Sleep Deprivation : నిద్ర లేమి సమస్యతో బాధపడుతున్నారా ? దానిని నుండి బయటపడటానికి నిపుణుల అభిప్రాయాలు

రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. ఇన్ఫెక్షన్లు, అనారోగ్యాలకు దారితీస్తుంది. నిద్రలేమి శరీర జీవక్రియకు అంతరాయం కలిగిస్తుంది, బరువు పెరిగే అవకాశాలను పెంచుతుంది. అధిక రక్తపోటు, గుండె జబ్బులు మరియు స్ట్రోక్ వంటి హృదయ సంబంధ సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. మొత్తం ఆరోగ్యం కోసం నాణ్యత గల నిద్రకు ప్రాధాన్యత ఇవ్వడం చాలా ముఖ్యం.

Sleep Deprivation : తగినంత నిద్ర లేకపోవడం మొత్తం ఆరోగ్య శ్రేయస్సును తీవ్రంగా దెబ్బతీస్తుంది. తగినంత నిద్ర లేనప్పుడు దానిని నిద్ర లేమి , నిద్ర లోపంగా చెప్పవచ్చు. నిద్ర లేమి వివిధ మార్గాల్లో వ్యక్తమవుతుంది. ఇది వ్యక్తికి వ్యక్తికి మారుతూ ఉంటుంది. కొంతమంది వ్యక్తులు ఆరు గంటల నిద్రతో బాగా పని చేయగలుగుతారు. మరికొందరికి ఎనిమిది గంటలు లేదా అంతకంటే ఎక్కువ సమయం అవసరం అవుతుంది. నిద్ర నాణ్యత, నిద్ర పరిమాణం రెండూ నిద్ర యొక్క కీలకమైన అంశాలు.

READ ALSO : Lemon And Fenugreek Water : ఉదయం నిద్రలేవగానే మెంతులు, నిమ్మకాయ నీరు త్రాగటం వల్ల బరువు తగ్గుతారా ? దీన్ని ఎలా సిద్ధం చేయాలంటే ?

సాధారణంగా, మనం పగటిపూట బాగా పనిచేయడానికి సగటున ఏడు నుండి ఎనిమిది గంటల నాణ్యత గల నిద్ర అవసరమని నిపుణులు చెబుతున్నారు. స్లీప్ అప్నియా,(Sleep apnea) అనియంత్రిత మధుమేహం వంటి అంతర్లీన పరిస్థితుల కారణంగా నిద్ర లేమి కావచ్చు. రాత్రిపూట తరచుగా మూత్రం విసర్జించవలసి రావటం, కీళ్ళనొప్పుల కారణంగా చాలా మంది రాత్రిపూట
మేల్కొంటారు.

అదేవిధంగా, బైపోలార్ డిజార్డర్ (Bipolar disorder) వంటి మానసిక పరిస్థితులు, పార్కిన్సన్స్ వ్యాధి వంటి నాడీ సంబంధిత సమస్యలు కూడా నిద్రలేమికి కారణమౌతాయి. నిద్ర లేమి మన శారీరక, మానసిక మరియు భావోద్వేగ ఆరోగ్యంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. అభిజ్ఞా విధులను దెబ్బతీస్తుంది, ఏకాగ్రత, నిర్ణయం తీసుకోవడం, సంఘటనలు, స్థలాలు , పేర్లను గుర్తుంచుకోవడంలో ఆటంకాలు కలిగిస్తుంది. మానసిక కల్లోలం, చిరాకు మరియు అధిక స్థాయి ఒత్తిడికి దారితీస్తుంది.

READ ALSO : Milk : పాలు నిద్రపట్టేలా చేస్తాయి ఎందుకు ?

రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. ఇన్ఫెక్షన్లు, అనారోగ్యాలకు దారితీస్తుంది. నిద్రలేమి శరీర జీవక్రియకు అంతరాయం కలిగిస్తుంది, బరువు పెరిగే అవకాశాలను పెంచుతుంది. అధిక రక్తపోటు, గుండె జబ్బులు మరియు స్ట్రోక్ వంటి హృదయ సంబంధ సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. మొత్తం ఆరోగ్యం కోసం నాణ్యత గల నిద్రకు ప్రాధాన్యత ఇవ్వడం చాలా ముఖ్యం.

నిద్ర లేమి తొలగించుకోవటానికి చిట్కాలు :

షెడ్యూల్‌ ప్రకారం నిద్ర :  ప్రతిరోజూ ఒకే సమయంలో పడుకోవటం, అదే విధంగా ఒకే సమయంలో మేల్కోవటం చేయాలి. అలాగే వారాంతాల్లో కూడా ఇదే అలవాటు కొనసాగించాలి.

రిలాక్సింగ్ బెడ్‌టైమ్ : పడుకునే ముందు, చక్కగా స్నానం చేసి, మంచి పుస్తకాన్ని చదవటం, లేదంటే విశ్రాంతినిచ్చే సంగీతాన్ని వినడం చేయాలి.

READ ALSO : చక్కటి నిద్ర కోసం ఇలా చేయండి..

కెఫీన్, నికోటిన్ మరియు ఆల్కహాల్‌కు దూరంగా : ఈ పదార్థాలు నిద్రకు అంతరాయం కలిగిస్తాయి. మిమ్మల్ని మేల్కొని ఉండేలా చేస్తాయి. కాబట్టి వాటికి దూరంగా ఉండాలి.

క్రమం తప్పకుండా వ్యాయామం : రోజూ శారీరక శ్రమ మంచి నిద్రకు దోహదం చేస్తుంది. రోజువారి వ్యాయామాల వల్ల నిద్రను సులభతరం చేస్తుంది.

నిద్రకు అనుకూలమైన వాతావరణం: పడకగదిని చల్లగా, చీకటిగా , నిశ్శబ్దంగా ఉంచడం ద్వారా నిద్ర బాగా పడుతుంది. అదే సమయంలో అధిక-నాణ్యత, సౌకర్యవంతమైన పరుపులు (mattress) మరియు దిండ్లు పడగదిలో ఉండేలా చూడండి.

READ ALSO : నిద్రలో గురక పెడుతున్నారా?

పడుకునే ముందు స్క్రీన్ సమయాన్ని నివారించటం : పడుకునే ముందు ఎలక్ట్రానిక్ పరికరాలను ఉపయోగించకుండా ఉండటం మంచిది. వాటి వల్ల నీలి కాంతి మన
సహజ నిద్రకు భంగం వాటిల్లేలా చేస్తుంది.

ఒత్తిడిని తగ్గించండి: ఒత్తిడిని తగ్గించడానికి , విశ్రాంతిని ప్రోత్సహించడానికి ధ్యానం, లోతైన శ్వాస , యోగా వంటి ఉపశమన పద్ధతులను అనుసరించండి.

పగటి సమయంలో నిద్రపోండి : పగటిపూట ఒక చిన్న కునుకు నిద్ర మిమ్మల్ని అప్రమత్తంగా, రిఫ్రెష్‌గా ఉండటానికి సహాయపడుతుంది.

READ ALSO : మీ నిద్రను పాడు చేస్తున్న అలవాట్లు ఇవే!

దీర్ఘకాలిక నిద్ర లేమి శారీరక, మానసిక మరియు భావోద్వేగ ఆరోగ్యంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది, నిరాశ, ఊబకాయం, హృదయ సంబంధ వ్యాధుల బారిన పడే ప్రమాదాన్ని పెంచుతుంది. మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తగినంత నిద్ర చాలా అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. నిరంతర నిద్ర సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే, వైద్యుల సూచనలు , సలహాలు పొందటం మంచిది.

ట్రెండింగ్ వార్తలు