Tea, Cofee
Tea And Coffee : మారిన ఆహారపు అలవాట్లు,ఒత్తిడి, జీవనశైలి కారణంగా అనేక మంది దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు. ముఖ్యంగా దీర్ఘ కాలిక సంబంధిత వ్యాధులైన బిపి , షుగర్ లు చాలా మంది ఇబ్బందిపడాల్సి వస్తుంది. సాధారణంగా రక్తపోటు 120/80 ఎంజిహెచ్ ఉండాలి. రక్తపోటు పెరిగితే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అలసట, బలహీనత, తలనొప్పి, ఛాతీ నొప్పి లాంటివి కనిపిస్తాయి. బిపి సమస్య తలెత్తకుండా ఉండాలి అంటే కొన్ని సూచనలను పాటించాలి అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా టీ,కాఫీలు తాగే అలవాటు ఉంటే మాత్రం అలాంటి వారు జాగ్రత్తగా ఉండటం మంచిదని సూచిస్తున్నారు.
అలసట నుండి ఉపశమనం పొందడానికి ఒక రోజులో మూడు నాలుగు సార్లు టీ, కాఫీ లు త్రాగడానికి ఇష్టపడతారు. మరి కొందరు గంట గంటకి టీ, కాఫీ తాగే అలవాటును కలిగి ఉంటారు. కానీ ఈ అలవాటు రక్త పోటును అధికంగా పెంచుతుంది. రక్తపోటును నియంత్రించుటకు మీరు టీ, కాఫీ వినియోగాన్ని తగ్గించుకోవడం చాలా శ్రేయస్కరం. ఇందులో ఉండే కెఫీన్ మరియు ఇతర రసాయనాలు బీపీ రావడానికి సహాయపడుతాయి. ఆందోళన, ఒత్తిడి ఉంటే టీ తాగకూడదు. టీ తాగితే బీపీ పెరిగే అవకాశం ఉంది. దీర్ఘకాలం సంతోషంగా జీవించాలంటే అధిక రక్తపోటు ఉన్న రోగులు కెఫిన్‌ను ఎక్కువగా తీసుకోరాదు. కెఫీన్‌ను అధికంగా తీసుకోవడం వల్ల బీపీ రోగులకు హాని కలుగుతుంది. అధిక రక్తపోటు ఉన్నవారు మూత్ర విసర్జనలో మంటగా ఉన్నట్లయితే అలాంటి వారు టీకి దూరంగా ఉండాలి. టీ ఎక్కువగా తాగడం వల్ల ఛాతీ, పొట్టలో మంట వస్తుంది.
ఇటీవలి కాలంలో అనేక రోగాలు వైట్ రైస్, షుగర్ మరియు సాల్ట్ లను అధికంగా తీసుకోవడం వలన ఎక్కువగా వ్యాధులు వస్తున్నాయి. కాబట్టి మీరు తీసుకునే ఆహారంలో తగిన మేరకు మాత్రమే ఉప్పును వినియోగించాలి. అధికంగా తీసుకోరాదు అలాగే ఫాస్ట్ ఫుడ్స్ లో ఉప్పు శాతం ఎక్కువగా ఉంటుంది అందుకే బయట ఫుడ్ ని ఎక్కువగా తీసుకోరాదు అనడానికి ఇది కూడా ఒక కారణం. ఉప్పులో ఉండే సోడియం రక్తపోటును పెంచుతుంది. కాబట్టి ఉప్పును ఆహారంలో పరిమితికి మించి వినియోగించరాదు. చిప్స్, ఊరగాయలు మొదలైన ప్యాక్డ్ ఫుడ్స్‌లో సోడియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. వాటికి దూరంగా ఉండాలి. ధూమపానం, మద్యం సేవించడం మానుకోండి. ఇది ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. ఆల్కహాల్, పొగాకు తీసుకోవడం వలన కూడా రక్తపోటు పెరుగుతుంది. కాబట్టి మద్యపానానికి మరియు పొగాకుకు దూరంగా ఉండాలి. బీపీని అదుపులో ఉంచుకోవాలంటే ప్రాణాయామం, యోగా, వ్యాయామం వంటివి తప్పనిసరిగా చేయడం మంచిది.