Exercising : ఆరోగ్యంగా ఉన్నామని వ్యాయామాలు మానేస్తున్నారా!

రోజుకు కనీసం 5వేల అడుగులు వేయటం వల్ల కొంతమేర ఫలితం ఉంటుంది. ఎంత సమయం నడిచామో తెలుసుకునేందుకు ఇటీవల మార్కెట్లోకి కొన్ని ఫిటెనెస్ ట్రాకింగ్ పరికరాలు అందుబాటులోకి వచ్చాయి.

Exercising

Exercising : ఆరోగ్యానికి ప్రతిరోజు వ్యాయామాలు చేయటం చాలా అవసరం. వాకింగ్, జాగింగ్ , స్విమ్మింగ్, ఇలా వివిధ రకాల పద్దతులను అనుసరిస్తూ రోజులో కొద్ది సమయం వ్యాయామాలకు కేటాయిస్తే ఆరోగ్యంగా జీవనం సాగించేందుకు అవకాశం ఉంటుంది. చాలా మంది ఆరోగ్యంగా ఉన్నమని, తమకు ఇక ఢోకా లేదని వ్యాయామాలు మానేస్తుంటారు. ఇలా చేయటం ఏమాత్రం సరైంది కాదంటున్నారు నిపుణులు.

రోజు వారి వ్యాయామాలు మానేయటం వల్ల శరీరంలో కండరాల పటుత్వం తగ్గటంతోపాటు, కొవ్వు శాతం పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇది క్రమేపి మధుమేహం, గుండె జబ్బులకు దారితీసే అవకాశం ఉంటుంది. చాలా మంది తమ దైనందిన కార్యకలాపాలలో బిజీగా గడుపుతూ వ్యాయామాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. అలాంటి వారు తమ కార్యకలాపాలను కొనసాగిస్తూనే ఇంట్లోనే, ఆఫీసుల్లోనో అటు ఇటు తిరగటం, నడవటం, మెట్లెక్కటం వంటివి చేయాలి.

రోజుకు కనీసం 5వేల అడుగులు వేయటం వల్ల కొంతమేర ఫలితం ఉంటుంది. ఎంత సమయం నడిచామో తెలుసుకునేందుకు ఇటీవల మార్కెట్లోకి కొన్ని ఫిటెనెస్ ట్రాకింగ్ పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. వాటిని ధరించటం ద్వారా రోజులో ఎంతసేపు ఎన్ని అడుగులు వేశామో తెలుసుకోవచ్చు. ఎక్కువ సమయం కుర్చీలకే పరిమితం కాకుండా మధ్యమధ్యలో లేచి అటు ఇటు తిరగాలి. శారీర కదలికల ద్వారా శరీరంలోని క్యాలరీలను కొంతమేర కరిగించ వచ్చు.

మంచి ఆరోగ్యానికి ఆహారం ఎంత ముఖ్యమో అలాగే రోజు వారి వ్యాయామం కూడా అంతే అవసరం. వ్యాయామాలు చేయమంటే పెద్ద పెద్ద కసరత్తులు చేయాల్సిన అవసరం లేదు. సమయం దొరికినప్పుడల్లా 5నిమిషాలపాటు వేగంగా నడవటం వంటివి చేస్తే సరిపోతుంది. శరీరంలో కదలికల కారణంగా చురుకుగా ఉండేందుకు, పనిపై దృష్టి పెట్టేందుకు అవకాశం ఏర్పడుతుంది.