Strawberries
Strawberries : పుల్లపుల్లగా ఉండే ఎర్రటి స్ట్ర్రాబెర్రీ పండ్లను ఇష్టపడని వారుండరు. కేవలం రంగు, రుచే కాదు ఆరోగ్యపరంగానూ ఎన్నో ప్రయోజనాలనిస్తాయి. స్ట్రాబెర్రీలో విటమిన్, ఫైబర్ అధికంగా ఉంటాయి. పాలీఫెనాల్స్ తో పాటు పెద్ద మొత్తంలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. అంటువ్యాధులు దరిచేరకుండా చూడటంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.
కప్పు స్ట్రాబెర్రీ పండ్ల నుంచి 11 గ్రాముల పిండిపదార్థాలు, 8 గ్రా, ప్రొటీన్ అందుతాయి. కొవ్వులు చాలా తక్కువ. వీటి నుంచి 4 గ్రాముల కెలొరీలు లభిస్తాయి. ఇందులోని విటమిన్-సి ఇమ్యూనిటీని పెంచడమే కాకుండా యాంటీ ఆక్సిడెంట్‌లా పనిచేసి వృద్ధాప్య ఛాయలను రాకుండా చూస్తుంది. అలాగే రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. ఈ పండ్లలో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. కాబట్టి వీటిని తరచూ తీసుకుంటే రక్తపోటు అదుపులో ఉంటుంది.
అలాగే జలుబు, ప్లూ లాంటి సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి. గుండెకు మేలు చేస్తాయి. ఈ పండులో మాంగనీస్, పొటాషియం, విటమిన్ సి, విటమిన్ బి 9 పుష్కలంగా ఉన్నాయి. కొవ్వును తగ్గించడంలో సాయపడతాయి. వీటిలోని విటమిన్-ఎ కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. స్ట్రాబెర్రీలను సలాడ్ రూపంలో తీసుకోవచ్చు. వీటిలోని పీచు జీర్ణక్రియ చక్కగా సాగేలా చేస్తుంది. అజీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. గ్యాస్ , మలబద్ధకం సమస్య ఉండదు. పిల్లలు, పెద్దలు, గర్భిణులు అందరూ తినొచ్చు. నేరుగా తింటే ప్రయోజనాలన్నీ అందుతాయి.
ఎర్రగా నిగనిగలాడే ఈ పండ్లు తింటే చర్మం కాంతిమంతంగా మారుతుంది. ఈ పండులోని ఫ్లేవనాయిడ్స్ మెదడులో వాపులను తగ్గిస్తాయి. అలాగే వయసు రీత్యా వచ్చే మతిమరపును తొందరగా రానీయవు. దీంట్లోని ఫోలేట్, విటమిన్-సి, ప్లేవనాయిడ్స్ క్యాన్సర్ సంబంధిత వ్యాధులు రాకుండా అడ్డుకుంటాయి. శరీరం మెటబాలిజమ్ ను నియంత్రిస్తుంది. బరువు నియంత్రణలో ఉండేలా చేస్తుంది.
స్ట్రాబెర్రీలు తినటం వల్ల చర్మం కాంతి వంతంగా మారుతుంది. గర్భిణీలు స్ట్ర్రాబెర్రీలు తినడం వల్ల పుట్టబోయే బిడ్డకు, తల్లికి కూడా అవసరమయ్యే ఫోలిక్ యాసిడ్ అందుతుంది. కళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. పుట్టే బిడ్డలో కాంట్రాక్ట్స్ లోపాలు, ద్రుష్టిలోపం లేకుండా నివారిస్తుంది. స్ట్రాబెర్రీలను ఫ్రూట్ సలాడ్ రూపంలో తీసుకోవడం వల్ల చాలా తేలికగా జీర్ణమవుతుంది.