Blood Sugar And Cholesterol : రక్తంలో షుగర్ లెవల్స్ , కొలెస్ట్రాల్ తగ్గాలంటే వీటిని తీసుకోండి !

ఫైబర్ అనేది శరీరం అరిగించుకోలేని కార్బోహైడ్రేట్ రకం. ఇది ఫైబర్ చక్కెర అణువులుగా విభజన చెందదు. బదులుగా శరీరం ద్వారా జీర్ణం కాకుండా కదులుతుంది. అందుకే ఓట్స్, చియా సీడ్స్, బాదం, బీన్స్, పప్పులు, యాపిల్స్‌లో ఉండే కరిగే ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోమని నిపుణులు చెబుతారు.

Blood Sugar And Cholesterol :

Blood Sugar And Cholesterol : శరీరం ఎలాంటి అనారోగ్యాల బారిన పడకుండా ఉండాలంటే ఆరోగ్యవంతమైన ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. దీనిని తీసుకోవడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు. ఏదైనా పని ఉన్న రోజు త్వరగా అలసిపోవడం, నీరసం, శక్తి తగ్గడం జరుగుతుంది. ఈ సంకేతాలన్నీశక్తి తగ్గిందన్న దానికి సంకేతంగా నిలుస్తాయి. అయితే, కొన్ని రకాల ఆహారాలు తీసుకోవడం అందులోని పోషకాలు జీవక్రియను మెరుగుపరిచి తక్షణ శక్తిని అందిస్తాయి. అధిక శక్తిగల ఆహారాలు మనకు తక్షణ శక్తిని అందిస్తాయి. అంతేకాకుండా కొలెస్ట్రాల్, రక్తంలో షుగర్ లెవల్స్ ను సమతుల్యంగా ఉండేలా సహాయం చేస్తాయి. అలాంటి కొన్ని ఆహారాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

1. కార్బోహైడ్రేట్ ఫుడ్స్ ; కార్బోహైడ్రేట్ ఆహారం ఆరోగ్యానికి మంచిది కాదని చాలా మంది చెప్తుంటారు. కానీ, వాస్తవానికి ఈఆహారాలు కేలరీల రూపంలో శక్తిని ఇస్తాయి. వాటిని మనం తీసుకునే పరిమాణాన్ని దృష్టిలో ఉంచుకుంటే మంచిది. పిండి పదార్థాలు శరీరానికి కావాల్సిన శక్తిని సమకూర్చటానికి మంచి వనరులు. ఇవి సెరటోనిన్ స్థాయిలను పెంచుతాయి. దీంతో స్థూల పోషకాలలో ప్రోటీన్స్, కొవ్వుల కంటే శక్తి లభిస్తుంది. కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం వల్ల శక్తి, మానసిక స్థితి రెండు మెరుగుపడుతుంది.

READ ALSO : Forgetfulness : మతిమరుపును పోగొట్టే ఆహారాలు ఇవే? వీటిని రోజువారిగా తీసుకుంటే…

అదేక్రమంలో శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్స్ తినకోరాదు. ఎందుకంటే వీటి వల్ల రక్తంలో చక్కెర పెరుగుతుంది. అంతేకాకుండా మానసిక స్థితికి ఇబ్బంది కరంగా మారుతుంది. బ్రౌన్‌రైస్, హోల్ వీట్ బ్రెడ్, హై ఫైబర్ హోల్ గ్రెయిన్స్‌ వీటిలో తక్కువ జిఐ ఉన్న కార్బోహైడ్రేట్స్‌ని ఎంచుకోండి. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్‌ని మన బాడీ నెమ్మదిగా అబ్జార్బ్‌ చేసుకుంటుంది. రక్తంలో చక్కెరని స్థిరంగా ఉంచుతుంది.

2. ప్రొటీన్స్ ; ప్రోటీన్స్‌‌లో అతి ముఖ్యమైనది విటమిన్ బి12. ఇది ముఖ్యంగా జంతు ఉత్పత్తులలో సమృద్దిగా దొరుకుతుంది. ప్రోటీన్స్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ జీర్ణం కావడానికి కొంత సమయం పడుతుంది. ఎక్కువ సమయం పాటు కడుపు నిండుగా ఉన్న ఫీలింగ్‌ తోపాటు శక్తి అందుతుంది.

3. ఫైబర్ ; ఫైబర్ అనేది శరీరం అరిగించుకోలేని కార్బోహైడ్రేట్ రకం. ఇది ఫైబర్ చక్కెర అణువులుగా విభజన చెందదు. బదులుగా శరీరం ద్వారా జీర్ణం కాకుండా కదులుతుంది. అందుకే ఓట్స్, చియా సీడ్స్, బాదం, బీన్స్, పప్పులు, యాపిల్స్‌లో ఉండే కరిగే ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోమని నిపుణులు చెబుతారు. ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలు జీర్ణ వ్యవస్థకి మేలు కలిగిస్తాయి. ఇవి రక్తంలో కొలెస్ట్రాల్, చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి. ఆకలిని తగ్గిస్తాయి. కొద్ది మొత్తంలో తింటే ఎక్కువ తిన్నామన్న ఫీలింగ్ కలుగుతుంది. దీంతో త్వరగా బరువు తగ్గవచ్చు.

4. కెఫిన్ ; కెఫీన్ అనేది సహజ నాడీ వ్యవస్థ ఉద్దీపన వంటిది. ఇది మెదడును యాక్టివేట్ చేస్తుంది. అలసటను తగ్గించి జ్ఞానాన్ని మెరుగు పడేలా చేస్తుంది. దీనిని తీసుకున్న గంటలోపే ప్రయోజనాలు కనిపిస్తాయి. సుమారు 5 గంటల పాటు దీని ప్రభావం ఉంటుదని నిపుణులు చెబుతున్నారు. శక్తితో పాటు, రీఫ్రెష్‌నిస్, కాన్సంట్రేషన్ పెరుగుతుంది. కాఫీని తీసుకునే విధంగానే తీసుకోవాలి. అప్పుడే ఈ ప్రయోజనాలను పొందవచ్చు..

READ ALSO : జీర్ణక్రియను మెరుగుపర్చడం ఎలా? ఇందుకోసం తీసుకోకూడని ఆహారాలు ఇవే?

5. వాల్ నట్స్ ; వాల్‌నట్స్‌లో పుష్కలంగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మేలు కలిగిస్తాయి. ఫ్రీ రాడికల్స్‌ని కంట్రోల్ చేయడంతోపాటు శక్తిని అందిస్తాయి. వాల్‌నట్స్‌లోని ఫైబర్ జీర్ణక్రియని నెమ్మదింపచేస్తుంది. దీంతో నెమ్మదిగా శోషణకు దారి తీస్తుంది. ఎక్కువకాలం కడుపు నిండుగా ఉండేలా చేస్తుంది.

6. టీ ; టీ ని చాలా మంది రోజువారిగా తీసుకుంటుంటారు. టీ, చక్కెర సోడాలు, కూల్‌డ్రింక్స్‌కి ప్రత్యామ్నాయంగా తీసుకోవచ్చు. దీని వల్ల శక్తి పెరుగుతుంది. దీని వల్ల రోజంతా యాక్టివ్‌గా ఉంటారు. టీ, కాఫీల్లోని కెఫిన్ మిమ్మల్ని యాక్టివ్ గా ఉంచేలా చేస్తాయి. మెదడులో చురుకుదనం ఉంటుంది.

ట్రెండింగ్ వార్తలు