Gadgets Effect : కళ్లపై గాడ్జెట్స్ ప్రభావం…ఇబ్బందికరమేనా?

కంప్యూటర్‌పై పనిచేసేటప్పుడు కొంత సమయం విరామం తీసుకోవాలి. కళ్ళు పొడిగా ఉంటే, కంటి చుక్కలను ఉపయోగించడం మంచింది.

Gadgets Effect : ఇటీవలి కాలంలో చిన్నారుల నుండి పెద్దల వరకు అందరిలో కంటి సమస్యలు అధికమయ్యాయి. దీనికి కారణం కరోనా తరువాత వారి రోజు వారి దినచర్యలో మార్పు రావటమే..తమ కార్యకలాపాలన్నీ కంప్యూటర్లు, సెల్ ఫోన్లు వంటి పైనే అధారపడి కొనసాగుతుండటంతో చూపు సమస్యలు తలెత్తుతున్నాయి. అదే పనిగా సెల్ ఫోన్ , కంప్యూటర్ కాంతి కంటిపై పడుతుండటం వల్ల కళ్లు అలసటకు లోనవుతున్నాయి. కంటిలో నొప్పిగా ఉండటం, మంటలు రావటం, మసకగా కనిపించటం వంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి.

అదే క్రమంలో కంటితోపాటు వాటి ప్రభావం మెదడుపై కూడా ఉంటుంది. సెల్ ఫోన్ ల నుండి వెలువడే రేడియేషన్ కారణంగా మెదడు కణాలు పెరిగి చివరకు క్యాన్సర్ కు దారితీసి ప్రాణాంతకంగా మారే అవకాశాలు ఉన్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు. కళ్లపై ఒత్తిడిని నివారించడానికి కంప్యూటర్లు ఇతర గాడ్జెట్‌లను వినియోగించే వారు డార్క్ మోడ్ వినియోగించటం వల్ల కొంత సౌకర్యవంతంగా ఉంటుంది. అప్పుడప్పుడు కంటి రెప్పలను అటు ఇటు కదిలిస్తూ ఉండటం, మెడను అటు ఇటు తిప్పటం వంటివి చేయాలి. దీని వల్ల కళ్లు స్ట్రెయిన్, డ్రైనెస్ వంటి సమస్యలు రాకుండా చూసుకోవచ్చు.

కంప్యూటర్‌పై పనిచేసేటప్పుడు కొంత సమయం విరామం తీసుకోవాలి. కళ్ళు పొడిగా ఉంటే, కంటి చుక్కలను ఉపయోగించడం మంచింది. కంటి సమస్యను విస్మరిస్తే మరింత ప్రమాదకరంగా మారేందుకు అవకాశం ఉంది. కంటిలో నొప్పిగా అనిపిస్తే నీటిని వేడి చేసి అందులో దూదిని ముంచి అనంతరం కళ్ళపై ఉంచుకోవాలి. కాసేపు అలా ఉంచటం వల్ల కళ్లకు ఉపశమనం లభిస్తుంది. కళ్ల అలసటను పోగొట్టేందుకు చల్లని నీళ్లతో కళ్లను కడుగుతుండాలి. ఇలా చేయటం వల్ల కళ్లపై వత్తిడిని తగ్గించుకోవచ్చు.

ట్రెండింగ్ వార్తలు