Kitchen Tips : మహిళల కోసం ప్రత్యేక వంటింటి చిట్కాలు!

కూరల్లో కారం కాస్త ఎక్కువైతే అందులో కొంచెం నిమ్మరసం లేదా రెండు టీస్పూన్ల నెయ్యి కలిపితే కారం తగ్గుతుంది.

Girl Make A Vase. Pottery Theme. On A Pottery's Machine.

Kitchen Tips : నిత్యం వంటింటిలో కుటుంబసభ్యులకోసం రుచికరమైన ఆహారాన్ని అందించాలన్న ఉద్దేశంతో బాగా కష్టపడిపోతుంటారు చాలా మంది మహిళలు. వంటల్లో మెళుకువలను తెలుసుకునేందుకు వంటల పుస్తకాలతోపాటు, సోషల్ మీడియాలో వంటల ప్రోగ్రామ్స్ ను ఆసక్తిగా గమనిస్తుంటారు. అలాంటి గృహిణులకు ఉపయోగపడే చిట్కాలు కొన్ని మీకోసం….

1. రోజు కాఫీ తాగి బోరుకొడితే వెరైటీగా కాఫీ మంచి రుచిగా ఉండేందుకు అందులో కొద్దిగా బోర్నవిటా కలుపుకోవాలి. దీంతో కాఫీకి మంచి రుచి వస్తుంది.

2. బొంబాయి రవ్వ హల్వా మరింత రుచిగా ఉండాలంటే ఒక టేబుల్ స్పూన్ శెనగ పిండిని కలుపుకుకోవాలి.

3. మిగిలిపోయిన అన్నంలో కొంచెం మసాలా దినుసులు, బ్రెడ్ వేసి అన్నాన్ని మెత్తగా చేయాలి. ఈ మిశ్రమంతో కరకరలాడే పకోడీలు తయారు చేసుకుని తినవచ్చు.

4. గులాబ్ జామున్ లు గట్టిగా అయితే పంచదార పాకంతో సహా వాటిని ప్రెషర్ కుక్కర్ లో పెట్టి సన్నటి మంటమీద ఐదు నిమిషాలు ఉడికిస్తే మృధువుగా మారతాయి.

5. కూరల్లో కారం కాస్త ఎక్కువైతే అందులో కొంచెం నిమ్మరసం లేదా రెండు టీస్పూన్ల నెయ్యి కలిపితే కారం తగ్గుతుంది.

6. కొత్తిమీర చట్నీ తయారు చేసే సందర్భంలో కొన్ని నట్స్ వేస్తే పోషకాలు అందటంతోపాటు, ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది.

7. పిల్లలకు రుచికరమైన ఫ్రూట్ షేక్ ను నిమిషాల్లో అందివ్వాలంటే ఒక టేబుల్ స్పూన్ ఫ్రూట్ జామ్ ను ఒక గ్లాసు చల్లటి పాలలో వేసి మిక్సీలో బ్లెండ్ చేయాలి. రుచికరమైన ఫ్రూట్ షేక్ రెడీ అయిపోతుంది.

8. పన్నీర్ వంటకం చేసేటప్పుడు నీళ్లకు బదులుగా పాలు వాడితే గ్రేవీ మెత్తగా ఉంటుంది.

9. ఇంగువ గట్టిపడితే అందులో పచ్చి మిర్చి వేయాలి.

10. కలిపిన చపాతీ పిండి మిగిలిపోతే ఆ ముద్దపైన కొద్దిగా నూనె లేదా నెయ్యి వేసి రిఫ్రిజిరేటర్ లో ఉంచాలి.