Secondary bloodstream infections : రక్తంలో ఇన్ఫెక్షన్ ఉన్నవారిలో తీవ్రమైన కరోనాకు దారితీయొచ్చునని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు. Rutgers అధ్యయనం ప్రకారం.. సెకండరీ బ్లడ్ స్ట్రీమ్ ఇన్ఫెక్షన్లు ఉన్నవారిలోనే తీవ్రమైన కోవిడ్ ప్రభావం ఉంటుందని అంటున్నారు. ఈ తరహా బ్లడ్ ఇన్ఫెక్షన్లతో ఆస్పత్రిలో చేరినవారంతా తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని ఓ కొత్త అధ్యయనంలో వెల్లడైంది. ఎక్కువకాలం ఆస్పత్రిలో ఉన్నవారిలో సెకండరీ బ్లడ్ స్ట్రీమ్ ఇన్ఫెక్షన్లకు మరింత దారితీసే ప్రమాదం ఉందంట..
క్లినికల్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ జర్నల్‌లో ప్రచురించిన ఈ అధ్యయనం ప్రకారం.. సెకండరీ బ్లడ్ స్ట్రీమ్ ఇన్ఫెక్షన్లతో ఆసుపత్రిలో చేరిన రోగులలో తీవ్రమైన COVID-19 ఎక్కువగా నమోదైనట్టు కనుగొన్నారు. 2020 మార్చి నుంచి మే వరకు తీవ్రమైన COVID-19తో బాధపడుతున్న 375 మంది రోగులను పరిశోధకులు పరీక్షించారు. రక్తంలో ఇన్ఫెక్షన్లు ఉన్న 128 మంది బాధితుల నమూనాలను సేకరించి ల్యాబరేటరీలో టెస్టింగ్ కు పంపారు.
అందులో 92 శాతం బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు ఉన్నాయి. వీరిలో మానసిక స్థితి, తక్కువ శాతంలో ఆక్సిజన్, సెప్టిక్ షాక్, రక్తప్రవాహ ఇన్ఫెక్షన్లు లేని వారితో పోలిస్తే.. ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చేరే అవకాశం ఎక్కువగా ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఆస్పత్రిలో చేరిన తరువాత ఆక్సిజన్ అవసరమయ్యే బాధితుల్లో సెకండరీ బ్లడ్ స్ట్రీమ్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా ఉన్నాయని పరిశోధకులు కనుగొన్నారు. ఆస్పత్రిలో మరణాల రేటు 50 శాతానికి పైగా పెరిగిందని అంటున్నారు. COVID-19 బాధితుల్లో అంటువ్యాధులు అనారోగ్యం తీవ్రతకు దారితీసి ఉండొచ్చునని పేర్కొన్నారు.
COVID-19 ఇతర శారీరక రోగనిరోధక సమస్యలను కారణమై ఉండొచ్చునని భావిస్తున్నారు. ద్వితీయ రక్త ప్రవాహ అంటువ్యాధులు (Secondary bloodstream infections) అసలు కారణం తెలియదని అధ్యయనం పేర్కొంది. 80 శాతం మంది రోగులు ఆస్పత్రిలో చేరిన సమయంలో ఏదో ఒక సమయంలో యాంటీమైక్రోబయాల్స్‌ను తీసుకున్నారు. వీరిలో తీవ్రమైన COVID-19లో సెకండరీ బ్లడ్ స్ట్రీమ్ ఇన్ఫెక్షన్లకు ఎలా దారితీసిందో అర్థం చేసుకోవడానికి మరిన్ని అధ్యయనాలు అవసరమని అంటున్నారు.