Horror Movies : హారర్ సినిమాలు చూడటం వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయా?

దెయ్యం సినిమా అంటే చూడటానికి ఇష్టం అనిపిస్తుంది. తర్వాతే అసలు భయం మొదలవుతుంది. అయితే హారర్ సినిమాలు చూడటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని సైంటిఫిక్ పరిశోధనలు చెబుతున్నాయి.

Horror Movies

Horror Movies : హారర్  సినిమాలు చూడటానికి చాలామంది ఇష్టపడతారు. చూస్తున్నంత సేపు ఎగ్జైట్ అవుతారు. కానీ తరువాత ఆ సినిమాలోని సీన్స్ గుర్తు తెచ్చుకుని భయపడుతుంటారు. నిజానికి భయానక సినిమాలు చూడటం ఆరోగ్యానికి మంచిదట. ఆశ్చర్యంగా ఉందా? కొన్ని పరిశోధనల్లో హారర్ సినిమాలు చూడటం మంచిదే అని తేలిందట. అయితే ఏరకంగా ప్రయోజనం అంటే.. చదవండి.

Ghost Husband : దెయ్యం భర్త నుంచి విడాకులు కోరుతున్న భార్య.. వైరల్ అవుతున్న వింత కథ

చాలామంది కేలరీలు తగ్గించుకోవాలని తెగ తాపత్రయపడుతుంటారు. అయితే 90 నిముషాల హారర్ సినిమా చూస్తే ఎటువంటి శారీరక శ్రమ లేకుండా కేలరీలు బర్న్ అవుతాయట. దాదాపుగా 200 కేలరీలు బర్న్ చేయవచ్చునట. ఇక సినిమా చూస్తున్నంత సేపు భయపడేవారిని చూస్తుంటాం. కానీ ఆ తరువాత వారిలో ఆందోళన, నిరాశ తగ్గిపోతాయట. చాలా సంతోషంగా కనిపిస్తారట. మానసిక స్థితిని మెరుగుపరచడంలో హారర్ సినిమాలు ఎంతగానో ఉపయోగపడతాయట.

 

హారర్ సినిమా చూస్తున్నంత సేపు రక్తంలో తెల్ల రక్త కణాలు పెరుగుతాయట. ఇది తక్కువ టైంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. చాలామంది ఒత్తిడితో ఉంటారు. అలాంటి వారు హారర్ సినిమాలు చూడటం వల్ల ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారట. హారర్ సినిమా చూస్తున్నప్పుడు న్యూరోట్రాన్స్‌మీటర్లు విడుదలవుతాయి. ఇవి బ్రెయిన్ పనితీరును మెరుపరుస్తాయట. హారర్ సినిమాలు చూసేవారు జీవితంలో దేనికీ భయపడరట. దేన్నైనా ఎదుర్కొనగలిగే ధైర్యం వస్తుందట.ఇక పట్టుదల నేర్పుతాయట. ఎలాంటి ప్రమాదకరమైన పరిస్థితిలో అయినా ధైర్యంగా ఉండేలా హారర్ సినిమాలు ప్రేరేపిస్తాయట.

Ghost Bike : వామ్మో.. దెయ్యం కానీ నడిపిందా? దానంతట అదే స్టార్ట్ అయ్యి కొంతదూరం వెళ్లిన బైక్, వీడియో వైరల్

జీవితంలో ప్రతి ఒక్కరికి సమస్యలు ఉంటాయి. వాటికి కొందరు విపరీతంగా భయపడిపోతుంటారు. హారర్ సినిమాలు జీవితంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారా మార్గాలు చూపిస్తాయట. సమస్యకు సొల్యూషన్ కనుగొనేలా చేస్తాయట. ఇవి హారర్ సినిమాలు చూడటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలట.