Soybeans that make hair black and thick!
Soya Beans : జుట్టు రాలడానికి ప్రధాన కారణాల్లో చుండ్రు కూడా ఒకటి. చుండ్రు ఎక్కువగా ఉండడం వల్ల జుట్టు ఎక్కువగా రాలుతుంది. అలాగే పోషకాహార లోపం వల్ల కూడా జుట్టు రాలుతుంది. జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే మనం ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. జుట్టుకు సరైన పోషకాలు అందకపోతే జుట్టు రాలిపోయి బట్టతల అవుతుంది. బట్టతల వచ్చిన తరువాత మనం ఎటువంటి ఆహారాలు తీసుకున్నా రాలిన జుట్టు స్థానంలో కొత్త జుట్టు రాదు.
సాధ్యమైనంత వరకు జుట్టు రాలకుండా, రాలిన జుట్టు స్థానంలో కొత్త జుట్టు రావాలంటే పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. జుట్టు రాలడానికి కారణమయ్యే సమస్యల్లో చుండ్రు సమస్య ఒకటి. దీని నుండి సులభంగా బయటపడవచ్చు. తలస్నానం చేసేటప్పుడు మన వేళ్లతో మాడును బాగా రుద్దాలి. అలాగే ప్రతిరోజూ తలస్నానం చేయాలి. ఇలా చేస్తే కొద్ది రోజుల్లోనే చుండ్రు సమస్య నుండి ఉపశమనం లభిస్తుంది. తలస్నానం ప్రతిరోజూ చేయాలి. దీంతో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ లు రాకుండా ఉంటాయి. జుట్టు కుదుళ్లు బలంగా మారతాయి.
జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా పెరగాలంటే ప్రోటీన్లు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాల్లో సోయాబీన్స్ ఒకటి. ఈ సోయాబీన్స్ ను నానబెట్టి మొలకెత్తిన విత్తనాలను తీసుకోవడం వల్ల మన శరీరానికి కావల్సిన ప్రోటీన్స్ లభిస్తాయి. తగినన్ని ప్రోటీన్స్ అందడం వల్ల జుట్టు రాలడం తగ్గడంతో పాటు రాలిన జుట్టు స్థానంలో కొత్త జుట్టు పెరుగటంతోపాటు ఒత్తుగా ఉంటుంది.
సోయాబీన్ లో ఉండే నూనె రిబోఫ్లావిన్ యొక్క సహజ మూలం కాబట్టి జుట్టుకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అకస్మాత్తుగా జుట్టు రాలుతుంటే సోయాబీన్ నూనెను ఉపయోగించటం ద్వారా మంచి ఫలితాన్ని పొందవచ్చు. ఎందుకంటే రిబోఫ్లావిన్ లోపం వల్ల జుట్టు రాలిపోతుంది. ఆసమయంలో సోయాబీన్ తీసుకోవటం వల్ల శరీరానికి రిబోఫ్లావిన్ విటమిన్ B2, అందుతుంది. ఇది జుట్టు పెరుగుదలకి సహాయపడుతుంది. దీంతోపాటు శరీరంలో శక్తి ఉత్పత్తికి సహాయపడుతుంది.