కోవిడ్-19 వైరస్ నుంచి ఇక మాస్క్‌లే కాదు.. వేసుకునే డ్రెస్సింగ్ సూట్లు కూడా ప్రొటెక్ట్ చేయనున్నాయి. యాంటీ కరోనా ఫాబ్రిక్ సూట్ల పేరుతో మార్కెట్లోకి వచ్చేశాయి. టెక్స్ టైల్ ఇండస్ట్రీ నుంచి భారతీయ వినియోగదారులను ఆకర్షించేందుకు సియారాం అనే టెక్స్ టైల్ కంపెనీ ఈ తరహా సూట్లను డిజైన్ చేసింది.
ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా నుంచి రక్షణ కోసం అవసరమైన సూట్లను డిజైన్ చేస్తున్నామంటోంది. వీటికి యాటీ కరోనా ఫాబ్రిక్ సూట్లు అని పేరు పెట్టింది. కరోనా నుంచి 99.9 శాతం ప్రొటెక్షన్ గ్యారెంటీ అంటోంది. ఈ సూట్లు ధరించి బయటకు వెళ్లినా కరోనా ఏం చేయదని.. పూర్తి స్థాయిలో దాదాపు 100 శాతం వైరస్ నుంచి ప్రొటెక్షన్ అందిస్తుందని గట్టిగా చెబుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఆమోదించిన టెస్టింగ్ ల్యాబ్‌ల్లో ఈ యాంటీ కరోనా ఫాబ్రిక్ సూట్లను పరీక్షించినట్టు చెబుతోంది.
కొత్త ఫాబ్రిక్ కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా 99.94 శాతం ప్రభావవంతంగా పనిచేస్తుందని కంపెనీ హామీ ఇస్తోంది. ఇతర మెటల్ ఆధారిత కెమిస్ట్రీ ప్రొడక్టులతో పోల్చితే లీచింగ్ డిజైన్ కలిగి ఉంది. ఈ క్లాత్ లేయర్ నీటిలో కరిగిపోకుండా సాయపడుతుంది. ఫాబ్రిక్ సహజ, స్థిరమైన జీవఅధోకరణ పదార్థాల నుంచి తయారైంది.
ఫాబ్రిక్ మృదువైన డిజైన్‌తో లీచింగ్ చూస్తే తెలిసిపోతుంది. సియారామ్ సిల్క్ మిల్స్ లిమిటెడ్ సిఎండి రమేష్ పోద్దార్ చెప్పిన ప్రకారం.. మన శరీరంలో 90శాతం క్లాత్‌లతో కవర్ చేసి ఉంటుంది. వైరస్ నుంచి క్లాత్ ఉపరితలంపై ఎక్కువ గంటలు వృద్ధి చెందడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అన్నారు.