Strange Creature : ఇసుకలో వేగంగా ఈదే వింత జీవి .. భూమిలోనే జీవితం

నీటిమీద ఈత కొట్టే జీవుల గురించి తెలుసు..నేలమీద వేగంగా పరిగెత్తగలిగే జంతువులు, పక్షుల గురించి తెలుసు. కానీ ఇసుకలో ఈత కొట్టే జీవి గురించి తెలుసా..?

Pink Fairy Armadillo

Pink Fairy Armadillo : ఈ ప్రపంచంలో ఎన్నో రకాల జీవులు. వింత వింత జీవులను ఆలవాలం ఈ భూమి. కొన్ని నేలమీద జీవిస్తే మరికొన్ని నీళ్లల్లో జీవిస్తాయి. ఇంకొన్ని నీటిమీద నేలమీద కూడా జీవించగలుగుతాయి. వాటినే మనం ఉభయ చరాలు అంటాం. కానీ మరికొన్ని జీవులు ఇసుకలోను..భూమిలోను కూడా జీవిస్తుంటాయి. అటువంటి ఓ వింత జీవి గురించి తెలుసుకుందాం..

సాధారణంగా ఇసుకల్లో జీవించే జంతువులు అంటే ఎడారి పాములే గుర్తుకొస్తాయి. ఎడారి పాములు ఆహారం కోసం ఇసుకలో దూరి దాక్కొని ఏదైనా చిన్న చిన్న జంతువుల వాటి సమీపంలోకి వస్తే అంతే ఒక్కసారే దాడి చేసి పట్టేసి మింగేస్తాయి. ఇలా ఇసుకలో జీవించే జీవులు చాలానే ఉన్నా..ఓ జీవి మాత్రం ఇసుకలో సైత ఈజీగా ఈత కొట్టేస్తుంది. ఇసుకలో దూరిపోయి వేగంగా ఒకచోటి నుంచి మరోచోటికి వెళ్లిపోతుంది.

నీటిలో ఈత కొట్టినంత ఈజీగా ఇసుకలో వేగంగా వెళ్లిపోయే ఆ వింత జీవి పేరు పింక్ ఫెయిరీ ఆర్మడిల్లో (Pink Fairy Armadillo). వీటిలో చాలా జాతులే ఉన్నాయి. లేత గులాబీ రంగులో ఉండటం వల్ల దీన్ని పింక్ ఫెయిరీ ఆర్మడిల్లో అంటారు. ఈ జీవి చూడటానికి ముద్దుగా ఉంటుంది.చిన్న కళ్లు, ముడతలు ముడతలుగా ఉండే శరీరం. బుజ్జ బుజ్జి కాళ్లతో భలే క్యూట్ గా ఉంటుంది. ఇది నేలమీద కంటే ఇసుకలో చాలా ఫాస్టుగా ఒకచోటి నుంచి మరోచోటికి వెళ్లిపోతుంది. అందుకే దీన్ని ఇసుకలో ఈతకొట్టే జీవి అంటారు.

Dogs : ఇలాంటి పొజిషన్‌లో ఉన్న కుక్కల జోలికెళ్లొద్దు .. మీద పడి రక్కేస్తాయి..

వీపుపై మడతలుగా కనిపించేలా డొప్ప, ముందరి పాదాలకి బలమైన గోళ్ళు చిన్న మొహంతో చూడగానే వింతగా ఉంటుంది.దీన్ని పట్టుకుని చేతిలోకి తీసుకుంటే చక్కగా అరచేతిలో కుదురుగా కూర్చుంటుంది. 5 అంగుళాలు పొడుగు..120 గ్రాముల బరువు ఉంటుంది. ఇసుక లో చాలా ఫాస్ట్ గా ఈదుతుంది. పాదాలతో ఇసుకను దోచుకుంటూ చాలా వేగంగా ముందుకు వెళుతుంది. అందుకే దీన్ని ఇసుకలో ఈదే జీవి అంటారు. ఇవి నేలలో గొయ్యి తవ్వుకునో అందులో నివసిస్తాయి.

వాటికి ఏదైనా ప్రమాదం వచ్చినట్లు అనిపిస్తే క్షణాల్లో గొయ్యి తవ్వేసుకుని దాక్కుండిపోతాయి. దీంతో ఏ జంతువైనా వీటిపై ఎటాక్ చేద్దామనుకంటే తర్రుమని గొయ్యిలోకి వెళ్లిపోతుంది. ఇవి రాత్రులు ఆహారం కోసం బయటకు వస్తాయి. చీమలు వాటి లార్వాలను ఎంతో ఇష్టంగా తింటాయి. చిన్న పురుగులు, నత్తలు, వానపాములు, మొక్కల వేళ్లను తిని జీవిస్తుంటాయి. దీని తోక కదలకుండా బిగుసుకుని ఉంటుంది.

సెంట్రల్ అర్జెంటీనాల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఐదు నుంచి 10 ఏళ్లు జీవిస్తాయి. ఇసుక మైనాలు వీటి ఆవాసాలు. అలాగే గడ్డి భూముల్లో కూడా జీవిస్తుంటాయి. ఇవి గులాబీ రంగు, తెలుపు రంగుల్లో కూడా ఉంటాయి. పుల్లులు, కుక్కలకు ఇవి ఆహారం అయిపోతుంటాయి. వీటి బొచ్చు సిల్కులా ఉంటుంది. ఇవి క్షీరదాలు. వీటి సంఖ్య అంతకంతకు తగ్గిపోతోందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.