New Drug-Future Pandemic కరోనాను అంతం చేసే కొత్త డ్రగ్.. భవిష్యత్తు మహమ్మారులతో పోరాడొచ్చు!

New drug target to treat coronavirus : కరోనాను అంతం చేసే కొత్త డ్రగ్ కనుగొన్నారు సైంటిస్టులు. కరోనాకు కారణమయ్యే (SARS-CoV-2 virus) చికిత్స కోసం ఈ డ్రగ్‌ను కనిపెట్టారు. భవిష్యత్తులో కరోనావైరస్ మహమ్మారులపై పోరాడేందుకు ఈ డ్రగ్ సాయపడుతుందని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. అమెరికాలోని నార్త్ వెస్ట్రన్ యూనివర్శిటీ Feinberg School of Medicine కు చెందిన సైంటిస్టులు ఈ ఔషధాన్ని రూపొందించారు. రాబోయే కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉందని అభిప్రాయ పడుతున్నారు.

గతంలోనే ఈ పరిశోధక బృందం nsp16 అనే వైరస్ ప్రోటీన్ నిర్మాణాన్ని మ్యాపింగ్ చేశారు. ఇప్పుడీ ప్రోటీన్.. ప్రస్తుత అన్ని కరోనావైరస్ లలో ఉంది. తాజా అధ్యయనంలో అందించిన కీలక డేటాను పరిశీలిస్తే.. ఈ కొత్త డ్రగ్ భవిష్యత్తులో కరోనావైరస్ లతో పాటు SARS-CoV-2 వైరస్ పై కూడా అంతం చేయగలదని అంటున్నారు. ఒకవేళ ఎవరికైనా కరోనావైరస్ వస్తే.. వెంటనే డ్రగ్ స్టోర్ లోకి వెళ్లి ఈ డ్రగ్ తెచ్చుకోవచ్చునని చెబుతున్నారు. ఒకవేళ మీరు అనారోగ్యంగా ఉంటే.. మూడు లేదా నాలుగు రోజులు ఈ డ్రగ్ తీసుకుంటే చాలు.. అంటున్నారు. అనారోగ్యానికి గురికాకుండా అడ్డుకుంటుందని పేర్కొన్నారు.

పరిశోధకులు మూడు కొత్త ప్రోటీన్ నిర్మాణాలను three-dimensional వ్యూస్‌లో మ్యాపింగ్ చేశారు. రోగనిరోధక వ్యవస్థ నుంచి వైరస్ దాగేందుకు సాయపడే ఒక సీక్రెట్ ఐడెంటిఫైయర్‌ను కనుగొన్నారు. nsp16 అనే ప్రోటీన్‌లో ఒక కరోనావైరస్ కణాన్ని కనుగొన్నారు. ఇది ఒక లోహ అయాన్ వైరస్-జన్యు భాగాన్ని పట్టుకుంటుంది. ఈ భాగం ద్వారా శరీరంలోని అన్ని భాగాలకు వ్యాపించేలా చేస్తుంది. కరోనావైరస్ నుంచి ఈ ప్రోటీన్ పనితీరును నిరోధించే ఒక ఔషధాన్ని తయారుచేసే అవకాశం ఉందని పరిశోధకులు చెప్పారు.

కరోనా సోకినా అనారోగ్యానికి గురికాకుండా ఆపడమే దీని లక్ష్యమని పరిశోధకులు తెలిపారు. కరోనావైరస్ ప్రోటీన్లు తేడాగా ఉన్నప్పటికీ, చాలా వరకు nsp16 దాదాపు ఒకే విధంగా ఉంటుందని పరిశోధకులు గుర్తించారు. పరిశోదక బృందం కనుగొన్న ఈ భాగం అన్ని వేర్వేరు కరోనావైరస్ జాతుల్లోనూ ఉంటుంది. దీనికి సరిపోయేలా రూపొందించే మందులు భవిష్యత్తులో ఉద్భవించే వైరస్‌తో సహా అన్ని కరోనావైరస్లపై పనిచేయాలని పరిశోధకులు తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు