Dandruff : చుండ్రు సమస్యతో బాధపడుతున్నారా… వేపాకుతో పరిష్కారం ఇదిగో

మధుమేహం, స్కిన్ అలర్జీలు, పిగ్మెంటేషన్, చుండ్రు, మాడుపై దురద, పొడిబారిన స్కాల్ఫ్, పింపుల్స్, యాక్నే సమస్యలను నివారించడంలోనూ వేపాకు సహాయపడుతుంది. అధిక చుండ్రు సమస్యతో బాధపడేవారు

Dandruff : ఇటీవలికాలంలో అధికశాతం మంది ఎదుర్కొనే జుట్టు సమస్యలలో చుండ్రు సమస్య ఒకటి. వాతావరణ కాలుష్యం, ఒత్తిడి, దుమ్ముదూళీలో ప్రయాణాలు వెరసి చుండ్రు సమస్య ఏర్పడుతుంది. దీనివల్ల జుట్టు రాలిపోతుంది.మార్కెట్లో దొరికే ఎన్నో ఉత్పత్తులను ఉపయోగించినప్పటికీ కొందరిలో ఈ చుండ్రు సమస్యనుండి ఏమాత్రం బయటపడలేని పరిస్ధితి. సమస్య తగ్గినట్టే తగ్గి తిరిగి మొదలవ్వటంతో విసుగుచెందుతారు. ఇలాంటివారు ఇంటి సమీపంలో దొరికే వేపాకుతో చుండ్రును ఈజీగా తొలగించుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.

ప్రకృతిసిద్ధంగా లభించే వేపాకులో ఎన్నో మెడికల్ గుణాలున్నాయి. చుండ్రుతో బాధపడేవారు వేపాకు ద్వారా ఆ సమస్య నుంచి విముక్తి పొందవచ్చు. యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు వేపాకులో మెండుగా ఉన్నాయి. ఈ క్రమంలోనే వేపాకును గత కొన్ని వందల సంవత్సరాల నుంచి ఆయుర్వేదంలో విరివిగా ఉపయోగిస్తున్నారు.

మధుమేహం, స్కిన్ అలర్జీలు, పిగ్మెంటేషన్, చుండ్రు, మాడుపై దురద, పొడిబారిన స్కాల్ఫ్, పింపుల్స్, యాక్నే సమస్యలను నివారించడంలోనూ వేపాకు సహాయపడుతుంది. అధిక చుండ్రు సమస్యతో బాధపడేవారు ముందుగా కొన్ని వేపాకులను నీటిలో వేసి బాగా మరిగించాలి. ఆ నీరు మొత్తం ఆకుపచ్చగా మారే వరకు నీటిని ఉడికించి వాటిని చల్ల పరచుకోవాలి.ముందుగా మన జుట్టును షాంపూతో శుభ్రం చేసుకుని ఆ తర్వాత చల్లగా అయినటువంటి ఈ వేపాకు నీటితో కడగటం వల్ల చుండ్రు సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేయడం వల్ల చుండ్రు సమస్య నుంచి విముక్తి పొందవచ్చు.

అదేవిధంగా వేడి చేసిన నూనెను చల్లబరచి అందులోకి ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, కొద్దిగా ఆముదం కలిపి ఒక సీసాలో భద్రపరుచుకోవాలి. ఈ విధంగా భద్రపరచుకున్న వేపనూనెను వారానికి రెండు సార్లు తలకు పట్టించి ఒక గంట తర్వాత తలస్నానం చేయాలి. ఇలా చేయటం వల్ల వల్ల చుండ్రు సమస్య తొలగిపోతుంది.

మెంతులు, పెరుగు, వేపాకు ఈ మూడు చుండ్రు సమస్యకు మంచి పరిష్కారంగా ఉపయోగపడతాయి. మెంతులు జుట్టును స్ర్టాంగ్, షైనీగా మారుస్తాయి. వేపాకు, మెంతులలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలున్నాయి. పెరుగు కండిషనర్ లా పనిచేస్తుంది. ఈ హెయిర్ ప్యాక్ ద్వారా చుండ్రు సమస్య తగ్గడమే కాదు, దురద కూడా తగ్గిపోతుంది. నానబెట్టిన మెంతులు, వేపాకు, పెరుగు సమానంగా తీసుకుని పేస్ట్ లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి గంట తర్వాత శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

 

ట్రెండింగ్ వార్తలు