Green Peas : ఈ సమస్యలున్నవారు బచ్చి బఠాణీలను తినకపోవటమే మంచిదా?

అయితే కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు కలవారు పచ్చి బఠాణీలు తినడం వల్ల, వారి ఆరోగ్యసమస్యలు ఇంకా అధికమవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జీర్ణ సంబంధిత సమస్యలు కలవారు వీటిని తినకపోవటమే మంచిది. గ్యాస్ లేదా ఎసిడిటీతో సమస్యతో బాధపడేవారు పచ్చి బఠానీలను అధికంగా తీసుకుంటే జీర్ణం అవ్వటానికి ఎక్కువ సమయం పడుతుంది.

Green Peas : చలికాలం సీజన్ లో పచ్చి బఠానీలు మార్కెట్లో విరివిగా లభిస్తాయి. బచ్చిబఠాణీలను వివిధ వంటకాల్లో ఉపయోగిస్తారు. బఠానీలో విటమిన్ బి6, సి, ఫోలేట్ వంటి చర్మానికి అనుకూలమైన పోషకాలు సమృద్ధిగా ఉన్నాయి. ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని తగ్గించడంతోపాటు చర్మ సంరక్షణకి అవసరమైన కొల్లాజెన్, ఎలాస్టీన్ అందిస్తాయి. జంతు ఆధారిన ప్రోటీన్లు పొందలేని వాళ్ళు ప్రోటీన్స్ పొందటం కోసం పచ్చి బఠానీలు ఎంచుకోవచ్చు. కొలెస్ట్రాల్ స్థాయిలని తగ్గిస్తుంది. ఇందులో నియాసిన్ పుష్కలంగా ఉంటుంది. ట్రైగ్లిజరైడ్స్, మంచి కొలెస్ట్రాల్ స్థాయిలని పెంచుతుంది.

యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉండటం వల్ల గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఆర్థరైటిస్ నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఫైబర్ సమృద్ధిగా ఉండటం వల్ల జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది. మలబద్ధకం సమస్యని తగ్గిస్తుంది. దీనిలోని విటమిన్ కె ఎముకలని ధృడంగా చేస్తుంది. బోలు ఎముకల వ్యాధి రాకుండా అడ్డుకుంటుంది. విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది.

బఠాణీలు ఎవరు తినకూడదు ;

అయితే కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు కలవారు పచ్చి బఠాణీలు తినడం వల్ల, వారి ఆరోగ్యసమస్యలు ఇంకా అధికమవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జీర్ణ సంబంధిత సమస్యలు కలవారు వీటిని తినకపోవటమే మంచిది. గ్యాస్ లేదా ఎసిడిటీతో సమస్యతో బాధపడేవారు పచ్చి బఠానీలను అధికంగా తీసుకుంటే జీర్ణం అవ్వటానికి ఎక్కువ సమయం పడుతుంది. దీని వల్ల గ్యాస్ అధికమై పొట్ట సమస్యలు అధికమవుతాయి. వీటిలో అధికంగా ప్రొటీన్లు పచ్చి బఠాణిలను అధికంగా తినడం తీసుకోవడం వల్ల,ఇందులోని ప్రోటీన్ వల్ల కిడ్నీలపై భారం పడి, కిడ్నీ సమస్యలు అధికమవుతాయి.

శరీరానికి కావాల్సిన ప్రోటీన్లు, అమైనో యాసిడ్‌లు, విటమిన్ డి పుష్కలంగా లభిస్తాయి. ఈ న్యుట్రియన్స్ యూరిక్‌ యాసిడ్‌ని అధికంగా ఉత్పత్తి కావడానికి దోహదం చేస్తాయి. అధిక యూరిక్ యాసిడ్ శరీరంలో నిలిచిపోవడం వల్ల, స్పటికాలుగా మారి కీళ్లలోకి చేరి, కీళ్ల నొప్పులు వచ్చే ప్రమాదం ఉంటుంది. అధిక యూరిక్ యాసిడ్ తో బాధపడేవారు వీటిని తినకపోవటమే మంచిది. ఉబకాయులు ఎక్కువ మొత్తంలో పచ్చి బఠాణిలను తీసుకోవడం వల్ల, ఇందులోని కార్బోహైడ్రేట్లు ఎక్కువగా శరీరంలోకి చేరి ఉబకాయానికి దారితీస్తుంది. అంతేకాకుండా చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోయి గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అధిక బరువు తగ్గాలి అనుకున్న వారు, వీటిని తినకపోవటమే మంచిది.

 

ట్రెండింగ్ వార్తలు