Body Disorders : శరీరంలో కొన్ని లక్ష్మణాలు రుగ్మతలకు సూచికలే!

పాదానికి ఎప్పుడైనా చిన్న దెబ్బ తగలితే పుండు ఏర్పడుతుంది. మూడు నాలుగు రోజుల్లు పుండు మానకుంటే మాత్రం జాగ్రత్త పడటం మంచిది.

Body Disorders

Body Disorders : జలుబు, దగ్గు, తలనొప్పి, అలసట తదితర సాధారణ అనారోగ్య లక్షణాలు కొన్ని సందర్భాల్లో ప్రమాదకరమైన రుగ్మతలకు సంకేతాలుగా నిలుస్తాయి. చాలా మంది వీటిని చిన్న సమస్యలుగా భావించి పెద్దగా పట్టించుకోరు. అయితే అంతర్లీనంగా కనిపించకుండానే అవి శరీరంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయి. కొన్ని సందర్భాల్లో ప్రాణాపాయ పరిస్ధితులకు దారితీయవచ్చు. చర్మంపై వచ్చే దురుద సాధారణమైన అలర్జీగా బావిస్తారు. అయితే దీంతో పాటు కామెర్లూ, శారీరక అలసట ఉంటే మాత్రం అది కాలేయానికి సంబంధించిన అనారోగ్యంగా అనుమానించాలి.

రోమ్ముదగ్గర చర్మం పొడిబారటం, దద్దుర్లు, సాధారణ చికిత్సకు లొంగకుంటే క్యాన్సర్ నిపుణులను కలవటం మంచిది. ఎందుకంటే రొమ్ము క్యాన్సర్ లక్షణాల్లో అది ఒకటి కావచ్చు. వివిధ రకాల పరీక్షల ద్వారా క్యాన్సర్ ఉందో లేదో నిర్ధారించి తగిన చికిత్స పొందేందుకు అవకాశం ఉంటుంది. చేతి వేళ్ళ గోళ్లు ఉబ్బినట్లు , వంకర్లు తిరిగినట్లు కనిపిస్తే రక్తంలో ఆక్సిజన్ కొరత ఉన్నట్లు భావించాలి. దీని వల్ల ఊపిరితిత్తులు, గుండెకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.

పాదానికి ఎప్పుడైనా చిన్న దెబ్బ తగలితే పుండు ఏర్పడుతుంది. మూడు నాలుగు రోజుల్లు పుండు మానకుంటే మాత్రం జాగ్రత్త పడటం మంచిది. ఎందుకంటే మధుమేహం ఉండే వారిలో పుండు త్వరగా మానకపోను దాని వల్ల లేనిపోని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఉదయం నిద్రలెగవటంతోనే అలసట, నీరసం, తలనొప్పి వంటి సమస్యలు దీర్ఘకాలంగా వేధిస్తుంటే ఏమాత్రం అలసత్వం చేయకుండా వైద్యులను సంప్రదించి తగిన వ్యాధి నిర్దారణ పరీక్షలు చేయించుకోవటం మంచిది. ఎందుకంటే రాత్రి మీరు నిద్రించిన ప్రాంతంలో వాతావరణంలో కార్బన్ మోనాక్సైడ్ విషయవాయువుల ప్రభావం వల్ల అలా జరిగే ప్రమాదం లేకపోలేదు.