Summer Drinks Bottle Gourd Juice Health Benefits Telugu
Bottle Gourd Juice : సొరకాయలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా? సొరకాయను కూరగా తీసుకోవడం కంటే.. జ్యూస్‌గా తీసుకుంటే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. సొరకాయలో లభించే విటమిన్లు, పొటాషియం, ఐరన్, పీచు పదార్థాలతో ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. అధిక బరువుతో బాధపడేవారు ప్రతిరోజూ సొరకాయ జ్యూస్ తాగాలని నిపుణులు సైతం చెబుతున్నారు. సొరకాయ జ్యూస్ (Sorakaya Juice) తాగడం ద్వారా తొందరగా బరువు తగ్గవచ్చు. ఎందుకంటే ఇందులోని పీచుపదార్థం జీర్ణక్రియను బాగా మెరుగుపరుస్తుంది.
Read Also : Lemon Juice : అన్నికాలాల్లో ఆరోగ్యానికి మేలు చేసే నిమ్మరసం!
అంతేకాదు.. అధిక రక్తపోటుతో బాధపడేవారికి సొరకాయ జ్యూస్ (Bottle Gourd Juice) దివ్యౌషధంగా పనిచేస్తుంది. సొరకాయలో లభించే పొటాషియంతో అధిక రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవచ్చు. నిత్యం ఈ సొరకాయ జ్యూస్ తాగడం ద్వారా కాలేయ సంబంధిత సమస్యలను నివారించుకోవచ్చు. సొరకాయ జ్యూస్ నేరుగా తాగడం మంచిది.. అందులో ఎలాంటి ఐస్ క్యూబ్స్ వేయకూడదు. అందులోనూ ఉదయాన్నే లేవగానే పరిగడుపున ఈ సొరకాయ జ్యూస్ తాగితే మరిన్ని అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు. ఇంతకీ సొరకాయ జ్యూస్ ఎలా తయారుచేసుకోవాలో తెలుసా? అయితే ఈ కింది విధంగా ఫాలో అవ్వండి..
Summer Drinks Bottle Gourd Juice Health Benefits Telugu
కావాల్సిన పదార్థాలివే (Bottle Gourd Juice) :
– మీడియం సైజులో సొరకాయ తీసుకోండి..
– 10 పుదీనా ఆకులు తీసుకోండి.
– కొద్దిగా అల్లం ముక్క తీసుకోండి.
– రుచికి సరిపడా బ్లాక్ సాల్ట్
– అరకప్పు ఐస్ క్యూబ్స్
– నిమ్మకాయ ఒకటి చాలు
తయారీ ఎలా.. (Bottle Gourd Juice) :
సొరకాయ తొక్కతీసేయండి..
శుభ్రంగా కడిగి ముక్కలుగా తరగాలి.. ఆపై మిక్సీలో వేయాలి.
తొక్కతీసిన అల్లం, పుదీనా, రుచికి సరిపడా బ్లాక్‌సాల్ట్, ఐస్ క్యూబ్స్‌వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని పలుచటి వస్త్రంలో వడగట్టి జ్యూస్ తీయాలి.
ఈ జ్యూస్‌లో నిమ్మరసం పిండి తాగేయడమే..
Read Also : Carrot Juice : ఆరోగ్యానికి మేలు చేసే క్యారెట్ జ్యూస్! ప్రయోజనాలు తెలిస్తే?