Antiviral Foods : శక్తివంతమైన వైరస్ సంహారకాలు ఇవే…

వైరస్ ను సమర్థంగా నిరోధించే గుణం పుట్టగొడుగులకు ఉంటుంది . వీటితో రుచికరమైన సూప్ తయారుచేసుకొని తాగొచ్చు. దీంట్లో మిరియాలు, కొత్తిమీర, ధనియాలు వేసుకుంటే ఆరోగ్యం , రుచి రెండూ సొంతమౌతాయి.

Antivirals (1)

Antiviral Foods : మనకు అందుబాటులో ఉండే దినుసులు, ఆహారాల్లో అనేక ఔషదగుణాలు ఉంటాయి. మన శరీరానికి హానికలిగించే సాధారణ వైరస్ ల నుండి రక్షణ కల్పించటంలో ఇవి ఎంతో దోహదం చేస్తాయి. వీటిని మనరోజువారి ఆహారంలో భాగం చేసుకోవటం వల్ల ఆరోగ్యపరమైన సమస్యలను రాకుండా చూసుకోవచ్చు. సాధారణ సమస్యలకు ఇవి చక్కని ఔషదంగా పనిచేస్తుండటంతో పూర్వం నుండి వీటి వాడకం కొనసాగుతూ వస్తుంది. సహజ వైరస్ సంహారకాలుగా చెప్పబడే వాటి గురించి మీరు తెలుసుకోండి…

1) తులసి : ఇది అద్భుతమైన వైరస్ సంహారిణి. రోజూ ఉదయాన్నే 10,15 తులసి ఆకుల్ని నమిలి తినేయాలి. దీని వల్ల చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు దూరమౌతాయి.

2) పుట్టగొడుగులు : వైరస్ ను సమర్థంగా నిరోధించే గుణం పుట్టగొడుగులకు ఉంటుంది . వీటితో రుచికరమైన సూప్ తయారుచేసుకొని తాగొచ్చు. దీంట్లో మిరియాలు, కొత్తిమీర, ధనియాలు వేసుకుంటే ఆరోగ్యం , రుచి రెండూ సొంతమౌతాయి. సూప్ తాగలేనివారు దానిని కూరగా వండుకొని తినొచ్చు.

3) గ్రీన్ టీ ,బ్లాక్ టీ : ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. వీటిలో ఈ పాలీఫినాల్స్ , వైరస్ లు వ్యాప్తి చెందకుండా అడ్డుకుంటాయి. బ్లాక్ టీ లో అల్లం లేదా దాల్చిన చెక్క వేసుకుని తాగితే మరింత ఫలితం ఉంటుంది. మానసిక ఆందోళనలు తగ్గుతాయి.

4) పెరుగు : తాజా పెరుగు తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరానికి కావలసిన శక్తి అందుతుంది. అలాగని పులిసింది వాడకూడదు. పులిసింది తీసుకుంటే గ్యాస్ వంటి సమస్యలు ఎదురవుతాయి.

5) బ్రకోలీ : దీనికి ఫ్లూ ను తగ్గించే గుణం ఉంది. ఇందులో విటమిన్ సి, ఇ ,పుష్కలంగా ఉంటాయి. అంతే కాకుండా ఆరోగ్యపరంగా ఎంతో మేలు చేస్తుంది.

6) శొంఠి : అల్లాన్ని సున్నపు నీటిలో ఉడికించి ఎండబెట్టి శొంఠి తయారు చేస్తారు. టీ లో వేసుకుని లేద కషాయంగా చేసుకుని తాగొచ్చు. ఆల్లం కంటే శొంఠి తీసుకోవడం మంచిది. ఇది జ్వరాన్ని తగ్గిస్తుంది. దగ్గుని నియంత్రిస్తుంది. దగ్గు వచ్చేసమయంలో కఫం బయటకు వెళ్లేలా చేస్తుంది. శొంఠి, పిప్పళ్లు, మిరియాలు ఈ మూడింటినీ కలిపి తీసుకుంటే జలుబు, దగ్గు, కఫం తగ్గుతాయి.

7) దాల్చిన చెక్క : శరీరంలో వైరస్ వృద్ధిని నియంత్రిస్తుంది. విరేచనాలు అవ్వకుండా చూస్తుంది. టీలో చేసుకుని తాగితే మంచిది. జ్వరం నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

8) పసుపు : వేడిపాలల్లో పసుపు వేసుకుని రాత్రి పడుకునేముందు తాగితే తెల్లారేసరికి ఫలితం కనిపిస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.