెరగడానికి కారణం. అయితే ఈ అధిక బరువు వివిధ రకాల శారీరక రోగాలకు దారి తీస్తుంది. ఎటువంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉండాలంటే కచ్చితంగా బరువు తగ్గాలి. అధిక బరువు కారణంగా డయాబెటిస్ బ్లడ్ ప్రెషర్ గుండెకు సంబంధించిన సమస్యలు వస్తాయి. సాధ్యమైనంత వరకు బరువు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇందుకోసం కొన్ని రకాల కషాయాలు బాగా తోడ్పడతాయి. అలాంటి వాటిలో కుంకుమపువ్వు, పుదీనా కషాయం ఒకటి.

బరువు తగ్గించే కుంకుమపువ్వు, పుదీనా కషాయం ;

ఇందుకోసం అర స్పూను కుంకుమపువ్వు తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పొయ్యి వెలిగించి గిన్నె పెట్టి ఒక గ్లాసు నీటిని పోయాలి. నీరు కాస్త వేడెక్కాక దంచి పెట్టుకున్న కుంకుమపువ్వు, శుభ్రంగా కడిగిన 10 పుదీనా ఆకులు, అల్లం ముక్కలు, రెండు లెమన్ స్లైసెస్ వేసి ఏడు నుంచి పది నిమిషాలు బాగా మరిగించుకోవాలి. ఆ తర్వాత ఈ నీటిని వడగట్టి ఈ నీటిలో ఒక స్పూను నిమ్మరసం, ఒక స్పూను తేనె కలిపి ఉదయం సమయంలో తీసుకోవాలి.

ఇలా ప్రతి రోజు తాగితే శరీరంలో క్యాలరీలు త్వరగా కరుగుతాయి. అలసట,నీరసం లేకుండా రోజంతా హుషారుగా ఉంటారు. శరీరంలో వ్యర్ధాలు బయటకు వెళతాయి. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. అధిక బరువు సమస్యతో బాధపడే వారే కాకుండా ఎవరైనా ఈ టీ తాగవచ్చు. ఈ టీ తాగడం వలన ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అధిక బరువు సమస్యతో ఉన్నవారు ప్రతిరోజు ఈ కషాయం తాగితే నార్మల్ గా ఉన్నవారు వారంలో రెండు లేదా మూడుసార్లు ఈ కషాయం తాగితే సీజనల్ గా వచ్చే వ్యాధులు దరిచేరవు.

 

ట్రెండింగ్ వార్తలు