స్టడీ: అంత ఎట్రాక్టీవ్ గా కనిపించనివాళ్లు… మేం చాలా అందంగా ఉన్నారనుకుంటారు!

  • Publish Date - September 3, 2020 / 09:44 PM IST

ఆకర్షణగా కనిపించేవాళ్ల కంటే అంతగా ఆకర్షణీయంగా లేనివాళ్లలో ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంటుందని ఓ అధ్యయనం వెల్లడించింది. తమను తాము అతిగా ఊహించుకుంటారంట.. అందంగా ఆకర్షణీయంగా ఉండేవాళ్లలో తామెంటో ఒక అంచనా ఉంటుందని తేలింది. అదే అందంగా ఆకర్షణీయంగా లేనివాళ్లలో తామే అందంగా ఉన్నామనే ఊహాల్లో బతికేస్తుంటారంట.. అందంగా లేనివాళ్లు తామే తమను ఎక్కువగా అంచనా వేస్తారు..



అదే ఆకర్షణీయమైన వ్యక్తులయితే మాత్రం తమ అందాన్ని తక్కువగా అంచనా వేస్తారని పేర్కొంది. ఆకర్షణీయంగా కనిపించేవారిలో డబ్బు సంపాదించడంతో పాటు ఇతరుల నుంచి సాయం పొందడం వంటి విషయాల్లో ముందుంటారని అధ్యయనాలు చెబుతున్నాయి. అందంగా లేని వ్యక్తుల్లో సామర్థ్యం తక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది.. తామే అందంగా ఉంటామని అతిగా ఊహించుకుంటారు. ఆకర్షణీయం కాని వ్యక్తులు తమ అందం గురించి ఎలా ఆలోచిస్తుంటారో అధ్యయనం ఫలితాలు సూచించాయి.

అసలు అందగా ఉన్నవారికి అందగా లేనివారి మధ్య ఎలాంటి మనస్తత్వాలు ఉంటాయో కొన్ని అధ్యయనాలు చేశారు.. స్కాండినేవియన్ జర్నల్ ఆఫ్ సైకాలజీలో ఆరు అధ్యయనాలు చేశారు. ఇందులో పాల్గొనేవారిలో ఎవరూ అందగా ఉన్నారో రేట్ ఇవ్వాలని అధ్యయనాలు కోరాయి. మొదటి అధ్యయనంలో తమను తాము అందంగా ఊహించుకునేవారంతా తక్కువ ఆకర్షణీయంగా ఉండేవారి జాబితాలోనే ఎక్కువ మంది ఉన్నారని అధ్యయనాల్లో కనుగొన్నారు.



అందగా లేనివారు ఎక్కువగా తమను తాము ఎందుకు ఎక్కువగా ఊహించుకుంటారంటే? పాజిటివ్ సెల్ఫ్ ఇమేజ్ పెంచుకోవాలనే కోరికే వారిలో బలంగా ఉండటమే కారణమంట.. ఈ అధ్యయనంలో పాల్గొన్నవారిని మనసత్వానికి సంబంధించి ప్రశ్నలు అడిగారు.. ఇందులో వారు తమను తాము ఎక్కువగా అందంగా ఊహించుకున్నట్టు గుర్తించారు.

అదే అందంగా ఆకర్షణంగా ఉన్నవారిని అడిగిన ప్రశ్నలకు.. వారు తమ అందాన్ని ఎక్కువగా అంచనా వేయలేదని కనుగొన్నారు. అందంగా లేనివారిలో తమ లోపాలను గుర్తించగల నైపుణ్యం లేదంటున్నారు అధ్యయన నిపుణులు.. లేని అందాన్ని కొనితెచ్చుకునే ప్రయత్నాలు చేస్తుంటారని.. ఆకర్షణీయమైన వ్యక్తులకు వీరికి మధ్య తేడా ఇదేనని స్పష్టం చేశారు.



ఇంకా చెప్పాలంటే.. అందంగా లేని వ్యక్తులు తమ రూపాన్ని ఎక్కువగా అంచనా ఎందుకు వేస్తారనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది.. అందమనేది వ్యక్తిత్వంలో ఉండాలే తప్పా… అందమైన శరీరంలో కాదని గుర్తించాలని సూచిస్తున్నారు.. అందమైన వ్యక్తుల్లో తమను తాము అంచనా వేసుకోగల సామర్థ్యం ఉంటుందని అందుకే వారంతా హుందాగా ఉంటారని చెబుతున్నారు…