Skin Fasting
Skin Fasting : ‘స్కిన్ ఫాస్టింగ్’.. సోషల్ మీడియాలో వేలకొద్దీ పోస్టింగ్స్‌కి ఈ హ్యాష్ ట్యాగ్ ఉపయోగిస్తున్నారు. అసలు స్కిన్ ఫాస్టింగ్ అంటే ఏంటి? ఈ ట్రెండ్‌ను అనుసరించాలా? వద్దా?
Skin Cancer Soap : చర్మ క్యాన్సర్ చికిత్సకు సబ్బును కనిపెట్టిన 14 ఏళ్ల కుర్రాడు ..
ప్రతిరోజు ఏవో ఒక చర్మ ఉత్పత్తులు మార్కెట్లోకి వస్తుంటాయి. అవి ఎందుకు చర్మానికి ప్రభావవంతమైనవో మనల్ని ఒప్పించేందుకు ఆ కంపెనీలు ప్రయత్నిస్తుంటాయి. డెయిలీ ఖచ్చితంగా అందరూ స్కిన్ ప్రాడక్ట్స్ వాడతారు. అయితే స్కిన్ ఫాస్టింగ్ వెనుక అంతరార్ధం ఏంటంటే మీ చర్మానికి వాడే ప్రాడక్ట్స్ నుంచి బ్రేక్ ఇవ్వడం.
స్కిన్ ఫాస్టింగ్ చర్మాన్ని రీసెట్ చేయడానికి, రీ బ్యాలెన్స్ చేయడానికి అనేక ఉత్పత్తులను ఉపయోగించడం నుండి కొంత సమయం ఇస్తుంది. స్కిన్ కేర్ ప్రాడక్ట్స్ తక్కువగా ఉపయోగించడం వల్ల చర్మం మొత్తం ఆరోగ్యం తిరిగి పొందడంలో సహాయపడుతుందని స్కిన్ స్పెషలిస్ట్స్ సూచిస్తున్నారు. అందులో భాగంగా కొన్ని రోజులు లేదా వారాల వరకు క్లెన్సర్‌లు, టోనర్‌లు, సీరమ్‌లు మరియు ఎక్స్‌ఫోలియెంట్‌లతో పాటు పలు స్కిన్ ప్రాడక్ట్స్ తగ్గించడం, లేదా మానేయడం బదులుగా తేలికపాటి క్లెన్సర్ సాధారణ మాయిశ్చరైజర్ ఉపయోగించాలి.
Winter Skin Care : చలికాలంలో చర్మ సంరక్షణ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలంటే ?
స్కిన్ ఫాస్టింగ్ సమయంలో చర్మంలో ఏదైనా చికాకు అనిపిస్తే వెంటనే స్కిన్ ఫాస్టింగ్‌ను ఆపివేసి స్కిన్ స్పెషలిస్ట్‌ను సంప్రదించడం మంచిది. ముఖ్యంగా సెన్సెటివ్ స్కిన్ ఉన్న వ్యక్తులు నెమ్మదిగా స్కిన్ ఫాస్టింగ్‌ను వారి నియమావళిలో చేర్చుకోవాలి. చర్మ సంరక్షణ ఉత్పత్తులు ఎక్కువగా వాడటం వల్ల చర్మం సున్నితత్వం పోయి చికాకు కలిగిస్తుంది. స్కిన్ ఫాస్టింగ్ చర్మానికి అవసరమైన విశ్రాంతిని ఇవ్వడంతో పాటు తిరిగి రీబ్యాలెన్స్ చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది.