Skin care is very important during winters! Home tips are better than products in the market for this!
Skin Care : చలికాలంలో చర్మం పొడిబారటం వల్ల అనేక సమస్యలు వస్తాయి. చర్మంలో దురద, ఇన్ఫ్లమేషన్, వల్ల ఒంటిపై దుస్తులు ధరించటం కూడా కష్టమౌతుంది. చర్మం నిర్జీవంగా, డల్ గా కనబడుతుంది. చర్మం పగలడం వల్ల చికాకు కలుగుతుంది. ఆపగుళ్లలోకి కంటికి కనబడని క్రిముల చేరడానికి అవకాశం లభిస్తుంది. చలికాలంలో చర్మ సంరక్షణ కోసం తీసుకునే మాయిశ్చరైజర్లు తాత్కాలికం గా మాత్రమే పనిచేస్తాయి.
మనం ఎంపిక చేసుకునే మాయిశ్చరైజర్స్ కూడా చర్మం తత్వాన్ని బట్టి ఎంపిక చేసుకోవాలి. ఇలా చేయటం అందరికి సాధ్యం కాక పోవచ్చు. శరీతత్వాన్ని బట్టి కాకుండా కఠినమైన క్రీమ్ బేస్డ్ మాయిశ్చరైజర్స్ తీసుకోవడం వల్ల చర్మం రంద్రాలు మూసుకుపోయేలా చేయటంతోపాటు, మొటిమలు ఏర్పడటానికి కారణమౌతుంది. అందువల్ల చలికాలంలో మీ చర్మానికి సరిపోయే వాటిని ఎంపిక చేసుకోవాలి.
చలికాలంలో చర్మం స్మూత్ గా, నిగారింపుతో ఉండాలంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. చలికాలంలో ఇంట్లోనే చక్కటి చిట్కాలను ఫాలో కావటం వల్ల ఈ సమస్యకు గుడ్ బై చెప్పవచ్చు. అదెలాగో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
1) బొప్పాయి ఫేస్ ప్యాక్: బొప్పాయి ద్వారా అనేక చర్మ సంబంధిత ప్రయోజనాలు పొందవచ్చు. శీతాకాలంలో చర్మ సంరక్షణకు అద్భుతంగా సహాయపడుతుంది . ఇది చర్మాన్ని మాయిశ్చరైజ్ గా ఉంచుతుంది. చర్మాన్ని బిగుతుగా మారుస్తుంది. బాగా పండిన బొప్పాయిని గుజ్జులా చేసి అందులో కొద్దిగా పాలు మిక్స్ చేసి, ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి. పది నిముషాల తర్వాత శుభ్ర చేయడం వల్ల అద్భుతంగా ఉంటుంది.
2) అలోవెరా జెల్ : పొడిబారిన చర్మానికి త్వరితగతిన ఉపశమనం కలిగించడానికి అలోవెరా జెల్ చక్కటి పరిష్కారం. అలోవెరా జెల్ లో ఉండే యాసిడ్స్ డెడ్ స్కిన్ సెల్స్ ని నాశనం చేస్తాయి. కాబట్టి న్యాచురల్ గా లభించే ఆలోవెరా మొక్క తీసుకుని దాన్ని కట్ చేసి జెల్ ను తీయాలి. దాన్ని ముఖానికి పట్టించడం వల్ల మంచి ఫలితం లభిస్తుంది.
3) కీరదోస కాయ: కీరోదసకాయ పొడిబారిన చర్మానికి బెస్ట్ చాయిస్. డ్రై స్కిన్ నివారిస్తుంది, స్కిన్ డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది. చర్మంలో తేమను నింపుతుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్స్ చర్మాన్ని కోమలంగా ఉంచుతుంది. సన్ డ్యామేజ్ నుండి రక్షణ కల్పిస్తుంది. చర్మం పొడిబారిన చర్మానికి కొన్ని కీరదోసకయా ముక్కలు అప్లై చేసి రుద్దడం వల్ల కొంత మేలు కలుగుతుంది.
4) అవొకాడకో ఫేస్ ప్యాక్: అవొకాడోలో బయోటిన్ పుష్కలంగా ఉన్నందు వల్ల, దీని ఆహారంతో పాటు తీసుకోవడం వల్ల పొడిబారిన చర్మాన్ని, చిట్లిన కురులను, చిట్లిన గోళ్ళ సంరక్షణ బాగా తోడ్పడుతుంది. అవకాడో ఫేస్ మాస్క్ శీతాకాలంలో చర్మం పొడిబారి దురదగా ఉండటం వంటి లక్షణాలను తొలగిస్తుంది. తాజాగా ఉన్న అవాకోడోను బాగా మెత్తగా చేసి దానికి ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి బాగా ముఖానికి అప్లై చేయాలి. ఈ ఫేషియల్ మాస్క్ చర్మానికి కావాలసిన మినరల్స్, విటమిన్స్, యాంటిఆక్సిడెంట్స్ అందించి చర్మాన్ని నునుపుగా చేస్తుంది. శీతాకాలంలో చర్మం పొడిబారనీయకుండా చేస్తుంది.
5) వేపనూనె: వేపనూనె యాంటీసెప్టిక్ లక్షణాలు కలిగి ఉంది. ఇందులో మాయిశ్చరైజింగ్ గుణాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది చర్మంలో దురద, చీకాకును తొలగిస్తుంది. బ్యాక్టీరియాను తొలగిస్తుంది, ఇన్ఫెక్షన్స్ నుండి కాపాడుతుంది. చర్మానికి పోషణ కూడా అందిస్తుంది.ఈ నూనెలో ఉండే ఓమేగా ఫ్యాటీ యాసిడ్స్ స్కిన్ సెల్స్ స్ట్రాంగ్ గా ఉంచి, పోషణ అందిస్తుంది. పొడిబారకుండా చేస్తుంది.
6) మిల్క్ ఫేస్ ప్యాక్: కల్చర్డ్ మిల్క్ మాస్క్ చర్మాన్ని తేజోవంతంగా మారుస్తుంది. అందుకు ఒక మిక్సింగ్ బౌల్ ల్లో కొద్దిగా పెరుగు, మజ్జిగ, సోర్ క్రీమ్ ను వేసి బాగా మిక్స్ చేసి కళ్ళు మాత్రం వదిలి మిగిలిన ముఖ భాగం అంతా అఫ్లై చేయాలి. పదిహేను నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేయడం వల్ల చలికాలంలో చల్లగాలి, మంచు వల్ల చర్మ పొడి బారీ, పగుళ్ళు ఏర్పడకుండా చేస్తుంది.
7) ఎగ్ వైట్ ఫేస్ ప్యాక్: గుడ్డులోని తెల్ల సొన ఆయిల్ స్కిన్ ఉన్నవారికి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఎగ్ వైట్ తీసుకొని దాన్ని ముఖానికి అప్లై చేయాలి. అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేయడం వల్ల మీ చర్మం మునపటి కంటే చాలా ఆరోగ్యంగా కనబడుటయే కాకుండా జిడ్డును వదిలించి చర్మాన్ని తేమగా ఉంచుతుంది. చలికాలంలో దీన్ని వేసుకోవడం వల్ల చలినుండి, మంచు నుండి చర్మాన్ని కాపాడుతుంది.