TROLLING
TROLLING : కర్రలు.. రాళ్లతో కొడితే శరీరంపై దెబ్బలు తగులుతాయి. కానీ మాటలు మనుష్యుల్ని మానసికంగా కుంగదీస్తాయి. బ్రతికుండగానే జీవచ్ఛవం చేస్తాయి. ఒక మనిషిని కుంగదీయడం.. అవమానించడం.. సమస్యలను సృష్టించడం.. ఇవన్నీ చేయడానికి ఇప్పుడు సోషల్ మీడియా కొందరికి ఆయుధంగా మారింది. ట్రోల్స్ పేరుతో ఇతరుల భావోద్వేగాలను అవమానపరచడం కొందరికి పనిగా మారింది. అసలు ట్రోలింగ్ అంటే ఏమిటి?
Adipurush : అప్డేట్ అవ్వండిరా అంటారు.. అప్డేట్ అయినా ట్రోల్ చేస్తారు.. ఆదిపురుష్ డిస్ట్రిబ్యూటర్!
కొందరిలో విపరీతమైన మనస్తత్వం ఉంటుంది. ఎప్పుడూ వివాదాలను సృష్టించమే లక్ష్యంగా ఉంటారు. ఎప్పుడూ రెచ్చగొట్టే చర్చలు చేయడం.. ఇతరులను అవమానించడం.. అభ్యంతరకరమైన మెసేజ్‌లు చేయడం ..క్యారెక్టర్‌ను తక్కువ చేసి మాట్లాడటం చేస్తుంటారు. ఇలాంటి వారు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఎక్కువగా ఉంటారు. ట్రోల్స్ చేయడానికి నకిలీ ఐడెంటిటీలను వాడతారు. ట్రోలింగ్ చేయడానికి ముఖ్యంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు, ఇంటర్నెట్ చాట్‌రూమ్‌లు, ఈమెయిల్ లేదా వాట్సాప్ గ్రూపులు, కొన్ని ప్రత్యేక చర్చా వేదికలు, బ్లాగులు ఎంచుకుంటారు.
ఇక జనం ట్రోలింగ్ ఎందుకు చేస్తారు.. అనే అంశం మీద అనేక సంస్థలు పరిశోధనలు చేసాయి. మానసిక సమస్యల కారణంగా ఈ విధంగా వ్యవహరిస్తారని వారి పరిశోధనలు చెబుతున్నాయి. ఈ అంశంపై మనస్తత్వ వేత్తలు మరియు డిజిటల్ వెల్‌బీయింగ్ నిపుణులతో అనేక చర్చల అనంతరం కారణం ఇదేనని వారు నిర్ణయానికి వచ్చారట. సామాజికంగా, మానసికంగా ఏదైనా బలమైన సమస్యలు ఎదుర్కుంటున్న వ్యక్తులు ట్రోల్ చేస్తారని కూడా తెలుస్తోంది. అయితే చిన్నతనంలో బాగా గాయపడ్డవారు లేదా తల్లితండ్రుల సంరక్షణలో క్రమశిక్షణ లేకుండా పెరిగిన వారు .. మానసికంగా తీవ్రమైన సమస్యలు ఎదుర్కుంటున్నవారు.. వేటాడే జంతువుల స్వభావం కలిగిన వారు.. రాజకీయ నాయకులు, వ్యక్తిగతంగా కావాలని కొందర్ని టార్గెట్ చేసేవారు వారిని ఈ ట్రోలర్స్ జాబితాలో చేర్చారు.
బెదిరించడం, విమర్శలు చేయడం, తప్పుడు ఆరోపణలు చేయడం.. టార్గెట్ చేసిన వ్యక్తిని వేధించేలా ఇతరులను ప్రోత్సహించడం.. డాటా చోరీ చేయడం.. కిట్టని వ్యక్తుల పేరుతో వస్తువులు, సేవలు ఆర్డర్ చేయడం రకరకాల అంశాలు లక్ష్యంగా ట్రోల్స్ చేస్తుంటారు. సోషల్ మీడియా పేజీలలో టార్గెట్ చేసిన వ్యక్తి గురించి పరువు నష్టం కలిగించేలా , అవమానకరమైన పోస్టులు పెడతారు. తమకు నచ్చని వ్యక్తి పేరుతో అశ్లీల కంటెంట్‌తో నకిలీ బ్లాగులు, సోషల్ మీడియా పేజీలు కూడా క్రియేట్ చేస్తుంటారు.
ట్రోల్స్ ఎదుర్కొనలేక మానసికంగా కుంగిపోయిన వారు.. ఆత్మహత్యలకు పాల్పడినవారు.. సామాజిక మాధ్యమాల నుంచి దూరంగా జరిగిపోయిన వారు.. పరువు పోయిందని డిప్రెషన్‌లోకి వెళ్లిపోయిన వారు.. ఎంతోమంది బాధితులు ఉంటారు. అలాంటి వారు సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్‌లలో తాను ట్రోల్ చేయబడుతున్నానని ఒక నోట్ ఇవ్వడంతో పాటు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయడం ద్వారా.. డిజిటల్ వెల్‌బీయింగ్ మరియు ఇంటర్నెట్ ఎథిగ్స్ సపోర్ట్ గ్రూపులకు ఇన్ఫామ్ చేయడం ద్వారా ట్రోల్స్‌ను ఎదుర్కోవచ్చు. సైబర్ బెదిరింపులతో ట్రోలింగ్ సమస్య పరిష్కారం కాకపోతే ప్రభుత్వ సంస్థలతో కలిసి పనిచేసే కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా ప్రజల తరపున పోరాడుతున్నాయి. వాటికి ఫిర్యాదు చేసినా ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.
Bhola Shankar : భోళా శంకర్ పోస్టర్ పై దారుణమైన ట్రోల్స్.. మెహర్ రమేష్ ని ఆడేసుకుంటున్న మీమర్స్..
ట్రోల్ చేస్తున్న వారి మాటలను అందరూ నమ్మకపోవచ్చు. మొదటగా మీ మీద మీకు నమ్మకం ఉండాలి. మిమ్మల్ని నమ్మేవారు ఎవరైతే ఉంటారు ఈ ట్రోల్స్‌కి ప్రాధాన్యత ఇవ్వరు. ట్రోల్ చేస్తున్న వారిని బ్లాక్ చేయడం అత్యుత్తమమైన పని. చాలా యాప్‌లలో ‘రిపోర్ట్’ ఆప్షన్ కూడా ఉంటుంది. ట్రోల్స్‌ని కంట్రోల్ చేయడంలో ఇది ఉపయోగపడుతుంది. ఒకవేళ ట్రోల్స్ మీకు బాధ అనిపిస్తే నచ్చిన వారితో షేర్ చేసుకోండి. బురదలో రాయి వేస్తే మనకే తగులుతుంది. ట్రోల్స్‌కి స్పందించడం కూడా అలాంటిదే. సామాన్యుడి నుంచి సెలబ్రిటీ వరకూ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ఎంతోమంది ట్రోల్స్ బారిన పడినవారే. కొన్ని ఫన్నీగా .. కొన్ని ఆట పట్టించేవిగా ఉండే వాటిని లైట్ తీస్కోవచ్చు. కానీ సామాజికంగా ఇబ్బందులకు గురిచేసే ట్రోలర్స్‌ని ఎదుర్కోవాలంటే ముందు మనం మానసికంగా బలంగా ఉండాలి. ట్రోల్స్‌కి చెక్ పెట్టాలి.