Vaccinated People Mask : కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నవారంతా మాస్క్ ధరించాల్సిందేనా?

ఒకవైపు వ్యాక్సినేషన్.. మరోవైపు కరోనా కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. ఈ క్రమంలో వ్యాక్సిన్ వేయించుకోనివారితో పాటు టీకా తీసుకున్నవారు కూడా తప్పనిసరిగా మాస్క్ ధరించాలా? అంటే..

Vaccinated People Mask Up : ప్రపంచమంతా కరోనావైరస్ విజృంభిస్తూనే ఉంది. ఒకవైపు వ్యాక్సినేషన్.. మరోవైపు కరోనా కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. ఈ క్రమంలో వ్యాక్సిన్ వేయించుకోనివారితో పాటు టీకా తీసుకున్నవారు కూడా తప్పనిసరిగా మాస్క్ ధరించాలా? అంటే.. పరిస్థితులను బట్టి తప్పదంటున్నారు నిపుణులు. జన సమూహంలోకి వెళ్లిన సమయాల్లో తప్పనిసరిగా మాస్క్ ధరించాలని సూచిస్తున్నారు.

మాస్క్ అనేది కరోనా ఇన్ఫెక్షన్ నుంచి రక్షించేందుకు అవకాశం ఉంది. ఒకరి నుంచి మరోకరికి వైరస్ వ్యాపించకుండా మాస్క్ నివారించగలదు. ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో వ్యాక్సిన్ వేయించుకోనివారు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీరంతా కొవిడ్ నిబంధనలను పాటించినంత వరకు వైరస్ ను కట్టడి చేయడం సాధ్యమే. లేదంటే వైరస్ ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాపించే ముప్పు లేకపోలేదు. పూర్తి వ్యాక్సిన్ వేయించుకున్నవారు మాస్క్ లేకుండా బహిరంగ ప్రదేశాల్లోకి సురక్షితంగా వెళ్లవచ్చుననే సూచనలను యుఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ మార్చలేదు. కానీ ఏజెన్సీ డైరెక్టర్ డాక్టర్ రోషెల్ వాలెన్స్కీ చెప్పిన ప్రకారం.. మాస్క్ ఆదేశాలపై స్థానిక నిర్ణయాలు టీకా స్థాయిలపై ఆధారపడి మారవచ్చునని  అభిప్రాయపడ్డారు.

లాస్ ఏంజిల్స్ కౌంటీ ఇటీవలే టీకాల స్టేటస్‌తో సంబంధం లేకుండా ఇంట్లో కూడా మాస్క్‌లు ధరించాలని సూచించింది. కరోనావ్యాక్సిన్లు కరోనా తీవ్రతతో పాటు మరణించే ముప్పును కూడా తగ్గించగలవు. అలాగే ఇతర కరోనా వేరియంట్లపై కూడా సమర్థవంతంగా పనిచేయగలని కొందరు నిపుణులు చెబుతున్నాయి. అయినప్పటికీ కూడా టీకా తీసుకున్నవారందరూ తప్పక మాస్క్ ధరించాలని సూచిస్తున్నారు. మాస్క్ ధరించడం ద్వారా పిల్లలకు సోకకుండా నివారించవచ్చు. అలాగే రోగనిరోధక వ్యవస్థ తక్కువగా ఉన్నవారికి కూడా మాస్క్ రక్షణ కల్పించగలదని సూచిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు